బీస్ట్
బీస్ట్ | |
---|---|
దర్శకత్వం | నెల్సన్ దిలీప్‌కుమార్ |
నిర్మాత | కళానిధి మారన్ దిల్ రాజు |
తారాగణం | |
ఛాయాగ్రహణం | మనోజ్ పరమహంస |
కూర్పు | ఆర్. నిర్మల్ |
సంగీతం | అనిరుధ్ రవిచందర్ |
నిర్మాణ సంస్థలు | సన్ పిక్చర్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
విడుదల తేదీ | 13 ఏప్రిల్ 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బీస్ట్ 2022లో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకతవం వహించాడు. విజయ్, పూజా హెగ్డే, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు విడుదల చేయనున్నాడు.[1] బీస్ట్ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 2న విడుదల చేసి[2] సినిమాను 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.[3]
కథ
[మార్చు]వీర రాఘవ (విజయ్) ఓ `రా` ఏజెంట్. కశ్మీర్‌లో జరిపిన ఓ ఆపరేషన్‌లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఉమర్ ఫరుక్‌ని పట్టుకుంటాడు. అయితే ఆ మిషన్ లో చిన్న పాప చనిపోతుంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ పాప చనిపోవడానికి కారణం తనే అనే భావనతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఓ మాల్‌లో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. పదకొండు నెలల తరవాత ఉమర్ ఫారుక్‌ని విడిపించుకోవడానికి ఉగ్రవాదులు ఓ కుట్ర పన్నుతారు. చెన్నైలోని ఓ షాపింగ్ మాల్ ని హైజాక్ చేసి అందులో ఉన్న ప్రజల్ని బంధీలుగా పట్టుకుని, ప్రభుత్వాన్ని బెదిరించి ఉమర్ ఫారుక్‌ని విడిపించుకోవాలన్నది ప్లాన్. అయితే టెర్రరిస్టులు షాపింగ్ మాల్ ని హైజాగ్ చేసినప్పుడు అక్కడే పనిచేస్తున్న వీర ఆ టెర్రరిస్టుల నుంచి ప్రజల్ని ఎలా కాపాడాడు? ఉమర్ ఫారుక్ పాకిస్థాన్ పారిపోకుండా ఎలా అడ్డుకున్నాడు? అనేదే మిగతా సినిమా కథ.[4]
నటీనటులు
[మార్చు]- విజయ్
- పూజా హెగ్డే[5]
- యోగి బాబు
- సెల్వ రాఘవన్
- విటివి గణేశ్
- అపర్ణా దాస్
- రెడిన్ కింగ్స్లీ
- షైన్ టామ్ చాకో
- ఆర్.సుబ్బలక్ష్మి
- లిల్లిపుట్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సన్ పిక్చర్స్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - నిర్మాత: కళానిధి మారన్
దిల్ రాజు - కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నెల్సన్ దిలీప్‌కుమార్
- సంగీతం: అనిరుధ్ రవిచందర్
- సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
- ఎడిటింగ్: ఆర్.నిర్మల్
మూలాలు
[మార్చు]- ↑ 10TV (4 April 2022). "బీస్ట్ తెలుగు రైట్స్ ఆయనకే..!" (in telugu). Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ TV9 Telugu (2 April 2022). "బీస్ట్ ట్రైలర్ వచ్చేసింది.. టెర్రరిస్ట్‌ల అంతుచూసే సోల్జర్ వీర రాఘవన్‌గా దళపతి". Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (22 March 2022). "'బీస్ట్' విడుదల తేదీ ఖరారు." Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.
- ↑ "విజయ్ 'బీస్ట్'మూవీ రివ్యూ". 13 April 2022. Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ Eenadu (12 November 2021). "'బీస్ట్' కోసం ఎదురుచూస్తున్నా". Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.