Jump to content

ఝుమ్మందినాదం (సినిమా)

వికీపీడియా నుండి
(ఝుమ్మంది నాదం నుండి దారిమార్పు చెందింది)
ఝుమ్మంది నాదం
దర్శకత్వంకె. రాఘవేంద్రరావు
రచనభూపతి రాజా
గోపీమోహన్
బి. వి. ఎస్. రవి
రాజా సింహ
నిర్మాతమంచు లక్ష్మి
తారాగణంమంచు మనోజ్
తాప్సీ
మోహన్ బాబు
సుమన్
ఛాయాగ్రహణంఎస్. గోపాల్ రెడ్డి
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్
విడుదల తేదీ
1 జూలై 2010 (2010-07-01)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఝుమ్మందినాదం 2010 , జూలై 1 న విడుదలైన తెలుగు చిత్రం. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచు మనోజ్ కుమార్, తాప్సీ నాయకా నాయికలుగా నటించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.

బాలు అనే యువకుడికి జీవితంలో ఒకటే లక్ష్యం. ఎప్పటికైనా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం లాగా మంచి గాయకుడు కావాలని. తమ ఊర్లో ఉన్న జమీందారుతో పందెం వేసి గాయకుడిగా పేరు తెచ్చుకోవడం కోసం హైదరాబాదుకు వస్తాడు. కెప్టెన్ రావు అతని ఎదురింట్లో ఉంటాడు. అతనికి కొత్త తరం పిల్లలు జీవన శైలి నచ్చదు. దానిని అసహ్యించుకుంటూ ఉంటాడు. శ్రావ్య అనే అమ్మాయి ప్రవాసుడైన రావు స్నేహితుడి కూతురు. ఆమె సాంప్రదాయ తెలుగు సంగీతం మీద ఒక డాక్యుమెంటరీ తీయడం కోసం హైదరాబాదుకు వచ్చి రావు దగ్గరే ఉంటుంది. బాలు ఆమెకు సహాయం చేస్తుంటాడు. నెమ్మదిగా వీరిద్దరు ప్రేమలో పడతారు. కెప్టెన్ రావుకు ఇది నచ్చదు. చివరికి ఆ జంట తమ లక్ష్యాన్ని ఎలా చేరుకున్నారు? తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు అనేది మిగతా కథ.

నటీనటులు

[మార్చు]
  • కెప్టెన్ రావుగా మోహన్ బాబు
  • బాలుగా మంచు మనోజ్ కుమార్
  • శ్రావ్యగా తాప్సీ
  • ఆలీ
  • వితికా శేరు
  • పాటల జాబితా.
  • సరిగమ పదనీ , ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , రచన : వేదవ్యాస
  • లాలీ పాడుతున్నా , ఎస్ పి.బాలసుబ్రహ్మణ్యం , గీతా మాధురి , బాలాజీ , దీపు, రచన: సుద్దాల అశోక్ తేజ
  • గోవిందా హరి గోవిందా , ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , రచన: వేదవ్యాస.
  • ఏం చక్కగున్నావురో , అనుజ్ గురువార , చిత్ర అంబడిపూడి , రచన: సుద్దాల అశోక్ తేజ
  • సన్నాయి మ్రోగింది , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సునీత, మాళవిక, చిత్ర అంబడిపూడీ , రచన: సుద్దాల అశోక్ తేజ .
  • దేశమంటే ,ఎస్. పి.బాలు , చిత్ర అంబడిపూడి , మౌనిక , రచన: చంద్రబోస్ .
  • నిగ్రహం , రంజిత్ , రచన: చంద్రబోస్ .
  • బాలామణి , కార్తీక్, శివానీ , రచన: చంద్రబోస్ .
  • ఎంత ఎంత , కృష్ణ చైతన్య , సునీత , రచన: చంద్రబోస్

సాంకేతిక నిపుణులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]