బడ్జెట్ పద్మనాభం
బడ్జెట్ పద్మనాభం | |
---|---|
దర్శకత్వం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
కథా రచయిత | దివాకర్ బాబు (మాటలు) |
దృశ్య రచయిత | ఎస్. వి. కృష్ణారెడ్డి |
కథ | జి. అరుణాచలం |
నిర్మాత | గ్రంధి నారాయణరావు (బాబ్జి) |
తారాగణం | జగపతిబాబు, రమ్యకృష్ణ |
ఛాయాగ్రహణం | శరత్ |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
నిర్మాణ సంస్థ | శ్రీ ధనలక్ష్మీ ఫిలింస్ |
విడుదల తేదీ | 2001 మార్చి 9 |
సినిమా నిడివి | 151 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ పద్మనాభం 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం[1] వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు,[2] రమ్యకృష్ణ నాయికానాయకులుగా నటించగా, ఎస్. వి. కృష్ణారెడ్డి సంగీతం అందించారు. ఈ చిత్రానికి, 2000 సంవత్సరం తమిళంలో వచ్చిన బడ్జెట్ పద్మనాభన్ అనే చిత్రం మాతృక.
చిత్రకథ[మార్చు]
బడ్జెట్ పద్మనాభం (జగపతి బాబు) ఒక ఉద్యోగి. పెళ్ళి అంటే ఖర్చు కాబట్టి పెళ్ళి చేసుకోడు. ఏదీ చేయాలన్నా రెండు, మూడు సార్లు ఆలోచిస్తాడు. రమ్యకృష్ణకు పద్మనాభం అంటే ఇష్టం. ఇద్దరం కలిస్తే ఇద్దరి సంపాదన తోడు అవుతుంది కదాని రమ్య సలహా పాటించి ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. కానీ పెళ్ళి అయిన నెలకే రమ్యకృష్ణ గర్భవతి అవుతుంది. ముగ్గురు పిల్లలు (ట్రిపులెట్స్) పుడుతారు. ఇంకా ఖర్చు పెరుగుతుంది. బడ్జెట్ పద్మనాభం బడ్జెట్ ఖర్చుకు కూడా ఓ రీజన్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో ..... జగపతి బాబు చాలా చిన్నప్పుడు అంటే 8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న అప్పు చేసి ఇల్లు కడుతాడు. కానీ ఇల్లు కట్టాక హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతాడు. దాంతో అప్పు ఇచ్చిన తనికెళ్ళ భరణి వీళ్ళను ఇంట్లో నుంచి తరిమికొడతాడు. 20 ఏళ్ళలో అప్పు తీర్చితే ఇల్లు మళ్ళీ జగపతిబాబుకు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇస్తుంది. ఎలాగైనా ఆ ఇల్లు సొంతం చేసుకునేందుకే డబ్బు పొదుపు చేస్తుంటాడు. చివరికి ఇల్లు వశం చేసుకుంటాడా లేదా అన్నదే క్లైమాక్స్.
నటవర్గం[మార్చు]
- జగపతిబాబు (పద్మనాభం)
- రమ్యకృష్ణ (రమ్య)
- రవితేజ (రవి)
- ఎల్. బి. శ్రీరామ్ (వాస్తు తొట్టి సుబ్రహ్మణ్యం)
- వై. విజయ (విజయ)[3]
- విద్య (సోనాలి)
- తనికెళ్ల భరణి
- ఆహుతి ప్రసాద్ (పద్మనాభం తండ్రి)
- రాళ్లపల్లి (లాయర్)
- ఎం. ఎస్. నారాయణ (పద్మనాభం యొక్క సహోద్యోగి)
- చిట్టిబాబు (చిలక జ్యోతిష్కుడు)
- జెన్నీ (పద్మనాభం ఇంటి యజమాని)
- అనిల్
- వల్లభనేని జనార్ధన్
- గౌంతంరాజు
- నామాల మూర్తి
- మధుమణి
- రజిత
- శైలజ
పాటలు[మార్చు]
ఈ చిత్రంలోని పాటలన్నీంటిని చంద్రబోస్ రచించగా ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం అందించారు. పాటలు సుప్రీమ్ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "మోనాలిసా మోనాలిసా" | రవివర్మ, ఉషా | 5:10 |
2. | "బావ బావ" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఉన్నికృష్ణన్ | 5:12 |
3. | "పడకింట్లో ఈ క్షణం" | పంకజ్ ఉదాస్, నిత్య సంతోషిణి | 5:09 |
4. | "సొమ్ముతా ఆదా చెయ్యరా" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:09 |
5. | "ఎవరేమి అనుకున్న" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:56 |
Total length: | 24:36 |
మూలాలు[మార్చు]
- ↑ నవతెలంగాణ. "ఆల్‌రౌండర్..." Retrieved 6 July 2017.
- ↑ నమస్తే తెలంగాణ. "హ్యాపీ బర్త్ డే జగపతి బాబు". Retrieved 6 July 2017.[permanent dead link]
- ↑ తెలుగు ఎ6 న్యూస్. "లేడీ విలన్ అంటే ఈ నటి మాత్రమే గుర్తొస్తుంది". telugu.a6news.com. Retrieved 6 July 2017.
ఇతర లంకెలు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from డిసెంబర్ 2021
- Articles with permanently dead external links
- Articles with short description
- Short description is different from Wikidata
- 2001 సినిమాలు
- 2001 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా చిత్రాలు
- తెలుగు హాస్యచిత్రాలు
- జగపతి బాబు నటించిన చిత్రాలు
- రమ్యకృష్ణ నటించిన చిత్రాలు
- ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాలు
- రవితేజ నటించిన సినిమాలు
- ఆహుతి ప్రసాద్ నటించిన చిత్రాలు
- తనికెళ్ళ భరణి చిత్రాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- ఎల్. బి. శ్రీరాం నటించిన చిత్రాలు