నేనే మొనగాణ్ణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేనే మొనగాణ్ణి
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.డి.లాల్
తారాగణం నందమూరి తారక రామారావు,
షీలా
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ ప్రతిమ ఫిల్మ్స్
భాష తెలుగు

నేనే మొనగాణ్ణి 1968, అక్టోబర్ 4న విడుదలైన తెలుగు సినిమా. ఎస్.డి.లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, షీలా, రాజనాల కాళేశ్వరరావు, ధూళిపాళ, కైకాల సత్యనారాయణ, శాంతకుమారి, జ్యోతిలక్ష్మి తదితరులు నటించారు.[1]

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

బందిపోటు భద్రయ్య (రాజనాల) కొడుకు నానీ. భద్రయ్య దోపిడీలు చేస్తూ జీవిస్తాడు. పోలీస్ అధికారి నందనరావు (కైకాల సత్యనారాయణ) భద్రయ్యను బంధించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈతని భార్య పండరీబాయి. ఒకసారి భద్రయ్యను పట్టించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నందనరావును చంపేస్తాడు. అతను తప్పించుకోడానికి ప్రయత్నిస్తుండగా ధూళిపాల అతడిని కాలుస్తాడు. ప్రాణ భయంతో పారిపోతూ పిల్లవాడిని వదిలేస్తాడు. నానీ పోలీసులకు చిక్కుతాడు. నానీ అమ్మా అని పిలిచే పిలుపుకు పిల్లలు లేని పండరీబాయి తల్లిగా పెంచి పెద్దచేస్తుంది. నానీ పెద్దవాడై వంశీ (ఎన్టీ ఆర్) గా మారతాడు. కథానాయకుడైన వంశీ ధూళిపాళ సహాయంతో తండ్రిని ఎలా బంధించాడన్నది మిగతా చిత్రకథ.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. గారడి చేసేస్తా నేనే గమ్మత్తు చేసేస్తా నవ్వని - ఘంటసాల, కె. ఎల్. రాఘవులు బృందం - రచన: దాశరధి
  2. చూస్కో నా రాజా చూస్కో ... వయసుంది సొగసుంది - ఎల్. ఆర్. ఈశ్వరి
  3. నిన్ను చూసింది మొదలు కలలే కలలే నిన్ను వలచింది - పి.సుశీల ( ఎన్.టి.రామారావు మాటలతో)
  4. వయసు పిలిచింది ఎందుకో నాలో వలపు విరిసింది అందుకో డార్లింగ్ - ఘంటసాల - రచన: డా. సి.నారాయణ రెడ్డి
  5. షోకిల్లా పిల్లా నిన్నే నిన్నే మెచ్చుకుంటుంది బాకల్లె - ఎల్. ఆర్. ఈశ్వరి, పి.సుశీల, ఘంటసాల

మూలాలు[మార్చు]

  • ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (6 October 1968). "నేనే మొనగాణ్ణి చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 4 October 2017.