యముడికి మొగుడు
స్వరూపం
| యముడికి మొగుడు (1988 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | రవిరాజా పినిశెట్టి |
| నిర్మాణం | హరిప్రసాద్, నారాయణరావు, సుధాకర్ |
| కథ | సత్యానంద్ |
| తారాగణం | చిరంజీవి, విజయశాంతి , రాధ, సుత్తివేలు, కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ (యముడు), అల్లు రామలింగయ్య (చిత్రగుప్తుడు), గొల్లపూడి మారుతీరావు, సూర్యకాంతం, రావుగోపాలరావు, బేతా సుధాకర్, సుత్తివేలు (విచిత్రగుప్తుడు), అన్నపూర్ణ, ప్రసాద్ బాబు, వై. విజయ్ |
| సంగీతం | రాజ్ - కోటి |
| నేపథ్య గానం | పి. సుశీల, ఎస్. జానకి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
యముడికి మొగుడు, 1988లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశాడు. ఇది బాగా విజయవంతమైంది. తరువాత రజనీకాంత్ హీరోగా తమిళంలో పునర్నిర్మింపబడింది. ఇలాంటి కథానేపథ్యంలో తెలుగులో దేవాంతకుడు, యమగోల, యమదొంగ లాంటి అనేక సినిమాలు విజయవంతమయ్యాయి.
కథ
[మార్చు]కాళి (చిరంజీవి) ఒక చిన్న పట్టణంలో చిన్నపాటి రౌడీ. తన సంపాదనతో సమాజానికి కొంత సేవ చేస్తుంటాడు కూడా. అలా అందరి అభిమానం సంపాదించుకొంటాడు. అతని బాస్ కోటయ్య (కోట శ్రీనివాసరావు). కోటయ్య ప్రత్యర్థి కైలాసం (గొల్లపూడి). కైలాసం కూతురు (రాధ)తో కాళీ ప్రేమలో పడతాడు. వారు పెళ్ళి చేసుకొందామనుకొంటారు. ఇది తెలిసిన కైలాసం కాళీని చంపిస్తాడు. చనిపోయిన కాళీ నరకానికి వెళతాడు. అక్కడ తనను అన్యాయంగా తెచ్చారని యముడితో (కైకాల సత్యనారాయణ) గొడవ పడతాడు. ఆ తరువాత కథ అనేక మలుపులు తిరుగుతుంది.
తారాగణం
[మార్చు]- చిరంజీవి
- విజయశాంతి
- రాధ
- కైకాల సత్యనారాయణ
- రావు గోపాలరావు
- అల్లు రామలింగయ్య
- గొల్లపూడి మారుతీరావు
- కోట శ్రీనివాసరావు
- బేతా సుధాకర్
- హరిప్రసాద్
- ప్రసాద్ బాబు
- సుత్తి వేలు
- అంబికా
- సూర్యకాంతం
- అన్నపూర్ణ
- వై.విజయ .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: రవిరాజా పినిశెట్టి
- చిత్రానువాదం: రవిరాజా పినిశెట్టి
- కధ: సత్యానంద్
- సంగీతం: రాజ్- కోటి
- గీత రచయితలు: వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి, పులపాక సుశీల, మనో
- ఛాయా గ్రహణం: కె.ఎస్.హరి
- కూర్పు: వెళ్లైస్వామి
- నిర్మాతలు: హరిప్రసాద్, జి.వి.నారాయణరావు, సుధాకర్
- నిర్మాణ సంస్థ: డైనమిక్ మూవీ మేకర్స్
- పంపిణీ సంస్థ: గీతా ఆర్ట్స్
- విడుదల:29:04:1988.
పాటలు
[మార్చు]- అందం హిందోళం, అధరం తాంబూలం , రచన వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- వానజల్లు గిచ్చుకుంటే ఎట్టాగమ్మా? రచన వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి . జానకి
- నొ నొ నొ నొ నొ నొ నొ నొ నో నో నో నాట్యమిదా? రచన వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- కన్నెపిల్లతోటి పిల్లగాడికొచ్చెనమ్మ పీకులాట , రచన వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- ఎక్కుబండెక్కుమామ, రచన: వేటూరి, గానం.మనో, పి సుశీల
- బహుశా నిన్ను బందర్లోలో , రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
