బాగ్దాద్ గజదొంగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాగ్దాద్ గజదొంగ
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.యోగానంద్
చిత్రానువాదం డి.యోగానంద్
తారాగణం నందమూరి తారక రామారావు,
జయలలిత
సంగీతం టి.వి.రాజు
విజయ-కృష్ణమూర్తి
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పిఠాపురం నాగేశ్వరరావు,
పి.సుశీల,
ఎల్.ఆర్.ఈశ్వరి,
జిక్కి
నృత్యాలు చోప్రా,
చిన్నిసంపత్
గీతరచన సి.నారాయణరెడ్డి,
కొసరాజు,
సముద్రాల జూనియర్
సంభాషణలు సముద్రాల జూనియర్
ఛాయాగ్రహణం జి.కె.రాము
కళ ఎస్.కృష్ణారావు
కూర్పు జి.డి.జోషి,
జి.శివమూర్తి
నిర్మాణ సంస్థ పద్మగౌరి పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

బాగ్దాద్ గజదొంగ 1968, అక్టోబర్ 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. డి.యోగానంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జయలలిత జంటగా నటించారు.[1]

నటీనటులు

[మార్చు]

బాగ్దాద్ సుల్తాన్ షంషుద్దీన్ ఖాన్ (మిక్కిలినేని). అతని భార్య బేగమ్ సాహెబ్ (పండరీబాయి). యువరాజు ఫరూక్ పుట్టిన రోజున -నజరానాల పేరిట వజీరు హుస్సేన్ (రాజనాల) ప్రజలను బాధించటం తెలుసుకున్న సుల్తాను ఒక పేదవాడిని కాపాడబోయి వజీరు చేతిలో హత్యకు గురవుతాడు. బేగంను ఖైదు చేసి, యువరాజును అంతం చేయాలనుకున్న వజీరు కుట్ర సాగదు. అక్కడినుంచి తప్పించుకున్న యువరాజు, ఫకీర్ దాదా (ముక్కామల) ఆశ్రయంలో ఆబూ (ఎన్టీఆర్)గా పెరుగుతాడు. ధనికులను దోచి పేదవారికి పంచుతుంటారు ఆబూ, అతని మిత్రుడు ఆలీ (పద్మనాభం). చాద్రసుల్తాన్ (రేలంగి) కుమార్తె నస్రీమ్ (జయలలిత)ను వివాహం చేసుకోవాలన్న తలంపుతో ఆమె తండ్రికి ఆకాశ గమనంగల గుర్రం బహూకరించి, బదులుగా నస్రీమ్‌ను కోరతాడు వజీర్ హుస్సేన్. ఆ వివాహం ఇష్టంలేని నస్రీమ్ హుస్సేన్ బారినుంచి తప్పించుకుని, అంతకుమునుపే మనసిచ్చిన ఆబూను కలుసుకునేందుకు వెళ్లిపోతుంది. అలా వెళ్లిన నస్రీమ్ చివరకు బాగ్దాద్ వజీర్ చేతికే చిక్కుతుంది. ఆమెకోసం బాగ్దాద్ రాజ భవనం చేరిన ఆబూ, అక్కడ నస్రీమ్ సాయంతో తన తండ్రిని వజీరు హత్యచేసి, తల్లిని బంధించాడన్న నిజం తెలుసుకుంటాడు. నస్రీమ్, ఆలీల సాయంతో తల్లిని చెర విడిపించి, తన శక్తి యుక్తులతో వజీర్‌ను ఎదిరించి అంతం చేస్తాడు. కంటకుడిని హతమార్చి ప్రజాభిమానం చూరగొన్న ఆబూ, నస్రీమ్‌ను వివాహమాడి తల్లిసహా బాగ్దాద్ సుల్తాన్‌గా సింహాసనం అధిష్టించటంతో చిత్రం సుఖాంతమవుతుంది.

పాటలు

[మార్చు]
  1. ఎవడురా దొంగ ఎవడురా మేకతోలు కప్పుకున్న మెకములున్న - ఘంటసాల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  2. మేరే బుల్‌బుల్ ప్యారి వారేవా వయ్యారి ఒంటిగ చూసి చెంతకు - పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్. ఆర్. ఈశ్వరి
  3. రావే ఓ చినదానా అనురాగం దాచినదానా కొసచూపు - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  4. సై సై సరదారు దిల్‌దారు నీ సరదాలు వేరు నా చూపు బంగారు కైజారు - పి.సుశీల
  5. హాయ్ అల్లా ఎలాగా నేననుకోలేదు ఇలాగా నేను - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  6. జగమే మాయరా ఈ జగమే మాయరా

మూలాలు

[మార్చు]
  1. ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (27 October 1968). "బాగ్దాద్ గజదొంగ చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 16 October 2017.[permanent dead link]