Jump to content

మాస్ట్రో

వికీపీడియా నుండి
మాస్ట్రో
దర్శకత్వంమేర్లపాక గాంధీ
దీనిపై ఆధారితంహిందీ సినిమా అంధాదున్‌ కి రీమేక్
నిర్మాత
  • సుధాకర్ రెడ్డి
  • నికిత రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంజె యువరాజ్‌
కూర్పుఎస్.ఆర్ శేఖర్
సంగీతంసాగర్ మహతి
నిర్మాణ
సంస్థ
శ్రేష్ఠ్ మూవీస్‌
విడుదల తేదీ
17 సెప్టెంబర్ 2021
సినిమా నిడివి
138 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

మాస్ట్రో 2021లో నిర్మించిన తెలుగు సినిమా. శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. నితిన్‌, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు..[1] మాస్ట్రో డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో 17 సెప్టెంబర్ 2021న విడుదలైంది.

అరుణ్‌(నితిన్‌) ఓ పియానో ప్లేయర్‌. ఈ క్రమంలోనే ఓ రెస్టారెంట్‌లో అమ్మకానికి ఉన్న పియానో కొందామని వెళ్లి ఆ రెస్టారెంట్‌ ఓనర్‌ కుమార్తె సోఫి(నభా నటేశ్‌)తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. అదే రెస్టారెంట్‌కు తరచూ వచ్చే ఒకప్పటి హీరో అయిన మోహన్‌ (నరేశ్‌) అరుణ్‌లోని టాలెంట్‌ చూసి తన రెండో భార్య (సిమ్రన్)తో తన వివాహ వార్షికోత్సవానికి ఇంటికొచ్చి ప్రైవేట్ కన్సర్ట్ చేయాల్సిందిగా అతణ్ని కోరతాడు. అరుణ్‌ మోహన్‌ ఇంటికి వెళ్లే సరికి అతడు హత్యకు గురవుతాడు. సిమ్రాన్‌ తన ప్రియుడి (జిషుసేన్‌గుప్తా) తో కలిసి మోహన్‌ను చంపిందనే విషయాన్ని అరుణ్‌ గ్రహిస్తాడు. వారిపై పోలీస్‌ కైంప్లెంట్‌ ఇవ్వాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అంధుడైన అరుణ్‌ ఆ హత్య విషయాన్ని పోలీసులకు చెప్పాడా? అనేదే మిగతా సినిమా కథ.[2]

చిత్ర నిర్మాణం

[మార్చు]

ఈ సినిమా హిందీ సినిమా అంధాధూన్’ కు తెలుగు రీమేక్‌‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి రీమేక్ హక్కులను సెప్టెంబర్ 2019లో శ్రేష్ట్ మూవీస్‌ అధినేత ఎన్. సుదాకర్ రెడ్డి పొందాడు.ఈ చిత్రాన్ని 2020 ఫిబ్రవరి 24న ప్రారంభించారు.[3] ఈ సినిమా షూటింగ్ ఈ సినిమాను 2021 జూన్ 11న విడుద‌ల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. కరోనా కారణంగా వాయిదా పడడంతో రిలీజ్ ఆగి పోయింది. ఈ సినిమా షూటింగ్ జులై 2021లో పూర్తయింది.[4]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • వెన్నెల్లో ఆడపిల్ల, రచన: శ్రీజో, కృష్ణచైతన్య, గానం. స్వీకర ఆగస్తి
  • బేబీ ఓ బేబీ, రచన: శ్రీజో, గానం. అనురాగ్ కులకర్ణి
  • లా లా లా , రచన: కాసర్ల శ్యామ్, గానం.ధనుంజయ సీపన
  • షురు కరో , రచన: శ్రీమణి , గానం. ఎల్. వి. రేవంత్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్
  • నిర్మాతలు:ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
  • దర్శకత్వం: మేర్లపాక గాంధీ
  • సమర్పణ: రాజ్ కుమార్ ఆకేళ్ల
  • సంగీతం: సాగర్ మహతి

మూలాలు

[మార్చు]
  1. HMTV (14 June 2021). "Nithiin: 'మాస్ట్రో' షూటింగ్‌ ప్రారంభం". HMTV. Archived from the original on 16 June 2021. Retrieved 15 June 2021.
  2. Eenadu (17 September 2021). "Maestro Review: రివ్యూ: మాస్ట్రో - nithiin maestro telugu movie review". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
  3. The Times of India (24 February 2021). "Andhadhun Telugu remake launched: Nithiin teams up with Merlapaka Gandhi - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.
  4. Andhrajyothy (20 June 2021). "నితిన్ 'మాస్ట్రో' షూటింగ్‌ పూర్తి". andhrajyothy. Archived from the original on 23 జూన్ 2021. Retrieved 23 June 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=మాస్ట్రో&oldid=4014943" నుండి వెలికితీశారు