దేవాంతకుడు (1960)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిరంజీవి నటించిన 1984 నాటి సాంఘిక చలన చిత్రం కోసం దేవాంతకుడు (1984) చూడండి

దేవాంతకుడు
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.పుల్లయ్య
నిర్మాణం సి.హెచ్. సుబ్బారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణకుమారి,
యస్వీ రంగారావు,
కె.రఘురామయ్య
సంగీతం అశ్వత్థామ
నిర్మాణ సంస్థ భార్గవి పిక్చర్స్
భాష తెలుగు

దేవాంతకుడు సి.పుల్లయ్య దర్శకత్వంలో నందమూరి తారక రామారావు, కృష్ణకుమారి, ఎస్.వి. రంగారావు, కె. రఘురామయ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1960 నాటి సోషియో ఫాంటసీ చిత్రం.
లక్షాధికారి కుమార్తెను నాటకాల రాయుడు ప్రేమించి పెళ్ళాడగా తండ్రి ఆమెకు వేరే వివాహం చేయబోగా మరణిస్తుంది. పొరపాటున కథానాయకుణ్ణి కూడా యమభటులు యమలోకం తీసుకుపోగా యముడితో, ఇంద్రలోకంలో ఇంద్రునితో పోట్లాడి, శివపార్వతులను, శ్రీమహావిష్ణువును మెప్పించి భార్య ప్రాణాలు రక్షించుకుంటాడు. ఇంతలో ఇదంతా కలగా తెలిసి భార్యను కాపాడుకుంటాడు.
తెలుగులో విడుదలైన తొలి సోషియో ఫాంటసీ చిత్రం. మనిషి నరకానికి వెళ్ళటం, యమునితో గొడవ పడటం చిత్రకథ. అదే తరహాలో తర్వాత యమగోల, యమలీల, యముడికి మొగుడు, యమదొంగ మొదలైన చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రంలో యముడిగా ఎస్వీ రంగారావు, దేవాంతకుడిగా ఎన్టీ రామారావు నటించారు. గో గోంగూర పాట ఇందులోని హిట్ గీతం.

కథ[మార్చు]

నాటకాల రాయుడైన కథానాయకుడు (ఎన్టీఆర్) లక్షాధికారి కుమార్తె (కృష్ణకుమారి)ని ఆమె తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు. ఆమె తండ్రి తన కుమార్తెకి వేరే పెళ్ళి చేసేందుకు ఇంట్లో బంధిస్తాడు. తన భర్త ప్రాణాపాయంలో ఉన్నాడని ఎవరో చెప్పిన మాటలు విని హీరోయిన్ చెరువులో దూకుతుంది.
యమభటులు పొరపాటున తప్పుడు చిరునామాతో హీరోను యమలోకానికి తీసుకువెళ్తారు. యమలోకంలో యముడితో పోట్లాట, యముడి దున్నపోతు సహకారంతో యమస్థానాన్ని ఆక్రమించడం జరుగుతాయి. నారదుడి ద్వారా రాయబారం పంపి శ్రీమహావిష్ణువు శరణు వేడుకుంటాడు. మరోవైపు యముడి కోరిక మేరకు కథానాయకుడు అన్ని లోకాలూ చూసి వారంరోజుల తర్వాత యమలోకం తిరిగివచ్చేందుకు బయలుదేరతాడు. ఇంద్రలోకం వెళ్ళి ఇంద్రుడితో వాగ్వాదం పెట్టుకుని, ఆపైన పార్వతీ పరమేశ్వరులను దర్శనం చేసుకుని తన భార్యను బ్రతికించమని కోరుతాడు కథానాయకుడు. ఐతే అది శ్రీమహావిష్ణువు చేతిలో ఉందని శివుడు చెప్పగా తన మాటలో విష్ణుమూర్తిని మెప్పించి భార్యను బ్రతికించుకుంటాడు. ఇదంతా కలలా జరగగా కథానాయకుడు నిద్రలేచి తన భార్యను కాపాడుకుంటాడు.[1]

నిర్మాణం[మార్చు]

అభివృద్ధి[మార్చు]

పాటలు[మార్చు]

01. అన్నిలోకాలు తిరుగ నా ఆశయమ్ము రాసి ఇప్పించుమా (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర

02. ఇటు పక్కసూర్యుడే అటు పక్క ఉదయించి మహి ఒక్కసారిగా (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర

03. ఇలలో లేదోయి హాయీ ఇచటే గలదోయి వెదికినను అపురూప మధురాల - పి.లీల - రచన: ఆరుద్ర

04. ఎవని మంత్రము వల్ల హీన కిరాతుండు వాల్మీకిగా మారి (పద్యం) - కె. రఘురామయ్య - రచన: ఆరుద్ర

05. కలగంటినమ్మా కలికి చిత్రలేఖా కలలోని చెలికాడు కడు అందగాడు - ఎస్. జానకి

06. గో గో గోంగూరా జై జై జై జై ఆంధ్రా కోరుకో కోరుకొ - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి - రచన: ఆరుద్ర

07. జగమంతా మారినది జవరాల నీ వలనా జగమంత - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి - రచన: ఆరుద్ర

08. దేని మహిమచేత దివ్యలోకములన్నీ తిరుగులేక (పద్యం) - కె. రఘురామయ్య - రచన: ఆరుద్ర

09. ధర్మదేవతనగు నా ధర్శనంభు చేసుకొంటివి (పద్యం) - మాధవపెద్ది - రచన: ఆరుద్ర

10. ధూమకేతువట్లు తోచు ఖడ్గము పట్టి తెల్లగుర్రమెక్కి (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర

11. నీవెవరో నేనెవరో నెలతా ఇదేమి లోకమో - ఎస్. జానకి,పి.బి.శ్రీనివాస్

12. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ (భగవద్గీత శ్లోకం) - ఘంటసాల

13. పూరయ మమకామం గోపాల..వారం వారం వందన - కె.రఘురామయ్య

14. భూ: భువర్లోకాల పురమునందున నిన్ను తాళమేసిన (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర

15. శాంతాకారం భుజగశయనం పద్మనాభం ( సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల

16. శ్రీతజనపాలా శ్రీలోలా జరిగేదంతా నీలీల - కె. రఘురామయ్య

17. శ్రీదేవి సిత కమలాలయా నీ దివ్యపాదాలు సేవింతుమమ్మా - పి.లీల బృందం

వనరులు[మార్చు]

  1. ఆంధ్రభూమి, ప్రతినిధి (25 July 2016). "నాకు నచ్చిన చిత్రం.. దేవాంతకుడు". ఆంధ్రభూమి. Retrieved 23 April 2017.