ఐశ్వర్య రజనీకాంత్

వికీపీడియా నుండి
(ఐశ్వర్య ధనుష్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఐశ్వర్య రజనీకాంత్
2019లో ఐశ్వర్య ఆర్. ధనుష్
జననం
ఐశ్వర్య రజనీకాంత్

(1982-01-01) 1982 జనవరి 1 (వయసు 42)[1][2]
మద్రాసు, తమిళనాడు, భారతదేశం
(ప్రస్తుతం చెన్నై)
వృత్తిదర్శకురాలు, నేపధ్యగాయని
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
జీవిత భాగస్వామి(2004 - 2022)[3]
పిల్లలు2
తల్లిదండ్రులురజనీకాంత్
లతా రజనీకాంత్
బంధువులుసౌందర్య రజినీకాంత్ (సోదరి)

ఐశ్వర్య రజినీకాంత్ ధనుష్ (జననం: 1982 జనవరి 1) భారతీయ సినీ దర్శకురాలు. ఆమె భారతీయ నటుడు రజినీకాంత్ పెద్ద  కుమార్తె. ఆమె తన భర్త ధనుష్ కథానాయకుడిగా తన మొదటి సినిమా 3 (2012) కు దర్శకత్వం వహించింది. అప్పుడప్పుడూ నేపథ్య గాయనిగా కూడా మారింది ఐశ్వర్య.

ఆగస్టు 2016లో ఐశ్వర్యను యు.ఎన్ విమెన్ సంస్థ భారతదేశ గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంచుకొంది.[4] కానీ కొన్నాళ్ళకే ఆమె ఆ పదవిని  నిర్వహించిన తీరును భారతీయ మీడియా తప్పుపట్టింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఐశ్వర్య నటుడు రజనీకాంత్, లతా రంగాచారి దంపతులకు 1982 జనవరి 1న జన్మించింది.[5] [6] ఆమెకు చిత్ర పరిశ్రమలో కూడా పనిచేసే సౌందర్య అనే చెల్లెలు ఉంది.[7] ఐశ్వర్య భారతీయ సినీ నటుడు ధనుష్ ను వివాహం చేసుకుంది.[8] ఆమెకు ఇద్దరు కుమారులు యాత్ర (జననం 2006), లింగా (జననం 2010).

డిసెంబర్ 2016 లో, ఐశ్వర్య. ఆర్. ధనుష్ తన స్వంత చరిత్రను స్టాండింగ్ ఆన్ యాన్ ఆపిల్ బాక్స్: ది స్టోరీ ఆఫ్ ఎ గర్ల్ అమాంగ్ ది స్టార్స్ ను విడుదల చేసింది.[9] ఈ పుస్తకంతో ఆమె ఒక సెలబ్రిటీ బాలికగా తన కెరీర్ ఎంపికలు, వివాహం, రజనీకాంత్ కుమార్తెగా తన జీవితాన్ని వెల్లడించింది.

జీవితం

[మార్చు]

ఆగష్టు 2011 లో ఆమె తన భర్త, శ్రుతి హాసన్ ల జంటగా తన మొదటి చలన చిత్రం 3 కు దర్శకత్వం వహిస్తానని ప్రకటించింది. ధనుష్ తన భార్య దర్శకత్వంలో నటించిన ఏకైక చిత్రమని స్పష్టం చేసాడు.[10] ఆమె బంధువు అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన సౌండ్‌ట్రాక్‌లోని "వై దిస్ కోలవేరి డి" పాట వైరల్ అయి ఇంటర్నెట్ దృగ్విషయంగా మారిన తర్వాత ఈ చిత్రం విడుదలకు ముందే చాలా ఆకట్టుకుంది. వీడియో తయారీలో ఆమె ప్రధాన తారాగణం, స్వరకర్తతో కలిసి కనిపించింది. ఔత్సాహిక చిత్ర నిర్మాతలు వాస్తవ విషయాలు, లఘు చిత్రాలను ప్రత్యేకంగా ప్రోత్సహించడానికి "టెన్ ఎంటర్టైన్మెంట్" పతాకంపై త్వరలో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించనున్నట్లు జూలై 2015 లో ఐశ్వర్య ప్రకటించింది. [11]

ఆమె స్టార్ విజయ్ నిర్వహిస్తున్న జోడీ నంబర్ ఒన్ డాన్స్ పోటీలు మూడవ సీజన్లో నటులు సంగీత, జీవాతో కలిసి న్యాయమూర్తిగా ఉంది.[12] సిలంబరాసన్‌తో కలిసి విజిల్ చిత్రంతో ఆమె నేపధ్యగాయనిగా మారింది. ఆ తర్వాత ఆయిరథిల్ ఓరువన్ చిత్రంలో "అన్ మేళా ఆశాధన్" పాట వచ్చింది. దీని కోసం ఆమె అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేసింది.[13]

ఆగస్టు 2016 లో ఐశ్వర్య ఐరాస మహిళా సంస్థకు భారత సౌహార్ద రాయబారిగా ఎంపికయింది..

విమర్శలు

[మార్చు]

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐరాస ప్రధాన కార్యాలయంలో ఆమె భరతనాట్యం ప్రదర్శించింది. అయితే, ఆమె నటనకు సోషల్ మీడియా,సాంఫ్రదాయక భరతనాట్యం నాట్యకారుల నుండి అనేక విమర్శలు వచ్చాయి.[14][15][16] అనిత రత్నం తన ఫేస్‌బుక్ లో "భరతనాట్యం అవుతుంది ... వ్యంగ్య చిత్రం, ప్రహసనం!". అని విమర్శించింది.[17]

పురస్కారాలు

[మార్చు]

2012 లో జెఎఫ్ఎ ఉమెన్ అచీవర్స్ అవార్డులలో ఆమె న్యూస్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది.[ఆధారం చూపాలి]

మూలాలు

[మార్చు]
  1. "Aishwarya is my lucky charm: Dhanush". The Times of India. 31 December 2011. Retrieved 29 July 2016.
  2. PTI (23 March 2016). "Aishwarya R. Dhanush to Release Autobiography 'Standing on an Apple Box'". India West. Archived from the original on 2016-07-12. Retrieved 2016-07-29. The 34-year-old daughter of Rajinikanth
  3. Sakshi (17 January 2022). "హీరో ధనుష్‌, ఐశ్వర్య విడాకులు". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
  4. "Aishwaryaa R Dhanush appointed UN Goodwill Ambassador". Retrieved 2016-09-26.
  5. "70 persons get Kalaimamani awards". The Hindu. 2009-02-25. Archived from the original on 2011-01-30. Retrieved 2009-04-19.
  6. "Rajinikanth turns grandpa". The Hindu. 2006-10-12. Archived from the original on 2007-02-17. Retrieved 2009-04-19.
  7. Muthalaly, Susan (2005-07-01). "Silken choices to color your hair". The Hindu. Archived from the original on 2005-07-18. Retrieved 2009-04-19.
  8. "It is an all women drive". The Hindu. 2008-08-05. Archived from the original on 2008-08-08. Retrieved 2009-04-19.
  9. "Standing on An Apple Box: The Story of A Girl Among the Stars" by Aishwarya R. Dhanush
  10. Shankar (2011-12-03). "3 is my first and last movie under her Aishwarya's direction - Dhanush | 'மனைவி ஐஸ்வர்யா இயக்கத்தில் நான் நடிக்கும் முதலும் கடைசியுமான படம் '3'! - தனுஷ் - Oneindia Tamil". Tamil.oneindia.in. Archived from the original on 2012-01-07. Retrieved 2012-01-01.
  11. "Aishwarya Dhanush to launch YouTube channel". Archived from the original on 2015-10-01. Retrieved 2020-06-11.
  12. "Serials". The Hindu. 2008-09-26. Archived from the original on 2008-09-27. Retrieved 2009-04-19.
  13. "Aishwaryaa R Dhanush appointed UN Goodwill Ambassador". Retrieved 2016-09-26.
  14. "Aishwaryaa Dhanush's 'pathetic' Bharatnatyam performance at UN draws criticism". Indian Express.
  15. "Rajinikanth's Daughter Aishwaryaa Dhanush's Bharatanatyam Performance At UN Criticized". NDTV.
  16. "Aishwarya Dhanush performed "Bharatanatyam" at the UN, but not all were impressed". Hindustan Times.
  17. "Anita Ratnam slams Aishwaryaa Dhanush's Bharatnatyam!". Times of India.

బాహ్య లంకెలు

[మార్చు]