నిత్య సంతోషిణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిత్య సంతోషిణి
Nityasantoshini singer.jpg
వృత్తినేపథ్య గాయని

నిత్య సంతోషిణి పేరు పొందిన తెలుగు గాయని. ఈమె మొదట శాస్త్రీయ సంగీతాన్ని, భక్తి సంగీతాన్ని ఆలపించి ప్రజల అభిమానాన్ని చూరగొంది. ఆ తరువాత లలిత సంగీతం, సినిమా సంగీతం పాడటం మొదలు పెట్టింది. ఈమె తల్లి రామలక్ష్మి పద్మాచారి సంగీత ప్రియురాలు. ఆమెనే నిత్య సంతోషిణి ప్రథమ గురువు. ఈమె సంగీతపాఠాలను చిన్నతనం నుండే వినడం వల్ల సంగీతం పట్ల అభిరుచి ఏర్పడింది. తరువాత ఈమె తంపెల్ల సూర్యనారాయణ, ఆకెళ్ల మల్లికార్జునశర్మల వద్ద సంగీతం అభ్యసించింది. ఈమె తన అక్కతో కలిసి అనేక శాస్త్రీయ సంగీత, భక్తి సంగీత కచ్చేరీలను ఇచ్చింది. ఎన్నో భక్తి పాటల ఆల్బమ్‌లను విడుదల చేసింది[1].

సినిమా సంగీతం[మార్చు]

ఈమెకు 1998లో నిర్మించిన నీలి మేఘాలు సినిమాలో పాట పాడటానికి తొలి అవకాశం లభించింది. ఆ సినిమా సంగీత దర్శకుడు దుగ్గిరాల. అది మొదలు ఈమె ఎన్నో తెలుగు, కన్నడ చిత్రాలలో నేపథ్య గానాన్ని పాడింది.

ఈమె గానం చేసిన తెలుగు సినిమా పాటల పాక్షిక జాబితా:

సంవత్సరం సినిమా పేరు పాట సంగీతం సాహిత్యం సహ గాయకులు
1998 నీలి మేఘాలు జాబిలమ్మ చేరవస్తే కోపమేలా చిన్నవాడా దుగ్గిరాల సుమన్ జూపూడి
1998 నీలి మేఘాలు తూనిగలా ఎగిరిపోదామలా తువ్వాయిలా తుళ్లి పోదామలా దుగ్గిరాల చంద్రబోస్
2002 నువ్వే నువ్వే నా మనసుకేమయింది కోటి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఉదిత్ నారాయణ్
2003 ఒకరికి ఒకరు ఘాటు ఘాటు ప్రేమ నీకు నాకు నడుమ ఎం.ఎం.కీరవాణి చంద్రబోస్ టిప్పు
2003 శ్రీరామచంద్రులు జాబిలి లేకపోతే ఘంటాడి కృష్ణ జయసూర్య ఉదిత్ నారాయణ్
2005 మొగుడ్స్ పెళ్ళామ్స్ నిన్నే దాచాను నాకళ్లలోన ఎస్.రాజ్ కిరణ్

లలిత, భక్తి సంగీతాలు[మార్చు]

ఈమె అనేక లలిత సంగీత, భక్తి సంగీత కార్యక్రమాలలో పాల్గొనింది. అనేక ప్రైవేటు ఆల్బంలలో పాడింది.

ఈమె పాటలున్న కొన్ని ఆల్బమ్‌లు[2]:

 1. కృష్ణజయంతి
 2. సకల దేవతార్చన
 3. అంతా రామమయం
 4. శ్రీ కృష్ణ గానసుధ
 5. హ్యాపీ ఈస్టర్
 6. అక్షయ తృతీయ స్పెషల్
 7. వినాయక చవితి ప్రత్యేకం
 8. నవరాత్రి స్పెషల్
 9. శివరాత్రి స్పెషల్ కలెక్షన్స్
 10. భూకైలాసం రాజరాజేశ్వర క్షేత్రం
 11. శ్రీ సంతోషిమాత
 12. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
 13. శ్రీ కృష్ణ సుప్రభాతం
 14. శ్రీ రామదాసు కీర్తనలు
 15. శ్రీ జయదేవ అష్టపది
 16. రాగాంజలి
 17. శ్రీ లక్ష్మీ పురాణం
 18. శ్రీ గణపతి బీజమంత్రం
 19. శ్రీ శివాభిషేకం
 20. కళ్యాణ శ్రీనివాసం
 21. సాయి గీతాంజలి
 22. నా మనసు కోతిరా రామా!
 23. సప్తాచలం శ్రీ శ్రీనివాసం
 24. గోవింద గానామృతం
 25. శ్రీ సాయి గానాంజలి
 26. నమో నమో సుబ్రమణ్య
 27. శ్రీ వేంకటేశ్వర జానపదాలు
 28. శివ గానం
 29. నిత్యారాధన
 30. వాగ్దేవికి వందనం
 31. పరిపూర్ణ క్రీస్తు
 32. నా జీవిత గమనం యేసే మొదలైనవి.

పురస్కారాలు[మార్చు]

 • 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నంది ఉత్తమ నేపథ్య గాయనిగా నంది పురస్కారం.
 • 2013లో అపురూప సాంస్కృతిక సంస్థచే ‘అపురూప అవార్డ్-2013’
 • 2014లో ఘంటసాల పురస్కారం

మూలాలు[మార్చు]

 1. editor, metroplus (24 April 2014). "Awards make me tense". The Hindu. Retrieved 13 April 2017. CS1 maint: discouraged parameter (link) CS1 maint: extra text: authors list (link)
 2. నిత్యసంతోషిణి పాటలున్న ప్రైవేటు ఆల్బంలు