దిగువమాఘం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గ్రామ ముఖద్వారం

దిగువమాఘం (Diguvamagham) గ్రామం చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలంలో ఉన్న ఒకానొక పెద్ద గ్రామం. ఈ గ్రామము.[1] చిత్తూరు పట్టణము నుండి 18 కిలోమీటర్ల దూరములో ఉంది. దిగువమాఘం గ్రామ పంచాయతీని కలిగి ఉంది. అమరపురి, శివగిరి ఆశ్రమము, వీర్లగుడిపల్లె, దిగువమాఘం హరిజనవాడ, దిగువమాఘం కాలనీ, వీర్లగుడిపల్లె హరిజనవాడ, వీర్లగుడిపల్లె మాదిగవాడ ఈ పంచాయతీ పరిధిలోకి వస్తాయి.

దిగువమాఘం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం తవణంపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 1,734
 - పురుషుల 838
 - స్త్రీల 896
 - గృహాల సంఖ్య 398
పిన్ కోడ్ 517129
ఎస్.టి.డి కోడ్ 08573

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

'మాఘం' ఇంటిపేరు గల రెడ్డి కులస్థులు ఇక్కడ ప్రప్రథమంగా నివసించేవారు. అగ్నిప్రమాదము జరిగి ఊరు కాలిపోగా, వారు ఊరి దిగువ ప్రాంతమునకు వచ్చి స్థిరపడిరి. దిగువ ప్రాంతమున మాఘం వర్గీయులు నివసించిన ప్రదేశము కావడంతో ఈ గ్రామానికి 'దిగువమాఘం' అనే పేరు వచ్చింది.

సమీప గ్రామాలు[మార్చు]

తడకర, వీర్లగుడిపల్లి, కొండ్రాజుకాల్వ, అరగొండ.

సమీప మండలాలు[మార్చు]

ఐరాల, బంగారుపాళ్యం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఆర్టీసీ మరియు ప్రైవేటు బస్సులు, షేరింగ్ ఆటోలు ఉన్నాయి. గ్రామము చేరుటకు ఎక్కవలసిన బస్సులు (చిత్తూరు నుండి) : అరగొండ, మాధవరం, సరకల్లు, ముచ్చుకాలువ, కామాలూరు, అరగొండ-బంగారుపాళ్యం, మత్యం-బంగారుపాళ్యం, జొన్నగురకల, జి.గొల్లపల్లి, ఎ.గొల్లపల్లి

గ్రామములో రాజకీయాలు[మార్చు]

నియోజక వర్గం
పూతలపట్టు
ప్రస్తుత సర్పంచి
ఉప్పాండ్ల కుమార్ నాయుడు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

రామాలయం, రచ్చబండ, సత్తెమ్మ బండ, శివాలయం, ధర్మరాజుల దేవస్థానం, గుండాలమ్మ గుడి, ఎరపాక్షమ్మ గుడి.

గ్రామ సంపద అయిన శివగిరి ఆశ్రమం గ్రామ వైభవానికి తలమానికం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

ప్రధాన పంటలు మామిడి (mango) మరియు చెరుకు (sugar cane). ప్రధాన ఉత్పత్తి బెల్లం (jagery). అరగొండ బెల్లం రాష్ట్రం లోనే అనకాపల్లి తరువాత రెండవ స్థానంలో ఉంది. చింతపండు, టెంకాయలు, ధాన్యాలు మరియు వేరుశనగ పంటలు కూడా పండించబడుతుంటాయి.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయము మరియు వ్యవసాయాధారిత పనులు ఇక్కడి ప్రధాన వృత్తి. కార్మిక జీవనము.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2001) - మొత్తం 1,734 - పురుషులు 838 - స్త్రీలు 896 - గృహాల సంఖ్య 398

'రాజన్న' గా సుప్రసిధ్ధుడైన పాటూరి రాజగోపాల నాయుడు 1900 వ సంవత్సరము నవంబర్ 7వ తేదీన తన స్వగ్రామమైన దిగువమాఘంలో జన్మించాడు. ఈయన స్వాతంత్ర్య సమర యోధుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. రైతు నాయకుడు. సాహితీవేత్త. సంఘసంస్కర్త. గొప్ప రచయిత. ఆయన కుమార్తె గల్లా అరుణ కుమారి మరియు మనుమడు గల్లా జయదేవ్ ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

జనాభా[మార్చు]

గ్రామంలో స్త్రీలు 406 మంది పురుషులు 358 మంది మొత్తంగా జనాభా 764 మంది ఉన్నారు. పంచాయతీ పరిధిలోని గ్రామాలన్నిటితో కలిపి మొత్తం జనాభా 1734గా ఉంది.

సదుపాయాలు[మార్చు]

గ్రామానికి రవాణా, గ్రంథాలయం, పాఠశాల, సహకారసంఘము, బ్యాంకు, తపాలా కార్యాలయము, ఉద్యానవనము, పిల్లల ఆటస్థలము మొదలైన సదుపాయాలు ఉన్నాయి. ఇంకా గ్రామానికి దగ్గరలో వైద్య విద్య సదుపాయాలు వాటితో పాటు వినోద సదుపాయం కూడా ఉంది. 1975 లో గ్రామానికి డబుల్ రోడ్డు ఏర్పడింది.

ప్రముఖులు[మార్చు]

మాజీ పార్లమెంటు సభ్యులు పాటూరి రాజగోపాల నాయుడు మరియు ఆయన కుమార్తె గల్లా అరుణ కుమారి, ఇంకా మనుమడు గల్లా జయదేవ్ ఈ గ్రామానికి చెందిన వారు. వీరు గ్రామములో అమరరాజా సంస్థ యొక్క ఒకానొక ప్రధాన విభాగమైన అమరరాజా ఎలెక్ట్రానిక్స్ ని స్థాపించారు. వీరి సంస్థలలోని వివిధ విభాగాలలో గ్రామ యువత మరియు మహిళలకు ఉద్యోగాలు లభించాయి.

ఇతర సమాచారం[మార్చు]

పిన్ కోడ్: 517129

మెయిల్: diguvamaghamvillage@gmail.com

బ్లాగ్: http://diguvamagham.blogspot.com/

బ్యాంకు: ఇండియన్ బ్యాంకు, IFSC Code: IDIB000D030 (used for RTGS and NEFT transactions), Branch Code: 00D030

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దిగువమాఘం&oldid=2050423" నుండి వెలికితీశారు