యనమండ్ర నాగయజ్ఞ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వై. యన్‌. శర్మ
యనమండ్ర నాగయజ్ఞ శర్మ
వ్యక్తిగత సమాచారం
స్థానిక పేరువై. యన్‌. శర్మ
జన్మ నామంయనమండ్ర నాగయజ్ఞ శర్మ
మరణం2018, మే 1
చెన్నై
సంగీత శైలిసంగీత దర్శకుడు
వృత్తిసంగీత దర్శకుడు

యనమండ్ర నాగయజ్ఞ శర్మ (వై. యన్‌. శర్మ) వాయులీన విద్వాంసుడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

"వై.ఎన్‌.శర్మ" గా చిత్రపరిశ్రమలో సుపరిచితులైన నాగయజ్ఞ శర్మ వాయులీన విద్వాంసునిగా పేరొందారు. వయొలిన్‌ మాత్రమే కాకుండా తబలా, ఆర్కెస్ట్రా కండక్టింగ్‌.. ఇలా అన్నీ చేసేవారు. మాయాబజార్‌ చిత్రంతో ఘంటసాల వెంకటేశ్వరరావు దగ్గర అసిస్టెంట్‌గా చేరిన వై.ఎన్‌.శర్మ ఆ తర్వాత ఎస్‌.రాజేశ్వరరావు, పెండ్యాల, చలపతిరావు, రాజన్‌-నాగేంద్ర, జి.కె.వెంకటేశ్‌, సత్యం, ఆదినారాయణరావు, రమేశ్‌నాయుడు, జె.వి. రాఘవులు, చక్రవర్తి, భానుమతి, ఇళయరాజా, బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర పనిచేశాడు. ఎక్కువగా రమేశ్‌నాయుడు సినిమాలకు పనిచేశాడు. బెంగాలీలో రమేశ్‌నాయుడు నిర్మించిన కొన్ని చిత్రాలకు శర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శర్మ ఎంతో సన్నిహితంగా మెలిగేవారు.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన కుమారుడు సంగీత దర్శకుడు మణిశర్మ. ఆయనకున్న ముగ్గురు కుమారుల్లో మణిశర్మ రెండో వాడు. తండ్రి ప్రోత్సాహంతో సినీరంగంలోకి అడుగుపెట్టిన మణిశర్మ మెలోడీ మాంత్రికుడిగా ఖ్యాతి గడించాడు. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 175 చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించి ఎంతో మంది నూతన సంగీత దర్శకులను, గాయనీ, గాయకులను పరిశ్రమకు అందించాడు.[3]

అస్తమయం

[మార్చు]

ఆయన 2018, మే 1 న తన 92వ యేట చెన్నైలో తుది శ్వాస విడిచారు.

మూలాలు

[మార్చు]
  1. "మణిశర్మ తండ్రి వైఎన్ శర్మ కన్నుమూత - Samayam Telugu". samayam Telugu. 2018-05-01. Retrieved 2018-05-02.
  2. "సంగీత దర్శకుడు మణిశర్మకు పితృవియోగం".[permanent dead link]
  3. "మణిశర్మ ఇంట్లో విషాదం". Sakshi. 2018-05-01. Retrieved 2018-05-02.

బయటి లింకులు

[మార్చు]