ఇష్క్
ఇష్క్ (2012 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విక్రమ్ కే కుమార్ |
---|---|
నిర్మాణం | విక్రమ్ గౌడ్ సుధాకర్ రెడ్డి |
కథ | విక్రమ్ కే కుమార్ |
చిత్రానువాదం | విక్రమ్ కే కుమార్ |
తారాగణం | నితిన్ నిత్య మీనన్ అజయ్ శ్రీనివాస రెడ్డి |
సంగీతం | అనూప్ రూబెన్స్ అరవింద్ శంకర్ |
సంభాషణలు | రమేష్ ఎస్. |
ఛాయాగ్రహణం | పి.సి.శ్రీరామ్ |
కూర్పు | అక్కినేని శ్రీకర్ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | శ్రేష్ట్ మూవీస్ |
పంపిణీ | మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. |
అవార్డులు | ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం (నంది అవార్డు 2012) |
భాష | తెలుగు |
పెట్టుబడి | ₹7.8 కోట్లు (US$1.1 మిలియన్) |
వసూళ్లు | ₹28.02 కోట్లు (US$3.9 మిలియన్) |
ఇష్క్ 2012, ఫిబ్రవరి 24న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శ్రేష్ట్ మూవీస్ పతాకంపై విక్రమ్ గౌడ్, సుధాకర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో విక్రం కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, నిత్య మీనన్ ప్రధాన పాత్రలు పోషించగా, అనూప్ రూబెన్స్, అరవింద్ శంకర్ సంగీతం అందించారు. ఈ చిత్రం 2012లో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నంది అవార్డు అందుకుంది.
తారాగణం
[మార్చు]- నితిన్ (రాహుల్)
- నిత్య మేనన్ (ప్రియ)
- అజయ్ (శివ, ప్రియ అన్న)
- మధునందన్ (ప్రేమ్)
- సింధు తులాని (దివ్య)
- రోహిణి (జయ ఆంటీ)
- నాగినీడు (ప్రియ తండ్రి)
- సుధ (ప్రియ తల్లి)
- ఆలీ (రాహుల్ స్నేహితుడు)
- శ్రీనివాస రెడ్డి (శివ అసిస్టెంట్)
- సుదీప్ (కాల)
- రవి ప్రకాష్ (ప్రభు, శివ ఫ్రెండ్)
- తాగుబోతు రమేష్ (స్నేహితుడు)
- రత్నశేఖర్ రెడ్డి (రజా)
- సత్య కృష్ణన్ (గీత)
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: విక్రమ్ కే కుమార్
- నిర్మాణం: విక్రమ్ గౌడ్, సుధాకర్ రెడ్డి
- సంగీతం: అనూప్ రూబెన్స్, అరవింద్ శంకర్
- సంభాషణలు: రమేష్ ఎస్.
- ఛాయాగ్రహణంం: పి.సి. శ్రీరామ్
- కూర్పు: అక్కినేని శ్రీకర్ ప్రసాద్
- నిర్మాణ సంస్థ: శ్రేష్ట్ మూవీస్
- పంపిణీ: మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి.
పాటలు
[మార్చు]ఇష్క్ | |
---|---|
పాటలు by | |
Released | 2 ఫిబ్రవరి 2012 |
Recorded | 2012 |
Genre | సినిమా పాటలు |
Length | 24.55 |
Language | తెలుగు |
Label | ఆదిత్యా మ్యూజిక్ |
Producer | అనూప్ రూబెన్స్ |
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, అరవింద్ శంకర్ సంగీతం అందించారు.[2] 2012, ఫిబ్రవరి 22న ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. పాటల విడుదల కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వచ్చాడు.[3] కృష్ణచైతన్య నాలుగు పాటలు, అనంత శ్రీరామ్ రెండు పాటలు రాశారు. నితిన్, నిత్యా మీనన్ కూడా పాటలు పాడారు. సినిమా ప్రచారంకోసం ఇంటర్నెట్ లో విడుదలచేసిన "లచ్చమ్మ" పాటకు మంచి స్పందన వచ్చింది.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "లచ్చమ్మ (రచన: నితిన్, కృష్ణ చైతన్య)" | అనూప్ రూబెన్స్, నితిన్, తాగుబోతు రమేష్, మురళి | 03:45 | ||||||
2. | "ఓ ప్రియా ప్రియా (రచన: కృష్ణ చైతన్య)" | అద్నాన్ సమీ, నిత్యా మీనన్ | 04:22 | ||||||
3. | "సూటిగా చూడకు (రచన: అనంత శ్రీరాం)" | హరిహరన్, సైంధవి | 05:05 | ||||||
4. | "చిన్నాదనా నీకోసం (రచన: కృష్ణ చైతన్య)" | రాజ్ హాసన్, అనూప్ రూబెన్స్, శ్రావణి | 03:42 | ||||||
5. | "ఏదో ఏదో (రచన: అనంత శ్రీరాం)" | ప్రదీప్ విజయ్, కళ్యాణి నాయర్ | 04:32 | ||||||
6. | "లచ్చమ్మ రిమిక్స్ (రచన: నితిన్, కృష్ణ చైతన్య)" | అనూప్ రూబెన్స్, నితిన్, తాగుబోతు రమేష్, మురళి | 03:29 | ||||||
24.55 |
స్పందన
[మార్చు]ఈ చిత్రం అభిమానులు, విమర్శకుల నుండి మంచి స్పందనను పొందింది. నితిన్ కెరీర్‌లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం 2012 ఏప్రిల్ 13 నాటికి 50 రోజులు, 2012 జూన్ 2 నాటికి ఆంధ్రప్రదేశ్ లోని 11 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. 123తెలుగు, కొన్ని ఇతర సినిమా వైబ్సైట్లు ఇష్క్ మూవీని అరుదైన ఘనత సాధించిన చిత్రంగా ప్రశంసించాయి. చిత్ర విజయం గురించి నితిన్ కూడా ట్వీట్ చేశాడు.[4]
పురస్కారాలు
[మార్చు]- నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలులో ఉత్తమ కుటుంబ కథా చిత్రం, ఉత్తమ సహాయ నటుడు (అజయ్) విభాగంలో అవార్డులు వచ్చాయి.[5][6][7][8]
పురస్కారం | విభాగం | గ్రహీత | ఫలితం |
---|---|---|---|
2012 నంది పురస్కారాలు[9] | ఉత్తమ కుటుంబ కథా చిత్రం | సుధాకర్ రెడ్డి | గెలుపు |
ఉత్తమ సహాయనటుడు | అజయ్ | గెలుపు | |
2వ దక్షణభారత అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులు | ఉత్తమ చిత్రం | విక్రమ్ గౌడ్ | ప్రతిపాదించబడింది |
ఉత్తమ దర్శకుడు | విక్రమ్ కుమార్ | ప్రతిపాదించబడింది | |
ఉత్తమ ఛాయాగ్రాహకుడు | పి.సి.శ్రీరామ్ | ప్రతిపాదించబడింది | |
ఉత్తమ సహాయ నటుడు | అజయ్ | ప్రతిపాదించబడింది | |
ఉత్తమ సహాయ నటి | సింధు తులానీ | ప్రతిపాదించబడింది | |
ఉత్తమ హాస్యనటుడు | ఆలీ | ప్రతిపాదించబడింది |
మూలాలు
[మార్చు]- ↑ "ఇష్క్ సినిమా సమీక్ష". movies.fullhyderabad.com. Archived from the original on 18 June 2017. Retrieved 15 November 2016.
- ↑ http://www.idlebrain.com/news/2000march20/chitchat-aravindshankar.html
- ↑ "Ishq Audio Launch". idlebrain. Retrieved 17 August 2020.
- ↑ "Ishq completes 100 days". 123telugu.com. Retrieved 17 August 2020.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 30 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
- ↑ Upadhyaya, Prakash (1 March 2017). "Nandi Awards 2012-2013: Here is the complete list of winners". International Business Times India. Archived from the original on 2 March 2017. Retrieved 17 August 2020.
ఇతర లంకెలు
[మార్చు]- 2012 తెలుగు సినిమాలు
- Duration without hAudio microformat
- Album articles with non-standard infoboxes
- Album articles lacking alt text for covers
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- నితిన్ నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- నిత్య మేనన్ నటించిన సినిమాలు
- రోహిణి నటించిన సినిమాలు
- సుధ నటించిన సినిమాలు