Jump to content

భవతారిణి

వికీపీడియా నుండి
భవతారిణి
జననం
భవతారిణి రాజా

(1976-07-23)1976 జూలై 23
చెన్నై, తమిళనాడు, భారతదేశం
మరణం2024 జనవరి 25(2024-01-25) (వయసు 47)
మరణ కారణంకాలేయ క్యాన్సర్
వృత్తినటి, ప్లేబ్యాక్ సింగర్, సంగీత దర్శకురాలు
తల్లిదండ్రులు
బంధువులువెంకట్ ప్రభు

భవతారిణి రాజా (1976 జూలై 23 - 2024 జనవరి 25) భారతీయ నటి, సంగీత దర్శకురాలు, గాయని. ఆమె ప్రముఖ చలనచిత్ర స్వరకర్త ఇళయరాజా కుమార్తె. యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజాలకు సోదరి.[1] ఆమె ఎక్కువగా తన తండ్రి, సోదరుల దర్శకత్వంలో పాటలు పాడింది. ఆమె తండ్రి స్వరపరిచిన భారతి చిత్రంలోని "మయిల్ పోల పొన్ను ఒన్ను" పాటను పాడినందుకు 2001లో ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది.[2]

తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం గుండెల్లో గోదారి సినిమాలో ‘నన్ను నీతో..’ పాటను పాడిన ఆమె సంగీత అభిమానుల హృదయాలలో చోటు దక్కించుకుంది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె చెన్నైలోని రోసరీ మెట్రిక్ స్కూల్‌లో చదివింది. దీని తర్వాత చెన్నైలోని పీటర్స్ రోడ్‌లోని ఆదర్శ విద్యాలయంలో ఉన్నత మాధ్యమిక పాఠశాలలో చదువుకుంది.

భవతారిణిని ఒక అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్ అయిన ఎస్.ఎన్ రామచంద్రన్ కుమారుడు ఆర్. శబరిరాజ్ ను వివాహం చేసుకుంది.[1]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

(పాక్షికం)

1984: మై డియర్ కుట్టిచాతన్ (మలయాళం)

1995 రాసయ్య (కుర్రాడు బాబోయ్)

1996 అలెగ్జాండర్

1997 తేదినెన్ వంతతు

1997 కరువేలం పూక్కల్

1997: కధలుక్కు మరియాదై

1997: ఉల్లాసం (తెలుగు)

1998: కలియుంజల్ (మలయాళం)

1999 టైం (టైం)

2000: భారతి (ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర పురస్కారం)

2001: అజగి

2001: ఫ్రెండ్స్

2005: ఒరు నాల్ ఒరు కనవు

2005: పొన్ముడిపూజయోరతు (మలయాళం)

2006: అజగై ఇరుక్కిరై బయమై ఇరుక్కిరతు

2006: తామిరభరణి

2007: నాలయ్య పొజుతుం ఉన్నోడు

2008: ఉలియిన్ ఒసై

2008: ధనం

2009: పా (పా )

2010: గోవా

2011: మంకథ

2012: గుండెల్లో గోదారి (తెలుగు)

2013: బిరియాని (తమిళం/తెలుగు)

2014: అనెగన్ (అనేకుడు)

2021: మానాడు

సంగీత దర్శకురాలిగా

[మార్చు]

2002: మిత్ర్, మై ఫ్రెండ్ (ఆంగ్లం)

2002: మళ్ళీ మళ్ళీ చూడాలి (తెలుగు)

2003: అవునా (తెలుగు)

2004: ఫిర్ మిలేంగే (హిందీ) (అదనపు స్వరకర్త, బిజిఎమ్)

2005: గీయా గీయా (కన్నడ)

2006: అమృతం

2006: ఇలాక్కనం

2012: వెల్లచి

2012: పోరిడ పజగు

2018: కల్వర్గల్

2019: మాయానాది

మరణం

[మార్చు]

భవతారణి రాజా 47 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో బాధ పడుతూ 2024 జనవరి 25న శ్రీలంకలో కన్నుమూసింది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Ilayaraja's daughter gets engalged". The Hindu. August 4, 2005. Archived from the original on December 1, 2016. Retrieved November 30, 2016.
  2. "48th National Film Awards, 2000".
  3. "ఇళయరాజా కుమార్తె, సంగీత దర్శకురాలు భవతారణి కన్నుమూత | Music director Ilaiyaraaja daughter playback singer Bhavatharini died of cancer - Sakshi". web.archive.org. 2024-01-26. Archived from the original on 2024-01-26. Retrieved 2024-01-26. {{cite web}}: no-break space character in |title= at position 35 (help)CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Bhavatharini, daughter of musician Ilayaraja, no more". The hindu.
"https://te.wikipedia.org/w/index.php?title=భవతారిణి&oldid=4310035" నుండి వెలికితీశారు