రిలాక్స్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
రిలాక్స్ (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ప్రదీప్ శెట్టి |
---|---|
నిర్మాణం | పాపి రెడ్డి ఎన్.వర్ధన్ |
తారాగణం | రోహన్, అంజలి, ఆలీ, విజయ చందర్, గిరి బాబు మురళీమోహన్ |
సంగీతం | రమణ గోగుల |
ఛాయాగ్రహణం | టి.రాజేంద్ర |
కూర్పు | కే.రాంగొపాల్ రెడ్డి |
విడుదల తేదీ | 24 ఫిబ్రవరి, 2005 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
రిలాక్స్ 2005 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని పాపి రెడ్డి, ఎన్.వర్ధన్ నిర్మాణంలో ప్రదీప్ శెట్టి దర్శకత్వంలో రోహన్ కథానాయకుడిగా ఆలీ, విజయ చందర్, గిరి బాబు మురళీమోహన్ తదితరులు నటించారు.
కథ
[మార్చు]సందీప్ (రోహన్) ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసిన తర్వాత విరామం తీసుకోవాలని కోరుకుంటాడు. హైదరాబాద్ లో తన స్నెహితుడు, కమర్షియల్ చిత్ర దర్శకుడు రామ్ నేపాల్ వర్మ (ఆలీ) ని సందర్శిస్తాడు. తరువాత అంజలి (అంజలి) అనే అమ్మయి తో ప్రేమలో పడతాడు.
ఒక సెమినార్లో ప్రఖ్యాత జ్యోతిష్కుడైన శర్మ (విజయా చందర్) ని జ్యోతిష్యం గురించి తనని ఎగతాళి చేస్తాడు. ఆ తరువాత సందీప్ జన్మ పట్టికలో చూసిన శర్మ, సందీప్ తొ మాట్లాడుతూ 30 రోజుల్లో తన జీవితంలో 3 ముఖ్యమైన సంఘటనల ను ఎదురుకుంటాడని శర్మ జొస్యం చెప్తాడు. ఈ సంఘటనలు క్రింది విధంగా ఉన్నాయి:
1. అతను లక్షాధికారి అవుతుడు.
2. అతడు రాత్రికిరాత్రే ప్రముఖుడు అవుతాడు, అతని నుండి ఏ ప్రయత్నం లేకుండా.
3. అతను ప్రజలు ముందు బహిరంగంగా ఒక వ్యక్తి ని చంపుతాడు.
ఆ తరువాత సందీప్ కి మొదటి రెండు సంఘటనలు శర్మ చెప్పినట్లు జరుగుతాయ్.
జ్యోతిష్కుడి అంచనాల ప్రకారం మొదటి రెండు సంఘటనలు సంభవించినప్పుడు, సందీప్ గందరగోళానికి గురవుతాడు, ఆ జ్యోతిష్కుడికి ఒక పరిష్కారం కోసం శోధించడం మొదలవుతుంది. మిగిలిన కథ మూడవ జొస్యం నిజమా కాదా అనే దాని గురించి ఉంది.
పాటలు
[మార్చు]ఈ సినిమా కి రమణ గోగుల సంగీతం అందించారు.
క్రమసంఖ్య | పేరు | Singer(s) | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "హే చెలి మనసులో" | రమణ గోగుల, గంగ | 3:51 | ||||||
2. | "తొలకరివో కలవో" | రమణ గోగుల | 4:19 | ||||||
3. | "11ఓ క్లోక్ కి నిద్దురలేచి" | కార్తీక్ | 3:28 | ||||||
4. | "నువ్వు నేను జతకలిసి" | గంగ | 4:18 | ||||||
5. | "ఒక చిన్న బ్రేక్ తీసుకో" | 2:36 | |||||||
6. | "కర్మణ్యే వాధికారస్తే" | పూర్ణచందర్ | 1:52 | ||||||
7. | "తొలకరివో కలవో (డ్యూయెట్)" | ఎస్.పి.చరణ్, గంగ | 4:36 | ||||||
8. | "11ఓ క్లోక్ కి నిద్దురలేచి (రీమిక్స్)" | కార్తీక్ | 3:28 | ||||||
9. | "గుండెలపైనా గులాబిరేమ్మ" | ప్రదీప్ శెట్టి, నందిత | 3:39 | ||||||
32:07 |