Jump to content

ఉరుకు పటేల

వికీపీడియా నుండి
ఉరుకు పటేల
దర్శకత్వంవివేక్ రెడ్డి
కథవివేక్ రెడ్డి
నిర్మాత
  • కంచర్ల బాల భాను
తారాగణం
ఛాయాగ్రహణంస‌న్నీ కూర‌పాటి
సంగీతంప్ర‌వీణ్ ల‌క్క‌రాజు
నిర్మాణ
సంస్థ
లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్
విడుదల తేదీs
2024 సెప్టెంబరు 7 (2024-09-07)(థియేటర్)
2024 అక్టోబరు 18 (2024-10-18)( అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో)
దేశంభారతదేశం

ఉరుకు పటేల 2024లో విడుదలైన సినిమా. లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యానర్‌పై కంచర్ల బాల భాను నిర్మించిన ఈ సినిమాకు వివేక్ రెడ్డి దర్శకత్వం వహించాడు. తేజస్, కుష్బూ చౌదరి, గోపరాజు రమణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 31న,[1] ట్రైలర్‌ను ఆగస్ట్ 26న విడుదల చేయగా, సినిమాను సెప్టెంబర్ 7న విడుదలైంది.[2]

గ్రామ సర్పంచ్‌ రామరాజు (గోపరాజు రమణ) కుమారుడు పటేల (తేజస్‌ కంచర్ల). చిన్నప్పుడే తనకు చదువు రాదని అర్ధమయిపోయి చదువు మధ్యలోనే వదిలేసి ఎప్పటికైనా బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లాడాలని అనుకోగా ఊర్లోనే కాదు, పక్క ఊరి వాళ్లు కూడా అమ్మాయిని ఇవ్వరు. ఈ క్రమంలో తన స్నేహితుడి పెళ్లిలో డాక్టర్‌ అక్షర (ఖుష్బూ చౌదరి) పరిచయమవుతుంది. ఆమెతో పరిచయం స్నేహంగా మారాక, ఓ ప్రమాదం నుంచి ఆమెను కాపాడతాడు. అక్షర పుట్టినరోజున శుభాకాంక్షలు తెలపడానికి చేయడానికి వెళ్లిన పటేలాకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. అక్షర కుటుంబాన్ని చూసి పటేల ఎందుకు బయపడుతాడు? పటేల అక్షరలు పెళ్లి చేసుకుంటారా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్
  • నిర్మాత: కంచర్ల బాల భాను
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వివేక్ రెడ్డి
  • సినిమాటోగ్రఫీ: స‌న్నీ కూర‌పాటి
  • సంగీతం: ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు

మూలాలు

[మార్చు]
  1. "'ఉరుకు పటేలా' టీజర్ రిలీజ్.. మస్త్ ఉంది." 10TV Telugu. 31 July 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  2. "సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా". Sakshi. 18 October 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  3. "తేజస్ కంచర్ల నటించిన 'ఉరుకు పటేలా' సినిమా ఎలా ఉందంటే". Chitrajyothy. 7 September 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  4. "'ఉరుకు పటేల' బలం కథలోని కొత్తదనమే". Eenadu. 7 September 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.