గల్లా అరుణకుమారి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గల్లా అరుణకుమారి
Galla Aruna Kumari.JPG
గల్లా అరుణకుమారి
జననం గల్లా అరుణకుమారి
ఆగష్టు 1, 1949
దిగువమాఘం
వృత్తి రాష్ట్ర భూగర్భ మరియు గనుల శాఖా మంత్రి
ప్రసిద్ధి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కి అధ్యక్షులు
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రెటరీ
సాధించిన విజయాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి
పదవీ కాలము 1989 :చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే
1999-2009 మధ్యకాలంలో వరుసగా మూడు సార్లు ఎమ్.ఎల్.ఎ
మూడు సార్లు మంత్రి పదవి
నాల్గవ సారి విజయం సాధించి రోడ్లు భవనాల శాఖా మంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి మంత్రిత్వ శాఖలో భూగర్భ మరియు గనుల శాఖా మంత్రి
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
మతం హిందూ మతము
భార్య / భర్త గల్లా రామచంద్ర నాయుడు

గల్లా అరుణ కుమారి ప్రస్తుతము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భూగర్భ మరియు గనుల శాఖా మంత్రిగా కొనసాగుతున్నది.

గల్లా అరుణ కుమారి ఆగష్టు 1, 1949 లో పాటూరి రాజగోపాలనాయుడు మరియు అమరావతమ్మ దంపతులకు జన్మించినది. దిగువమాఘం ఈమె స్వగ్రామము.

అరుణ కుమారి అమరరాజా సంస్థ వ్యవస్థాపకుడు, పారిశ్రామికవేత్త అయిన డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు ను వివాహము చేసుకున్నది. జయదేవ్ మరియు రమాదేవి వీరి సంతానము. కంప్యూటర్ విభాగము నందు బి.యస్. డిగ్రీని పొంది కొన్ని దినములు క్రిస్లెర్ కార్పొరేషన్ నందు కంప్యూటర్ ప్రోగ్రామరుగా మరియు డిపార్ట్ మెంటు హెడ్డు గా పని చేసినది.

రాజకీయ జీవితం[మార్చు]

అరుణకుమారి తన రాజకీయ జీవితములో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కి అధ్యక్షులు గానూ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రెటరీ గానూ వ్యవహరించింది. ఆ తరువాత చంద్రగిరి నియోజక వర్గం నుండి 1989 లో మొదటి సారి మరియు 1999-2009 మధ్యకాలంలో వరుసగా మూడు సార్లు ఎమ్.ఎల్.ఎ గా విజయాన్ని సాధించినది. శాసనసభకు ఎన్నికైన తరువాత మూడు సార్లు మంత్రి పదవిని అలంకరించినది. 2008వ సంవత్సరంలో వైద్య విద్య మరియు ఆరోగ్య భీమా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈమె ఆరోగ్యశ్రీ పథక విజయానికి ముఖ్య భూమిక పోషించింది. ఆ తరువాత 2009లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాల్గవ సారి విజయం సాధించి రోడ్లు భవనాల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టినది. నవంబర్ 2010 లొ రోశయ్య రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రిత్వ శాఖలో భూగర్భ మరియు గనుల శాఖా మంత్రిగా స్థానము పొందినది.