సాంబ (సినిమా)
సాంబ | |
---|---|
దర్శకత్వం | వి.వి.వినాయక్ |
నిర్మాత | కొ డాలి నాని |
రచన | జి.యస్. రావు |
నటులు | జూనియర్ ఎన్.టి.ఆర్ భూమిక జెనీలియా ప్రకాష్ రాజ్ |
సంగీతం | మణిశర్మ |
విడుదల | 9 జూన్ 2004 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
సాంబ 2004 లో విడుదలైన తెలుగు యాక్షన్ సినిమా. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, భూమికా చావ్లా, జెనెలియా డిసౌజా, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా, విజయకుమార్, అలీ, సీతారా, సుకుమారి, సుకన్య, బ్రహ్మజీ సహాయక పాత్రల్లో నటించారు. [1] వివి వినాయక్ దర్శకత్వంలో కొడాలి నాని నిర్మించాడు. కె. రవీంద్ర బాబు ఛాయాగ్రహణం, గౌతం రాజు కూర్పు, మణి శర్మ సంగీతం అందించారు. ఈ చిత్రం 2004 జూన్ 9 న విడుదలైంది. కన్నడ వంటి మాండ్య పేరుతోటి, బంగ్లాదేశ్‌లో బెంగాలీ భాషలో ఏక్ రోఖా పేరుతో రీమేక్ చేసారు. దీనిని హిందీలో ఇదే పేరుతో అనువదించారు.
కథ[మార్చు]
ధర్మయ్య నాయుడు ( విజయకుమార్ ) అండర్వరల్డ్ కింగ్పిన్. అతనికి చదువురాక పోవడం వలన. భార్యను కోల్పోయాడు. అందువల్ల, పాఠశాలలను నిర్మించడం ద్వారా తన సీమ ప్రాంతంలో విద్యను అందించాలని కోరుకుంటాడు. అతని క్వారీలో మంచి నాణ్యత గల గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని అతను గ్రహించాడు. సాంబా ( ఎన్టీఆర్ జూనియర్ ) ధర్మయ్య నాయుడు కుమారుడు, పశుపతి ( ప్రకాష్ రాజ్ ) ధర్మయ్య నాయుడు అల్లుడు. పడుపతి కుటుంబానికి కట్నంగా గ్రానైట్ క్వారీని ఇవ్వమని ధర్మయ్య నాయుడిపై వత్తిడి తెచ్చే విధంగా పశుపతి ఆట ఆడుతాడు. ఈ కారణంగా ధర్మయ్య నాయుడు కుమార్తె ( సితార ) ఆత్మహత్య చేసుకుంటుంది. సాంబా తన సోదరి ఆత్మహత్య వెనుక గల కారణాన్ని తెలుసుకున్నప్పుడు, అతను క్వారీని ఆక్రమించి పశుపతి సోదరులను చంపేస్తాడు. అప్పుడు పశుపతి ప్రతీకారంగా సాంబా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరినీ చంపేస్తాడు. పోలీసులు వారిని AP లోకి ఒక సంవత్సరం పాటు బహిష్కరిస్తారు. సాంబా కంచి లోను, అతని శత్రువైన పశుపతి అమృత్‌సిర్ లోనూ ఆశ్రయం పొందుతారు. సాంబ కాంచీ (తమిళనాడు) లో చీర తయారీదారుగా, వ్యాపారిగా స్థిరపడతాడు. అతను సీమకు తిరిగి రావడం, పశుపతిపై ప్రతీకారం తీర్చుకోవడం, విద్యా రంగంలో సేవ ప్రారంభించడం ఇవన్నీ మిగిలిన కథ
నటీ నటులు[మార్చు]
- సాంబగా జూనియర్ ఎన్టీయార్
- నందుగా భూమికా చావ్లా
- సంధ్యగా జెనీలియా డిసౌజా
- పశుపతిగా ప్రకాష్ రాజ్
- విజయకుమార్
- ఆలీ
- సితార
- సుకుమారి
- కృష్ణ భగవాన్
- సుకన్య
- సుబ్బరాజు
- బ్రహ్మాజీ
- తనికెళ్ళ భరణి
- ఆహుతి ప్రసాద్
- రఘుబాబు
సాంకేతిక సిబ్బంది[మార్చు]
- నిర్మాత: కొడలి నాని
- దర్శకుడు:: వి.వి వినాయక్
- కథ: జి.ఎస్.రావు
- సంభాషణలు: కోన వెంకట్
- ఛాయాగ్రహణం: రాజన్ కినగి
- సంగీతం: మణి శర్మ
- నృత్యాలు: ప్రభుదేవా, లారెన్స్ రాఘవేంద్ర, అశోక్ రాజ్ & రాజా శేఖర్
పాటలు[మార్చు]
పాటల జాబితా | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
సంఖ్య. | పాట | గాయనీ గాయకులు | నిడివి | |||||||
1. | "డం డమారే డం" | శంకర్ మహదేవన్ | 5:01 | |||||||
2. | "తగిలింది రబ్బా" | ఎస్.పి.చరణ్, గంగ | 4:51 | |||||||
3. | "కితకితలు పెట్టమాకు" | మనో, స్వర్ణలత | 5:13 | |||||||
4. | "నందమూరి చందమామా" | ఎస్.పి.చరణ్, సుజాత మోహన్ | 4:55 | |||||||
5. | "లక్సెంబర్గ్ లక్స్ సుందరీ" | కార్తిక్, మహాలక్ష్మి అయ్యర్ | 4:38 | |||||||
6. | "నమస్తే నమస్తే" | టిప్పు, చిత్ర | 5:20 | |||||||
మొత్తం నిడివి: |
29:58 |