ఆకాశమంత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకాశమంత
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం రాధామోహన్
తారాగణం ప్రకాష్ రాజ్, జగపతి బాబు, త్రిష, ఐశ్వర్య, గణేష్ వెంకట్రామన్, కురణవేల్
సంగీతం విద్యాసాగర్
నేపథ్య గానం మధు బాలక్రిష్ణన్, కైలాస్ ఖేర్
గీతరచన వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
సంభాషణలు అబ్బూరి రవి
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
భాష తెలుగు

ఆకాశమంత 2009 లో రాధామోహన్ దర్శకత్వంలో విడుదలైన తమిళ అనువాద చిత్రం. ప్రకాష్ రాజ్, త్రిష, ఐశ్వర్య ఇందులో ప్రధాన పాత్రధారులు.

రఘురామ్ (ప్రకాశ్ రాజ్) ఓ ఉద్యానవనంలో నడుస్తూ సుధాకర్ (జగపతి బాబు) తన కూతుర్ని ఆడిస్తూ కష్టపడుతూ ఉండటం చూస్తాడు. ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక కథంతా రఘు తన కూతురు అభి (త్రిష) తో తన అనుబంధం గురించి కొన్ని గతాల్ని తలుచుకుంటూ సుధాకర్ తో పిల్లలని పెంచుతూ ఉన్నప్పుడు కలిగే అనుభవాల గురించి చెబుతూ ఉంటాడు. రఘురాం చిన్నప్పటి నుంచి కూతురంటే విపరీతమైన ప్రేమ కురిపిస్తుంటాడు. ఆమె బడికి వెళ్ళేటపుడు అతనికి కన్నీళ్ళు ఆగవు. బడి దగ్గర ఈ అనామకుణ్ణి చూసిన ఆమె అతన్ని తమ ఇంటికి తీసుకెళ్ళి మంచి జీవితం ప్రసాదించేదాకా ఒప్పుకోదు. ఆమె పెరిగి పెద్దయ్యే ప్రతి క్షణాన్ని మనసారా ఆస్వాదిస్తుంటాడు. అభి ఢిల్లీ వెళ్ళి చదవాలని అనుకుంటుంది. మొదట్లో కూతురును వదిలి ఉండలేక అక్కడికి పంపించలేనంటాడు. కానీ అభి ఆత్మవిశ్వాసం చూసి ఆమెను అక్కడికి పంపిస్తాడు. అభికి ఢిల్లీలో చదివేటపుడే జోగి అనే పంజాబీ వ్యక్తితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. రఘురాం కి అది మొదట్లో రుచించదు. అభి జోగిని తమ ఇంటికి తీసుకువచ్చి పరిచయం చేస్తుంది. అయినా సరే రఘురాం అంగీకరించలేడు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. ఒకానొక ఊరిలో (గానం: కైలాష్ ఖేర్)
  2. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా (గానం: మధు బాలకృష్ణన్)
  3. దూరం కావాలా నన్నే విడిచీ (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆకాశమంత&oldid=4284006" నుండి వెలికితీశారు