Jump to content

పోలీస్ (2016 సినిమా)

వికీపీడియా నుండి
పోలీస్
దర్శకత్వంఅట్లీ
రచనఅట్లీ & ఎస్ . రమణ గిరివాసన్
(Dialogue)
తారాగణంవిజయ్, సమంత, అమీ జాక్సన్, నైనిక, ప్రభు, రాధిక
ఛాయాగ్రహణంజార్జ్ సి విలియమ్స్
కూర్పుఅన్తోనీ రుబెన్
సంగీతంజి. వి. ప్రకాష్ కుమార్
నిర్మాణ
సంస్థ
[శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ
15 ఏప్రిల్ 2016 (2016-04-15)
సినిమా నిడివి
158 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

పోలీస్ 2016లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. విజయ్, సమంత, అమీ జాక్సన్, నైనిక, ప్రభు, రాధిక , మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో ‘తెరి’ పేరుతో14 ఏప్రిల్ 2016న, తెలుగులో ‘పోలీస్’ పేరుతో ఏప్రిల్ 15, 2016న విడుదలైంది.

కేరళలో బేకరీ నడుపుకుంటూ తన కూతురు నివేదిత (బేబీ నైనిక)తో కలిసి ప్రశాంత జీవనం సాగిస్తుంటాడు జోసెఫ్ (విజయ్). ఏ సమస్యలోనూ తలదూర్చని జోసెఫ్ తన కూతురు నివేదిత స్కూల్ టీచర్ అనీ (అమీ జాక్సన్) కారణంగా లోకల్ రౌడీలతో చిన్న గొడవ అవుతుంది. అప్పుడే జోసెఫ్ లోని అసలు మనిషి బయటికి వస్తాడు. అతను హైదరాబాద్ లో డీసీపీగా పని చేసిన విజయ్ కుమార్ అని తెలుస్తుంది. ఐపియస్ గా వుండే విజయ్ కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి ? విజయ్ ఉద్యోగం వదిలేసి పేరు మార్చుకుని కేరళలో బేకరీ నడుపుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అనేదే మిగతా సినిమా కథ.[1][2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
  • నిర్మాత: దిల్ రాజు, కలైపులి ఎస్.థాను
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అట్లీ
  • సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
  • సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్
  • ఎడిటర్: అన్తోనీ రుబెన్

మూలాలు

[మార్చు]
  1. The Hindu (15 April 2016). "Police: An old revenge drama" (in Indian English). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  2. CineJosh (16 April 2016). "సినీజోష్‌ రివ్యూ: పోలీస్‌". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.