సాలూరు కోటేశ్వరరావు

వికీపీడియా నుండి
(సాలూరి కోటి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సాలూరి కోటేశ్వరరావు
జననంమే 28
ఇతర పేర్లుకోటి
వృత్తిసంగీత దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1983-ప్రస్తుతం
తల్లిదండ్రులు

సాలూరి కోటేశ్వరరావు (కోటిగా సుపరిచితం) తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. ఇతని తండ్రి సాలూరి రాజేశ్వరరావు కూడా సంగీత దర్శకుడు. కెరీర్ ప్రారంభంలో సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద సహాయకుడిగా పనిచేశాడు. తరువాత ఈయన, మరో సంగీత దర్శకుడు టి.వి. రాజు కొడుకైన రాజ్ జంటగా రాజ్ - కోటి పేరుతో సంగీత దర్శకత్వం వహించారు. కొద్ది కాలానికి ఇద్దరూ విడిపోయినా కోటి ఒక్కడే సంగీతం సమకూర్చి తనదైన శైలిని ఏర్పరుచుకున్నాడు.[1]

హలో బ్రదర్ సినిమాకు గాను 1994 లో నంది ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం దక్కింది. ప్రముఖ సంగీత దర్శకులైన మణిశర్మ, ఏ. ఆర్. రెహ్మాన్ కోటి దగ్గర శిష్యరికం చేశారు.[2] కోటి కొడుకైన రోషన్ సాలూరి కూడా తండ్రి, తాత లాగే సంగీత రంగంలోకి అడుగు పెట్టాడు.[3] మరో కుమారుడు రాజీవ్ సాలూరి నటుడిగా రంగ ప్రవేశం చేశాడు.[4]

కెరీర్

[మార్చు]

కోటి తండ్రి సాలూరి రాజేశ్వరరావు, రాజ్ (సోమరాజు) తండ్రి టి. వి. రాజు ఇద్దరూ సంగీత దర్శకులు కావడంతో రాజ్, కోటి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఇద్దరూ సంగీత దర్శకుడు కె. చక్రవర్తి దగ్గర గిటారిస్టులుగా మెలకువలు నేర్చుకున్నారు. ముందుగా రాజ్ కు ఒక సినిమా అవకాశం తలుపు తట్టింది. అదే విషయం కోటితో పంచుకోవడంతో ఇద్దరు కలిసి రాజ్-కోటి పేరుతో సంగీతం అందించాలనుకున్నారు. అలా వారిద్దరూ కలిసి మొదటిసారిగా 1983లో వచ్చిన ప్రళయ గర్జన అనే సినిమాకు సంగీతం అందించారు. 1988లో చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన యముడికి మొగుడు చిత్రంలో విజయవంతమైన సంగీతం అందించారు. అదే సంవత్సరంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఖైదీ నెం. 786 సినిమాలో వీరు స్వరపరిచిన గువ్వా గోరింకతో అనే పాట ప్రేక్షకులకు బాగా చేరువైంది. చిరంజీవి డ్యాన్సు మూమెంట్స్ కి తగ్గట్టుగా స్వరపరిచిన ఈ పాట వీరికి బాగా పేరు తెచ్చింది. తర్వాత వీరికి అనేక మంది స్టార్ నటుల సినిమాలకు సంగీతం అందించే అవకాశం వచ్చింది. పలు పురస్కారాలు కూడా అందుకున్నాడు. సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్ కూడా మొదట్లో వీరి దగ్గర కీబోర్డు ప్లేయరుగా పనిచేశాడు. 1995 లో కొన్ని విభేదాలు వచ్చి రాజ్-కోటి ఇద్దరూ విడిపోయి సంగీతం అందించడం మొదలు పెట్టారు. కోటి తనదైన శైలిలో మరిన్ని చిత్రాలకు సంగీతం అందించినా రాజ్ మాత్రం వెనుకపడిపోయాడు.[5]

సినిమాలు

[మార్చు]

నటించిన సినిమా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "సాలూరి కోటి". telugufilmnagar.com. Archived from the original on 22 ఆగస్టు 2016. Retrieved 14 August 2016.
  2. "Happy Birthday Koti". indiaglitz.com. indiaglitz. Archived from the original on 30 మే 2015. Retrieved 14 August 2016.
  3. "Can Koti's Son Get Succeeded?". cinejosh.com. Retrieved 14 August 2016.
  4. "Rajeev Saluri Interview – Titanic". idreampost.com. Archived from the original on 29 August 2016. Retrieved 14 August 2016.
  5. Suresh, Lavanya. "కేరిర్ పీక్ లో ఉన్నప్పుడే ఆ మాటలు తట్టుకోలేక రాజ్ కోటి విడిపోయారా..? | Telugudesk" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2020-08-29.
  6. తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.
  7. సాక్షి, సినిమా (22 November 2018). "'శరభ' మూవీ రివ్యూ". Archived from the original on 22 November 2018. Retrieved 19 March 2020.