నాటు నాటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"నాటు నాటు"
("Naatu Naatu")
నాటు నాటు పాటలో సన్నివేశం
రచయితచంద్రబోస్
సంగీతంఎం. ఎం. కీరవాణి
సాహిత్యంచంద్రబోస్
ప్రచురణ2022
రచింపబడిన ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
భాషతెలుగు
రూపంజానపదగీతం
గాయకుడు/గాయనిరాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ
చిత్రంలో ప్రదర్శించినవారుజూనియర్ ఎన్.టి.ఆర్., రాం చరణ్ తేజ

నాటు నాటు పాట రౌద్రం రణం రుధిరం (2022) సినిమా కోసం చంద్రబోస్ రచించారు. ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ గానం చేయగా ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటను జూనియర్ ఎన్.టి.ఆర్., రాం చరణ్ తేజ లతో బాటుగా బ్రిటిష్ నటీనటులపై చిత్రీకరించగా ప్రేమ్ రక్షిత్ నృత్యదర్శకత్వం వహించారు. ఈ పాట భారతదేశ చరిత్రలో మొదటిసారిగా గోల్డెన్ గ్లోబ్ పురస్కారం గెలుచుకొని చరిత్ర సృష్టించింది.

నాటు నాటు సాంగ్ 2022 జనవరి 24న బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 95వ ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకుంది.[1] అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 2023 మార్చి 12న జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల్లో  ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డు దక్కింది.[2][3].

చిత్రీకరణ[మార్చు]

"నాటు నాటు" పాట చిత్రీకరించబడిన ఉక్రెయిన్ రాష్ట్రపతి భవనం

"నాటు నాటు" పాటను 2021 ఆగస్టులో ఉక్రెయిన్ లోని సినిమాలోని ఆఖరిభాగంలో చిత్రీకరించారు.[4][5] చిత్రీకరణ కీవ్ లోని ఉక్రెయిన్ రాష్ట్రపతి భవనం ప్రాంగణంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలుకాకముందే పూర్తిచేశారు.[6][7] ఈ పాటలో ఉన్న భవనం ఉక్రెయిన్‌ అధ్యక్షుడిది. ఆ భవనం పక్కనే పార్లమెంట్ కూడా కనిపిస్తుంది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కూడా ఒకప్పటి ఆర్టిస్ట్ కావడంతో షూటింగ్‌కి అనుమతి ఇచ్చినట్లు రాజమౌళి తెలియజేసాడు. ఈ పాట కోసం కొరియోగ్రాఫర్ రక్షిత్ టీమ్ ఏకంగా 80 వేరియేషన్స్‌ స్టెప్స్‌ని రికార్డ్ చేసింది. అన్నింటినీ చూసిన రాజమౌళి అండ్ టీమ్ చివరికి ఒక స్టెప్‌‌ని ఒకే చేసింది. అదే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకుని వేసే స్టెప్. ఈ ఇద్దరూ పాట బాగా రావడానికి 18 టేకులు తీసుకున్నారు.[8]

పాటలో కొంత భాగం[మార్చు]

పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు

నా పాట సూడు
నా పాట సూడు
నా పాట సూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు పచ్చి మిరప లాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు విచ్చు కత్తి లాగ వెర్రి నాటు[9]
....................
.....................

మూలాలు[మార్చు]

  1. "'నాటు నాటు'కు ఆస్కార్‌ నామినేషన్‌". web.archive.org. 2023-01-25. Archived from the original on 2023-01-25. Retrieved 2023-01-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Namasthe Telangana (13 March 2023). "చరిత్ర సృష్టించిన ఆర్ఆర్‌ఆర్‌.. 'నాటు నాటు' పాటకు ఆస్కార్‌". Archived from the original on 13 March 2023. Retrieved 13 March 2023.
  3. https://www.bbc.com/telugu/articles/c3grn52m7pro
  4. "'RRR' team reaches Ukraine for last leg of shooting". The News Minute. 2021-08-03.
  5. "Rajamouli and team to shoot a song in Ukraine". The New Indian Express. 2021-07-06.
  6. "Zelenskyy Offered Ukrainian President's Palace for RRR". indiaherald.com (in ఇంగ్లీష్). Retrieved 2022-05-26.
  7. Rosser, Michael (2022-04-07). "India's S.S. Rajamouli on filming hit 'RRR' in Ukraine, next project with Mahesh Babu". Screen.
  8. "RRR 'నాటు నాటు' పాట కోసం 80 స్టెప్ట్స్.. కానీ ఒకే అయ్యింది ఒక్కటే!". Samayam Telugu. Retrieved 2023-01-13.
  9. "Naatu naatu Song Lyrics in Telugu, RRR- నాటు నాటు Song Lyrics | LyricsTape". www.lyricstape.com. Retrieved 2023-01-13.

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నాటు_నాటు&oldid=4076944" నుండి వెలికితీశారు