Jump to content

పల్లెటూరి మొనగాడు

వికీపీడియా నుండి
పల్లెటూరి మొనగాడు
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.ఎ.చంద్రశేఖర్
నిర్మాణం మిద్దే రామారావు
తారాగణం చిరంజీవి,
రాధిక
సంగీతం చక్రవర్తి
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
నిర్మాణ సంస్థ రాజ్యలక్ష్మి ఆర్ట్స్ మూవీస్
విడుదల తేదీ 1983 ఫిబ్రవరి 5
భాష తెలుగు

పల్లెటూరి మొనగాడు 1983 లో విడుదలైన సినిమా. ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మిద్దే రామారావు నిర్మించాడు. ఈ చిత్రంలో చిరంజీవి, రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీత దర్శకుడు.[1] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.

ఒక గ్రామంలో అసుపత్రిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన డాక్టరు హత్య కావడంతో సినిమా మొదలౌతుంది. ఆ హత్య వెనుక ఆ గ్రామానికి చెందిన జమీందారు‌ ఉన్నాడని అందరికీ తెలుసు. గ్రామస్తులకు మంచి సౌకర్యాలు అందుబాటు లోకి వస్తే వారిపై తనకు నియంత్రణ పోతుందని అతడి భయం. తన తండ్రి అసంపూర్ణ కలను పూర్తి చేయాలని నిశ్చయించుకున్న డాక్టర్ శాంతి (రాధిక) గ్రామానికి వస్తుంది. ఆమె రాజన్నను కలుస్తుంది. అతడు ఆమెకు చాలా సహాయకారిగా ఉంటాడు. కానీ, జమీందారుకు తనదైన క్రూరమైన ఉద్దేశాలు ఉన్నాయి. అతను డాక్టర్ శాంతిని కూడా చంపాలని యోచిస్తాడు. కాని రాజన్న ఆమెను రక్షిస్తాడు. ఆమెను చంపాలని జమీందారు చేసే ప్రయత్నాలన్నిటినీ రాజన్న వమ్ము చేస్తాడు. చివరికి జమీందారు‌ను చట్టానికి పట్టించి డాక్టర్‌శాంతి తన ఆసుపత్రిని సజావుగా నడిపించడానికి రాజన్న సహాయం చేస్తాడు.[2]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • పలుకే బంగారమా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల
  • అక్కుం బక్కుం , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • జడలోని బంతిపువ్వు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • ఎవ్వరోపెద్దోళ్ళు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • గుండెగది ఖాళీ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, నందమూరి రాజా.
  • శ్రీలక్ష్మీ వైష్ణవీదేవి శ్రీతజన (పద్యం), గానం.ఎస్ . పి. బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

[మార్చు]
  1. "పల్లేటూరి మొనగాడు నటీనటులు-సాంకేతిక నిపుణులు | Palletoori Monagadu Cast & Crew Details in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Archived from the original on 2020-08-06. Retrieved 2020-08-06.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-08-08. Retrieved 2020-08-06.