లలిత కుమారి (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లలిత కుమారి
జననం (1967-05-18) 1967 మే 18 (వయసు 56)[1]
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1987—1995
జీవిత భాగస్వామి
(m. 1994; div. 2009)
[2]
పిల్లలు3
తల్లిదండ్రులు
బంధువులుడిస్కో శాంతి (అక్క)

లలిత కుమారి (జననం 1967 మే 18) దక్షిణ భారత చలనచిత్ర నటి. ఆమె తమిళ నటుడు సి.ఎల్. ఆనందన్ కుమార్తె, నటి డిస్కో శాంతి చెల్లెలు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

లలిత కుమారి 1994లో నటుడు ప్రకాష్ రాజ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తెలు పూజ, మాగ్నా, ఒక కుమారుడు సిద్ధూ ఉన్నారు. సిద్ధూ 2004లో మరణించాడు. ఆ తర్వాత 2009లో ప్రకాష్ రాజ్‌తో విడాకులు తీసుకుంది.

కెరీర్[మార్చు]

గౌండమణి, సెంథిల్.. ఇతర సీనియర్ నటులతో పాటు లలిత కుమారి చాలా సినిమాల్లో నటించారు. ఆమె మనదిల్ ఉరుధి వేండుమ్, పుదు పుదు అర్థాంగళ్, పూలన్ విసరనై, సిగరం వంటి చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది.[3] లలిత కుమారి దాదాపు 30 చిత్రాలలో నటించి తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఆమె వివాహం నటుడు ప్రకాష్ రాజ్‌తో అయిన తర్వాత 1995లో చిత్ర పరిశ్రమకు దూరమైంది. మురియాడి సినిమాతో కోలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇచ్చింది.[4] సత్యరాజ్ భార్యగా నటించింది. అయితే అనివార్య కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

పాక్షిక ఫిల్మోగ్రఫీ[మార్చు]

Year Film Role Language Notes
1987 మనదిల్ ఉరుధి వెంటుం వాసు తమిళం
1988 వీడు మనైవి మక్కల్ తమిళం
1989 పుదు పుదు ఆర్తంగళ్ జాలీ భార్య తమిళం
1989 మాప్పిళ్ళై దిలీప్ ప్రేయసి తమిళం
1990 పులన్ విసరనై కస్తూరి తమిళం
1990 ఆరతి ఏడుంగడి తమిళం
1990 ఉలగం పిరంధడు ఎనక్కగా తమిళం
1990 నీంగళం హీరోతాన్ రాణి తమిళం
1990 మధురై వీరన్ ఎంగ సామి తమిళం
1990 పతిమూనం నంబర్ వీడు రేఖ / దెయ్యం తమిళం
1991 సిగరం తమిళం
1992 పొక్కిరి తంబి మరుత్తు సోదరి తమిళం
1993 పార్వతి ఎన్నై పారాది తమిళం
1993 వేదన్ తమిళం
1995 కర్ణా చెల్లమ్మ తమిళం
1995 మరుమగన్ కన్నమ్మ తమిళం
1995 నాడోడి మన్నన్ కుయిల్ ఆత తమిళం
TBA మురియాడి తమిళం వాయిదా

మూలాలు[మార్చు]

  1. dinakaran. Web.archive.org. Retrieved on 10 June 2014.
  2. "Ex-wife comes to Prakash Raj's rescue". The Times of India. 11 February 2011. Retrieved 1 July 2020.
  3. "Prakash Rajs former wife Lalitha Kumari returns to films". kollytalk.com. Archived from the original on 2014-12-31. Retrieved 2014-12-09.
  4. "Prakash Raj's wife to act!". Archived from the original on 5 September 2015. Retrieved 17 May 2018.

బాహ్య లింకులు[మార్చు]