డూండీ
Appearance
డూండీ | |
---|---|
జననం | పోతిన డూండీశ్వరరావు' |
మరణం | జనవరి 1, 2007 |
వృత్తి | దర్శకుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1941 -2007 |
తల్లిదండ్రులు |
|
డూండీ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు. ఆయన అసలు పేరు పోతిన డూండీశ్వరరావు. డూండీగా ఆయన సుప్రసిద్ధుడు. 70 కి పైగా సినిమాలు నిర్మించాడు. అభిమానవతి అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించాడు. తెలుగు తెరపై అనేక ప్రయోగాలు చేసిన నిర్మాతగా డూండీకి పేరుంది. ఈయన తండ్రి పోతిన శ్రీనివాసరావు మన రాష్ట్రంలో మొట్టమొదటి సినిమా హాల్ (విజయవాడ మారుతీ టాకీస్)ను నిర్మించాడు. 1956లో తన తొలి చిత్రంతో తెలుగు సినీ రంగంలో నిర్మాతగా అడుగిడిన డూండీ 'బందిపోటు', 'రక్తసంబంధం', 'శాంతినివాసం', 'గూఢచారి 116', 'మరపురాని కథ' భలేదొంగలు,దొంగలకు దొంగ,దొంగలవేట లాంటి చిత్రాలు నిర్మించారు. తెలుగు సినిమాలలో ఘట్టమనేని కృష్ణను జేమ్స్ బాండ్ రూపంలో చూపించిన నిర్మాత డూండీనే. 2005 నంది అవార్డుల ఎంపిక కమిటీకి సారథ్యం వహించిన డూండీ 2007 జనవరి 1 న మరణించాడు.