నువ్వే నువ్వే
| నువ్వే నువ్వే | |
|---|---|
| దర్శకత్వం | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
| రచన | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
| స్క్రీన్ ప్లే | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
| నిర్మాత | స్రవంతి రవికిషోర్ |
| తారాగణం | తరుణ్ శ్రియ ప్రకాష్ రాజ్ |
| కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
| సంగీతం | కోటి |
విడుదల తేదీ | 10 అక్టోబర్ 2002 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
నువ్వే నువ్వే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన తోలి తెలుగు సినిమా. సినిమాలో తరుణ్, శ్రియ, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు ధరించారు. సంగీతం కోటి అందించారు. ఉత్తమ ద్వితీయ చిత్రంగా రజిత నంది అవార్డు 2002 సంవత్సరానికి ఎంపికైనది.
కథాంశం
[మార్చు]అంజలి (శ్రీయ) విశ్వనాథ్ (ప్రకాష్ రాజ్) అనే ఒక ధనవంతుడి కూతురు. విశ్వనాథ్ కి కూతురంటే ప్రాణం. ఆమెకు భర్తయ్యే వాడు తనకు అన్ని విధాలా నచ్చాలనీ, తనకు ఎదురు చెప్పకూడని వాడు అయ్యుండాలని అతని కోరిక. రిషి (తరుణ్) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన సరదా అబ్బాయి. అతని తండ్రి (చంద్రమోహన్) కి ఒక దుకాణం ఉంటుంది. రిషి సీనియర్ గా ఉన్న కళాశాలలో అంజలి (శ్రియ) కూడా చేరుతుంది. చిన్న చిలిపి తగాదాల తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. అంజలి పుట్టిన రోజున ఆమెకు ఆశ్చర్యానికి గురిచేద్దామని ఆమెకు చెప్పకుండా రిషి ముంబైకి తీసుకెళ్తాడు. ఈ సంఘటనతో విశ్వనాథ్ కి తన కూతురు ప్రేమలో పడిందని అర్థం అవుతుంది.
విశ్వనాథ్ రిషిని తన ఇంటికి పిలిపించి తన కూతురుని పెళ్ళి చేసుకుని పోషించడానికి అతని అర్హతలేమిటో నిరూపించుకోమంటాడు. అందుకు రిషి సరైన సమాధానం చెప్పకపోవడంతో ఒక కోటి రూపాయలు అతనికిచ్చి తన కూతురిని మరిచిపొమ్మంటాడు. రిషి ఆ డబ్బును తిరిగిచ్చేస్తాడు. తన పడే బాధ ఎలా ఉంటుందో తెలియాలని విశ్వనాథ్ ఒక యాచకుడిని రిషి చెల్లికి పెళ్ళిసంబంధంగా తీసుకెళ్తాడు. దాంతో రిషి కుటుంబం చాలా బాధ పడుతుంది. రిషి విశ్వనాథ్ ఆఫీసుకు వెళ్ళి అక్కడి కంప్యూటర్లు, వస్తువులు ధ్వంసం చేసే వస్తాడు. తన చెల్లిలికి, బిచ్చగాడికీ మధ్య ప్రేమ లేదనీ, కానీ తనకు, అంజలికి మధ్య ప్రేమ ఉందని వాదిస్తాడు. అంజలి రిషిని తలుచుకుని బాధ పడుతుంటుంది. కూతురు బాధను చూడలేని విశ్వనాథ్ ఆమెను తన దగ్గర పనిచేసే వేరే అతనికి ఇచ్చి పెళ్ళి చేయాలని చూస్తాడు. అంజలి నేరుగా రిషి ఇంటికి వెళ్ళిపోయి వెంటనే తనను పెళ్ళి చేసుకోమని కోరుతుంది. కానీ రిషి అది సరైన పద్ధతి కాదని ఆమెకు నచ్చజెప్పి ఆమెను తిరిగి వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాడు. చివరికి అంజలికి రిషి పట్ల ఉన్న ప్రేమను తెలుసుకుని విశ్వనాథ్ వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించడంతో కథ ముగుస్తుంది.
తారాగణం
[మార్చు]- తరుణ్_ రిషి
- శ్రీయ_ అంజలి
- ప్రకాష్ రాజ్_ విశ్వనాథ్
- చంద్రమోహన్ - రిషి తండ్రి
- సుధ (నటి) - రిషి తల్లి
- సునీల్ (నటుడు) - పండు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం - లెక్చరర్
- రాజీవ్ కనకాల_ అంజలి సోదరుడు
- అనితా చౌదరి_ అంజలి వదిన
- తనికెళ్ళ భరణి_ అబూ, విశ్వనాధ్ స్నేహితుడు
- ఎం. ఎస్. నారాయణ - పోలీసు కానిస్టేబుల్
- ప్రగతి_ అంజలీ తల్లి
- మధుమిత_ అంజలి స్నేహితురాలు
- శిల్పా _ ప్రియ , రిషి కాలేజీ మేట్
- గుండు సుదర్శన్_ షాప్ కీపర్
- జూనియర్ రేలంగి_ షాప్ కస్టమర్ .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్
- కథ_ చిత్రానువాదం: త్రివిక్రమ్ శ్రీనివాస్
- సంగీతం: సాలూరి కోటేశ్వరరావు (కోటి)
- సంభాషణలు: త్రివిక్రమ్ శ్రీనివాస్
- గీత రచయిత: చెంబోలు( సిరివెన్నెల) సీతారామశాస్త్రి
- నేపథ్య గాయకులు: శంకర్ మహదేవన్, ఉదిత్ నారాయణ్, త్రివిక్రమ్, కోటి, దేవన్, అనురాధ శ్రీరామ్, నిత్య సంతోషిణి, రాజేష్, కౌసల్య, కె ఎస్.చిత్ర, కె కె
- ఫోటోగ్రఫి: హరి అనుమోలు
- కూర్పు: అక్కినేని శ్రీకర్ ప్రసాద్
- నిర్మాత: స్రవంతి రవి కిషోర్
- నిర్మాణ సంస్థ: శ్రీ స్రవంతి మూవీస్
- విడుదల: 10:10:2002.
పాటల జాబితా
[మార్చు]1 :కంప్యూటర్లు , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం. దేవన్, కోటి, త్రివిక్రమ్ , అనురాధ శ్రీరామ్
2 :నామనసుకేమయెంది , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం. ఉదిత్ నారాయణ్, నిత్య సంతోషినీ
3 :నువ్వే నువ్వే కావాలంటుంది, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.కె ఎస్ చిత్ర
4 :ఐ యాం వెరీ సారీ,రచన; సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.కె.కె
5 :నిద్దురపోతున్నా , రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.శంకర్ మహదేవన్
6 :అమ్మాయీ నచ్చేసింది , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.రాజేష్, కౌసల్య
బయటి లంకెలు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న వ్యాసాలు
- 2002 తెలుగు సినిమాలు
- త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- స్రవంతి రవికిషోర్ నిర్మించిన సినిమాలు
- తరుణ్ నటించిన సినిమాలు
- శ్రియా సరన్ నటించిన సినిమాలు
- ప్రకాష్ రాజ్ నటించిన సినిమాలు
- కోటి సంగీతం అందించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి సినిమాలు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన సినిమాలు
- సునీల్ నటించిన సినిమాలు
- రాజీవ్ కనకాల నటించిన సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- సుధ నటించిన సినిమాలు