సైంధవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైంధవి
జీవిత భాగస్వామి, (div. May 2024) [1]
పిల్లలుఒక కూతురు (జ.2020)
సంగీత ప్రస్థానం
సంగీత శైలిప్లేబ్యాక్ సింగర్
వృత్తి
  • ప్లేబ్యాక్ సింగర్
  • కర్ణాటక సంగీతం
  • గాయని
క్రియాశీల కాలం2002–ప్రస్తుతం

సైంధవి భారతీయ కర్ణాటక సంగీత గాయకురాలు. ఆమె చలనచిత్ర నేపథ్య గాయని కూడా. ఆమె 12 సంవత్సరాల వయస్సు నుండి ప్రదర్శనలు ఇవ్వడం విశేషం.[2][3]

సైమా(SIIMA) అవార్డ్స్ 2021లో ఆమెకు తమిళ చిత్రసీమలో ఉత్తమ నేపథ్య గాయని పురస్కారం దక్కింది.

కెరీర్

[మార్చు]

తెలుగులో, ఆమె శేఖర్ కమ్ముల చిత్రం ఆవకాయ్ బిర్యానీలో మామిడి కొమ్మ కి.., శశిరేఖా పరిణయంలో ఏదో.., శక్తిలో హేమచంద్రతో పాటు ప్రేమదేశం యువరాణి.., ఇష్క్‌లో సూటిగా చూడకు పాటలు పాడింది. కన్నడలో ఆమె సూపర్ హిట్ చిత్రం సైకో చిత్రంలో ముస్సంజే రంగల్లి.., బెళదింగాలంటే మిను మినుగుతా.. పాటలు పాడింది.[4]

ఆమె ఇదు ఒరు కాదల్ కధై, ఎధిర్ నీచల్, చెల్లామై చెల్లం, మగలిర్ మట్టుమ్ అనే టీవీ సిరీస్‌లకు టైటిల్ సాంగ్స్ పాడింది. కాస్మిక్ మ్యూజిక్ ద్వారా ప్రసిద్ధ ఆల్బమ్‌ల సేక్రేడ్ చాంట్స్‌లో ఆమె ప్రధాన గాయకులలో ఒకరు. శ్రీకృష్ణునిపై ఆమె భక్తిగీత ఆల్బమ్ అలిలయిల్ ఉరంగుకుంర మాయక్కన్ననే.. గానాంజలి రికార్డింగ్స్ ద్వారా 2012లో విడుదలైంది.[5]

ఆమె ఆలపించిన కొన్ని తెలుగు సినిమా పాటలు:

పాట సినిమా స్వరకర్త
నాలో నేనేనా బాణం మణి శర్మ
వెలిగినడొక వనవిల్లు నాన్నా జి. వి. ప్రకాష్ కుమార్
ఏదో ఒప్పుకోనండి శశిరేఖా పరిణయం విద్యాసాగర్
చిన్నదాన నీకోసం ఇష్క్ అనూప్ రూబెన్స్
సూటిగా చూడకు ఇష్క్ అనూప్ రూబెన్స్
ప్రేమ దేశం శక్తి మణి శర్మ
లవ్లీ లవ్లీ లవ్‌లీ అనూప్ రూబెన్స్
మురళీ లోలా ప్రస్థానం మహేష్ శంకర్
యధో యధో శశిరేఖా పరిణయం మణి శర్మ & విద్యాసాగర్
ముద్దె పెట్టు డాన్ రాఘవ లారెన్స్
అరెరే వానా ఆవారా యువన్ శంకర్ రాజా
మకతిక ఖలేజా మణి శర్మ
యెలగెలగా పరుగు మణి శర్మ
రైలు బండి గంగోత్రి ఎం.ఎం.కీరవాణి
నచ్చావే కాస్కో ప్రేమగీ అమరెన్
తెలిసినది జండా పై కపిరాజు జి.వి.ప్రకాష్ కుమార్
కన్నులో వున్నావు పోలీసు జి.వి.ప్రకాష్ కుమార్
మామిడి కొమ్మకి ఆవకాయ్ బిర్యానీ మణికాంత్ కద్రి

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సైంధవి తన స్కూల్‌మేట్, కంపోజర్ జి. వి. ప్రకాష్ కుమార్‌ని 2013 జూన్ 27న చెన్నైలో వివాహం చేసుకుంది.[6] ఈ జంటకు ఒక కుమార్తె ఉంది.[7]

మూలాలు

[మార్చు]
  1. "GV Prakash: వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్‌, సైంధవి దంపతులు | music-director-gv-prakash-and-his-wife-saindhavai-announced-their-divorce". web.archive.org. 2024-05-14. Archived from the original on 2024-05-14. Retrieved 2024-05-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Saindhavi - Profile - Chennaiyil Thiruvaiyaru". Lakshman Sruthi. Archived from the original on 26 December 2007. Retrieved 29 June 2018.
  3. "Singer Saindhavi profile". IndiaGlitz. 31 May 2007. Archived from the original on 2 June 2007. Retrieved 11 May 2010.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  4. "Psycho Songs Download". gaana.com. Retrieved 8 June 2019.
  5. Songs on Lord Krishna by Saindhavi
  6. "GV Prakash-Saindhavi wedding on June 27!". Sify. 17 April 2013. Archived from the original on 19 April 2013. Retrieved 18 April 2013.
  7. "GV Prakash and Saindhavi welcome their first child, a baby girl who was named Anvi".
"https://te.wikipedia.org/w/index.php?title=సైంధవి&oldid=4220355" నుండి వెలికితీశారు