శోభ చంద్రశేఖర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శోభ చంద్రశేఖర్
జననం (1956-08-24) 1956 ఆగస్టు 24 (వయసు 67)
చెన్నై, భారతదేశం
వృత్తి
  • దర్శకురాలు
  • నిర్మాత
  • ప్లే బ్యాక్ సింగర్
క్రియాశీల సంవత్సరాలు1967–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఎస్.ఎ.చంద్రశేఖర్
పిల్లలువిజయ్
బంధువులుఎస్. ఎన్. సురేందర్
విక్రాంత్ (మేనల్లుడు)
విరాజ్

శోబా చంద్రశేఖర్ (జననం 1956 ఆగష్టు 24) భారతీయ నేపథ్య గాయని, సినిమా దర్శకురాలు, రచయిత, నిర్మాత. ఆమె తమిళ సినిమా దర్శకుడు ఎస్.ఎ.చంద్రశేఖర్ భార్య, నటుడు విజయ్‌కి తల్లి.[1][2]

తమిళనాడు ముఖ్యమంత్రిగా జె. జయలలిత ఉన్నప్పుడు ఆమెను ఆర్టిస్టిక్ హెరిటేజ్ కన్సల్టెంట్‌గా నియమించింది.[3]

ఎస్తెల్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ మిసెస్ చెన్నై అవార్డుతో ఆమెను సత్కరించింది.[4]

సంగీత శిక్షణ[మార్చు]

ఆమె తొలి గురువు మీనాక్షి సుందరం. తరువాత, తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలలో చేరింది. ఆ కళాశాలలోని విద్వాన్ టి.ఎమ్.త్యాగరాజన్ వంటి గొప్ప ఉపాధ్యాయుల వద్ద ఆమె సంగీతంలో శిక్షణ పొందింది. సంగీత కళాశాలలో కల్పకం స్వామినాథన్ దగ్గర వీణ వాయించే అవకాశం కూడా ఆమెకు లభించింది. అలాగే ఆమె మహారాజపురం సంతానం కుమార్తె బృందా త్యాగరాజన్ వద్ద కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుంది.[5]

సినిమా కెరీర్[మార్చు]

ఆమె లైట్ మ్యూజిక్ ట్రూప్‌లలో గాయని. తర్వాత సినిమాల్లో పాడటం మొదలుపెట్టింది. ఆమె మొదటి సినిమా పాట ఇరు మలర్గల్ (1967) చిత్రంలోని "మహారాజా ఒరు మహారాణి...".[6] ఆమె తన భర్త ఎస్. ఎ. చంద్రశేఖర్ సినిమాలకు అనేక కథలను రాసింది. ఆమె అనేక సినిమాలకు నిర్మాతగా, దర్శకురాలిగా కూడా వ్యవహరించింది. ఆమె అనేక శాస్త్రీయ సంగీత కచేరీలలో కూడా ప్రదర్శన ఇచ్చింది. ఆమె "అనైముగనుమ్ ఆరుముగనుమ్" పేరుతో భక్తి ఆల్బమ్‌ను విడుదల చేసింది,

ఆమె మొదటి లైట్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రాం ఏప్రిల్ 2003లో విజయ్ టీవీలో ప్రసారం చేయబడింది. ఈ ప్రోగ్రామ్ టైటిల్ "సమర్పణం". ఆమె మొదటి ప్రత్యక్ష కచేరీ మహారాజపురం సంతానం ట్రస్ట్ కోసం. తన భర్త తీసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ ఆమె పాడింది.

పది చిత్రాలను నిర్మించిన ఆమె 50కి పైగా కథలు రాసింది. ఆమె నన్బర్గల్ (1991), ఇన్నిసై మజ్హై (1992) అనే రెండు చిత్రాలకు దర్శకత్వం వహించింది. ఆమె 12 సినిమాలకు పైగా పాటలు ఆలపించింది.[7][8]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆమె 1973 ఏప్రిల్ 26న సినీ దర్శకుడు ఎస్. ఎ.చంద్రశేఖర్‌ను వివాహం చేసుకుంది. వీరి కుమారుడు విజయ్ తమిళ చిత్రసీమలో ప్రముఖ నటుడు. వారి కుమార్తె విద్య 2 సంవత్సరాల వయస్సులోనే మరణించింది. ఆమె సోదరుడు ఎస్. ఎన్. సురేందర్ కూడా నేపథ్య గాయకుడు.

మూలాలు[మార్చు]

  1. "Mothers Day special Interview with Illayathalapathy Vijay mother Shobha Chandrasekhar – Tamil Movie News – IndiaGlitz".
  2. "Exclusive biography of @actorvijay and on his life". filmibeat.com. Retrieved 28 November 2016.
  3. Jayalalitha gives new post to Vijay’s mom, Shoba Chandrasekar | Tamil Cinema News › Kollywood Movie News. Kollyinsider.com (2 November 2011). Retrieved 24 July 2016.
  4. Lakshmansruthi – ONLINE MUSIC DIRECTORY Archived 4 మార్చి 2016 at the Wayback Machine. Profiles.lakshmansruthi.com. Retrieved 24 July 2016.
  5. Lakshmansruthi – ONLINE MUSIC DIRECTORY Archived 4 మార్చి 2016 at the Wayback Machine. Profiles.lakshmansruthi.com. Retrieved 24 July 2016.
  6. "புதிய குரல்கள்; இளம் குருத்துகள்". Kalki. 18 November 1979. pp. 6–9. Retrieved 2023-03-14.
  7. Lakshmansruthi – ONLINE MUSIC DIRECTORY Archived 4 మార్చి 2016 at the Wayback Machine. Profiles.lakshmansruthi.com. Retrieved 24 July 2016.
  8. "Shobha Chandrasekhar Filmography". OneIndia. Archived from the original on 10 ఆగస్టు 2014. Retrieved 4 August 2014.