సర్కార్ (2018 సినిమా)
సర్కార్ | |
---|---|
దర్శకత్వం | ఎ.ఆర్ మురుగదాస్ |
రచన | ఎ.ఆర్ మురుగదాస్ బి. జయ మోహన్ |
స్క్రీన్ ప్లే | ఎ.ఆర్ మురుగదాస్ |
కథ | ఎ.ఆర్ మురుగదాస్ |
నిర్మాత | కళానిధి మారన్ |
తారాగణం | విజయ్ (నటుడు) కీర్తి సురేష్ వరలక్ష్మి శరత్ కుమార్ రాధా రవి అనితా సంపత్ (న్యూస్ రీడర్) |
ఛాయాగ్రహణం | గిరీష్ గంగాధరన్ |
కూర్పు | అక్కినేని శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | పాటలు: ఎ. ఆర్. రెహమాన్ నేపధ్య సంగీతం: ఎ. ఆర్. రెహమాన్ కుతుబ్-ఈ-క్రిప |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | సన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 6 నవంబరు 2018 |
సినిమా నిడివి | 164నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 110 కోట్లు [2] |
బాక్సాఫీసు | 250 కోట్లు [3] |
సర్కార్ పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో 2018లో విడుదలైన సినిమా. ఎ.ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్, కీర్తి సురేష్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా తెలుగు టీజర్ 2018, అక్టోబరు 24న విడుదలైంది. ఈ చిత్రం 2018, నవంబరు 6న విడుదలైంది.[4][5]
కథ
[మార్చు]సుందర్ రామస్వామి (విజయ్) ఎన్ఆర్ఐ అమెరికాలో పేరుమోసిన ఓ కంపెనీ సీఈవో. సంవత్సరానికి వెయ్యి కోట్లరూపాయలకు పైగా ఆదాయం. అలాంటి విజయ్ ఇండియాలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో తన ఓటు వేయడానికి ఇండియా వస్తాడు. తీరా ఓటు వేయడానికి బూత్ కి వెళ్తే.. ఓటు ఎవరో వేసేస్తారు. తన ఓటు తనకు కావాలని కోర్టుకు వెళ్తాడు విజయ్. రాజంగాన్ని దృష్టిలో పెట్టుకొని విజయ్ ఓటు తిరిగి ఇవ్వాలని తీర్పు ఇస్తుంది. ఇలాగే ఓటు గల్లంతైన దాదాపు మూడువేల మంది న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. దాంతో ముఖ్యమంత్రి పదవిని కావాలని కోరుకున్న రాధారవి ప్రమాణ స్వీకారానికి ముందు ఎన్నికలను రద్దుచేసి మరో 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం తీర్పు ఇస్తుంది. అదే ఎన్నికల్లో విజయ్ సీఎంగా పోటీ చేయాలని అనుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగింది అన్నదే సినిమా కథ. [6]
వివాదాలు
[మార్చు]- సర్కార్ కథ కాపీ కొట్టాడని పుకార్లు [7]
- అన్నాడీఎంకే పార్టీని అవమానించే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని విమర్శల నేపథ్యంలో మురుగదాస్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం మద్రాస్ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశాడు. [8]
మూలాలు
[మార్చు]- ↑ "Sarkar Running Time". 12 November 2018. Retrieved 12 November 2018.
- ↑ Stalin, J Sam Daniel (9 November 2018). "Makers Of Vijay's 'Sarkar' Reportedly Give In To AIADMK, To Drop Scenes". NDTV. Retrieved 22 August 2020.
- ↑ NTV Telugu (27 November 2016). "సర్కార్ 20 రోజుల్లోనే అంత కలెక్ట్ చేసిందా..?". Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
- ↑ Zee News Telugu (23 October 2018). "ఆసక్తిరేపుతున్న సర్కార్ తెలుగు టీజర్: నేనో కార్పొరేట్ క్రిమినల్ అంటున్న సర్కార్". Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
- ↑ NTV Telugu (23 October 2018). "టీజర్: సర్కార్ (తెలుగు)". Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
- ↑ Sakshi (6 November 2018). "'సర్కార్' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
- ↑ NTV Telugu (30 October 2020). "స్క్రిప్ట్ పై క్లారిటీ ఇచ్చిన మురుగదాస్". NTV Telugu. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
- ↑ NTV Telugu (9 November 2018). "బ్రేకింగ్ న్యూస్ : హైకోర్టు ను ఆశ్రయించిన మురుగదాస్". NTV Telugu. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.