మారిన మనిషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మారిన మనిషి
(1970 తెలుగు సినిమా)
Marina Manishi.jpg
దర్శకత్వం సి.ఎస్.రావు
నిర్మాణం సుందర్ లాల్ నహతా
తారాగణం నందమూరి తారక రామారావు ,
విజయనిర్మల
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ శ్రీకాంత్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

మారిన మనిషి 1970 లో వచ్చిన యాక్షన్-డ్రామా చిత్రం, శ్రీకాంత్ ప్రొడక్షన్స్ పతాకంపై [1] ఎస్.ఎల్. నహతా, ఎస్. సౌదప్పన్ నిర్మించారు. సి.ఎస్.రావు దర్శకత్వం వహించాడు .[2] ఇందులో ఎన్.టి.రామారావు, విజయ నిర్మల ప్రధాన పాత్రలలో నటించారు [3] టీవీ రాజు సంగీతం సమకూర్చాడు.[4]

కథ[మార్చు]

రాజు (ఎన్.టి.రామారావు) పిక్-పాకెటర్. వజ్రాల హారం దొంగిలించి, తిరిగి వెళ్ళేటప్పుడు, పేరుమోసిన గజదొంగ రంగూన్ రంగన్న (సత్యనారాయణ) అతని నుండి లాక్కుంటాడు. రాజు తన తల్లి లక్ష్మమ్మ (హేమలత) తో కలిసి నివసిస్తున్నాడు. అతడి గురించిన నిజం ఆమెకు తెలియదు. రంగన్నకు గౌరవనీయ వ్యక్తిగా హోటల్ ప్రిన్స్ యజమాని భూపతిగా మరో రూపం ఉంది. కొంత సమయం తరువాత రాజు ఆ హారాన్ని భూపతి అన్నయ్య కుమార్తె తార (జ్యోతి లక్ష్మి) మెడలో చూసి, దాన్ని తిరిగి ఇవ్వమని అడుగుతాడు. అక్కడ నుండి, ఆమె అతన్ని ప్రేమించడం ప్రారంభిస్తుంది కాని అతను ఆమెను ప్రేమించడు. ఇంతలో, హోటల్ ప్రిన్స్ మేనేజర్ మూర్తి (రామకృష్ణ), తన భార్య జానకి (మణిమాల), ఒక బిడ్డతో, అతని తల్లి రాజమ్మ (మాలతి), సోదరి గౌరి (విజయ నిర్మల) లతో కలిసి సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్నాడు. మూర్తి ఒక కులాంతర వివాహం చేసుకోవడంతో అతను గోప్యంగా ఉంటాడు. సమాంతరంగా, భూపతి ఒక బ్యాంకు దోపిడీ చేస్తాడు. ఇది మూర్తి గ్రహించినప్పటికీ భయంతో మౌనంగా ఉంటాడు. ఒకసారి గౌరి మూర్తిని కలవడానికి నగరానికి వచ్చినపుడు, రాజు ఆమె పర్సును దొంగిలిస్తాడు. అదే సమయంలో, ఆమెను గూండాలు కిడ్నాప్ చేస్తారు, రాజు ఆమెను రక్షించి సురక్షితంగా మూర్తి వద్దకు పంపుతాడు. ఆ సమయంలో, ఇద్దరూ ప్రేమలో పడతారు. మూర్తి గౌరిని వెనక్కి పంపించి భూపతిని అప్పు అడుగుతాడు. భూపతి అతనికి బ్యాంకు నుండి దొంగిలించిన నకిలీ కరెన్సీని ఇస్తాడు. డబ్బు పంపించడానికి మూర్తి పోస్టాఫీసుకు చేరుకుంటాడు. మళ్ళీ రాజు ఆ డబ్బును దొంగిలిస్తాడు. షాక్ అయిన మూర్తి గుండెపోటుతో చనిపోతాడు. రాజు కవర్ తెరిచినప్పుడు వారి దయనీయ పరిస్థితిని అర్థం చేసుకుని, వెంటనే మూర్తి ఇంటిని పరుగెత్తుతాడు. అక్కడ మూర్తి చనిపోయి ఉంటాడు. ఇక్కడ రాజు తన పాపాలను గుర్తించి, వారి గ్రామానికి చేరుకుంటాడు. గౌరి మూర్తి సోదరి అని తెలుసుకుని వారి అప్పును తీరుస్తాడు

ఆ తరువాత, ఒక సాధువు బాబా (చిత్తూరు నాగయ్య) బోధనతీ రాజా మారిన మనిషై కష్టపడి పనిచేసి జీవించడం మొదలు పెడతాడు. తరువాత అతడు భూపతి అసలు రూపాన్ని బయట పెట్టి పోలీసులకు ఎలా పట్టిస్తాడనేది మిగతా కథ

నటవర్గం[మార్చు]

సాంకేతిక సిబ్బంది[మార్చు]

పాటలు[మార్చు]

ఎస్. పాట పేరు సాహిత్యం గాయకులు పొడవు
1 "ఏం చేస్తావోయ్ బుల్లెమ్మా" దాశరథి ఎస్పీ బాలు, ఎస్.జానకి 2:28
2 "చినవాడ ఓయ్ వెళతావా" సి.నారాయణ రెడ్డి ఎస్పీ బాలూ, వసంత 4:06
3 "చక్కని దొంగోడా" కోసరాజు వసంత 3:39
4 "నువ్వే నాకు తారక మంత్రం" రాజశ్రీ ఎస్పీ బాలు, ఎల్.ఆర్ ఈశ్వరి 3:36
5 "దొంగతనం పనికిరాదు" దాశరథి ఎస్పీ బాలు 4:21
6 "అయ్యయ్యో" దాశరథి ఎల్.ఆర్ ఈశ్వరి 2:40
7 "అమృతం కావాలా" దాశరథి పి. సుశీల 5:31

మూలాలు[మార్చు]

  1. Marina Manishi (Banner). Chitr.com.
  2. Marina Manishi (Direction). Filmiclub.
  3. Marina Manishi (Cast & Crew). gomolo.com.
  4. Marina Manishi (Review). The Cine Bay.