జి. వి. ప్రకాష్

వికీపీడియా నుండి
(జి. వి. ప్రకాష్ కుమార్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జి. వి. ప్రకాష్ కుమార్
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లుజి. వి. ప్రకాష్
జననం (1987-06-13) 1987 జూన్ 13 (వయసు 37)
చెన్నై, తమిళనాడు
సంగీత శైలిసినీ సంగీతం
వృత్తిసినీ సంగీత దర్శకుడు, వాయిద్య కారుడు, నేపథ్య గాయకుడు, సినీ నిర్మాత, నటుడు
వాయిద్యాలుగిటార్, పియానో/కీబోర్డు, నేపథ్య గానం
క్రియాశీల కాలం2006–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసైంధవి (నేపథ్య గాయని) (m.2013, div. May 2024) [1]
పిల్లలుఒక కూతురు (జ.2020)
బంధువులుఎ. ఆర్. రెహమాన్ (మేనమామ)

జి. వి. ప్రకాష్ ఒక భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు. ఎక్కువగా తమిళ సినిమాలకు సంగీతాన్ని సమకూర్చాడు. 2010 సంవత్సరం మొదట్లో వెలుగులోకి వచ్చాడు.[2] తర్వాత ఇతను సినీ నిర్మాణం, నటనా రంగంలోకి ప్రవేశించాడు. ఇతను ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహ్మాన్ కు మేనల్లుడు. ఇతని భార్య సైంధవి గాయని. ముందుగా రెహమాన్ దగ్గర పలుచిత్రాలకు సంగీత విభాగంలో పనిచేశాడు. కొద్ది రోజులు హ్యారిస్ జయరాజ్ దగ్గర కూడా శిష్యరికం చేసి తరువాత సొంతంగా సంగీత దర్శకత్వం వహించడం ప్రారంభించాడు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ప్రకాష్ తల్లి దండ్రులు జి. వెంకటేష్, ఏ. ఆర్. రిహానా. తల్లి ఏ. ఆర్. రెహ్మాన్ కు అక్క.[4] తల్లి రెహనాకు సంగీతం అంటే ఆసక్తి ఉండటంతో ప్రకాష్ ను నాలుగు సంవత్సరాల వయసు నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి పంపించేది. ఆరేళ్ళకి పియానో క్లాసులో చేరాడు. అదే సమయంలో మేనమామ రెహమాన్ ప్రకాష్ కు పాటలు నేర్పించి సినిమాల్లో పాడించాడు. ప్రకాష్ ఏడో తరగతిలో ఉండగా తల్లిదండ్రులు విడిపోయారు. పిల్లలు తండ్రి దగ్గరే ఉండిపోయారు. తల్లి మాత్రం ఒంటరిగా ఉంటూ గాయనిగా తన కెరీర్ ప్రారంభించింది.[5]

జూన్ 27, 2013 న ప్రకాష్ గాయని సైంధవిని చెన్నై లోని మేయర్ రామనాథన్ చెట్టియార్ హాల్ వేదికపై వివాహం చేసుకున్నాడు. సైంధవి, ప్రకాష్ చెట్టినాడ్ విద్యాశ్రమంలో కలిసి చదువుకున్నారు.[6] ఈ జంట 13 మే 2024న విడిపోతున్నట్లు ప్రకటించారు.[7]

కెరీర్

[మార్చు]

సంగీత రంగం

[మార్చు]

ప్రకాష్ మొదటి సారిగా తన మేనమామ ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన శంకర్ సినిమా జెంటిల్మేన్ కి సౌండ్ ట్రాక్ విభాగంలో పనిచేశాడు. ఇంకా రెహమాన్ ఇతర ప్రాజెక్టుల్లో కూడా పనిచేశాడు.[8] తర్వాత కొద్ది రోజులు హ్యారిస్ జయరాజ్ తో కలిసి పనిచేశాడు. అన్నియన్ (తెలుగులో అపరిచితుడు), ఉన్నాళే ఉన్నాళే అనే రెండు సినిమాల్లో పాటలు పాడాడు.

ప్రకాష్ మొదటిసారిగా ఎస్. శంకర్ నిర్మాణ సారథ్యంలో, వసంత బాలన్ దర్శకత్వంలో వచ్చిన వేయిల్ అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. తరువాత ఎ. ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన మదరాస పట్టణం అనే సినిమాకు ఇతను కూర్చిన సంగీతం కూడా ఆకట్టుకున్నది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన మయాక్కం ఎన్న అనే సినిమా ధనుష్ హీరోగా ప్రకాష్ కి మూడో సినిమా. ఈ సినిమా సంగీతం కూడా విమర్శకుల ప్రశంసలందుకుంది.

సంవత్సరం తమిళం తెలుగు ఇతర భాషలు గమనికలు
2006 వెయిల్ వేసవి
2007 ఓరం పో నేను ఆటోవాని (2011)
కిరీడం పూర్ణామార్కెట్ (2011)
పొల్లాధవన్ • (3 పాటలు) పుండా (2010) (కన్నడ) ♦
ఎవనో ఒరువన్# [టైటిల్ సాంగ్] ఎవరో ఒకారు (2009)
వెల్లి తిరై
కాళై
2008 ఉల్లాసంగా ఉత్సాహంగా ఉల్లాస ఉత్సాహ (2009) (కన్నడ) ♦

అయ్యో పావం (2009) ( మలయాళం )

కుసేలన్ కథానాయకుడు
ఆనంద తాండవం ఆనంద తాండవం (2009)
నాన్ అవల్ అధు • (2 పాటలు) నేనూ తనూ ఆమె సౌండ్‌ట్రాక్ విడుదల చేయబడింది; సినిమా విడుదల కాలేదు
సేవల్ బల్లెం (2011)
2009 అంగడి తేరు# [4 పాటలు] షాపింగ్ మాల్ (2010)
ఆయిరతిల్ ఒరువన్ యుగానికి ఒక్కడు (2010)
ఇరుంబుక్కోట్టై మురట్టు సింగం# సూపర్ కౌబాయ్ (2010)
2010 మద్రాసపట్టణం 1947 ఎ లవ్ స్టోరీ (2011)
డార్లింగ్
వా
ఆడుకలం పందెం కొల్లు (2015)
  • ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
2011 నర్తగి
దైవ తిరుమగల్
మయక్కమ్ ఎన్న మిస్టర్ కార్తీక్ (2016)
ముప్పోజుదుమ్ అన్ కార్పనైగల్ నిరంతరమ్ నీ ఊహలో
2012 ఎందుకంటే... ప్రేమంట!
సాగుని శకుని 2 పాటలను మళ్లీ ఉపయోగించారు
గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ – పార్ట్ 1#2 ( హిందీ )
జోకర్# (హిందీ)
గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ – పార్ట్ 2#2 (హిందీ)
తాండవం శివ తాండవం
పరదేశి పరదేశి
నాన్ రాజవగా పొగిరెన్
2013 ఒంగోలు గీత# [4 పాటలు]
అన్నకోడి
ఉదయమ్ NH4 NH 4
తలైవా అన్నా - నాయకుడిగా జన్మించాడు
రాజా రాణి రాజా రాణి
JK ఎనుమ్ నన్బనిన్ వాఙ్కై# రాజాధి రాజా#
నిమిరందు నిల్ జండా పై కపిరాజు
2014 నాన్ సిగప్పు మనితన్ ఇంద్రుడు
శైవం
ఇరుంబు కుత్తిరై
డార్లింగ్
అగ్లీ# (హిందీ)
2015 పెన్సిల్
కొంబన్
రాజతంతిరం #
ఇదు ఎన్న మాయం
కావల్ # (5 పాటలు)
కాక ముట్టై హాఫ్ టికెట్ (మరాఠీ)
త్రిష ఇల్లానా నయనతార త్రిష లేదా నయనతార
ఈట్టి
2016 విసరనై విచారణ
తేరి
  • 50వ సినిమా
ఎనక్కు ఇన్నోరు పెర్ ఇరుక్కు
మీండుమ్ ఒరు కాదల్ కధై
బ్రూస్ లీ
కడవుల్ ఇరుకన్ కుమారు
2017 ముప్పరిమానం
లెన్స్
2018 సెమ్మ చిన్ని కృష్ణుడు (2020)
2019 కుప్పతు రాజా
వాచ్ మాన్
100% కాదల్
అసురన్
  • ఉత్తమ సంగీత దర్శకుడిగా ఒసాకా తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు
2020 పుతం పుదు కాళై
సూరరై పొట్రు ఆకాశం నీ హద్దురా
  • ఉత్తమ నేపథ్య సంగీతానికి జాతీయ చలనచిత్ర అవార్డులు
  • ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
2021 వణక్కం దా మాప్పిలే
తలైవి తలైవి తలైవి (హిందీ)
బ్యాచిలర్ # [3 పాటలు]
2022 మారన్
సెల్ఫీ
విసితిరన్
అయ్యంగారన్
యానై
సర్దార్
2023 వాతి సర్
రుద్రన్ # [5 పాటలు] రుద్రుడు
మోడ్రన్ లవ్ చెన్నై వెబ్ సిరీస్ ఎపిసోడ్ 3: "కాదల్ ఎన్‌బదు కన్నుల హార్ట్ ఇరుక్కురా ఎమోజి"
అరె # అరె #
కాథర్ బాషా ఎండ్ర ముత్తురామలింగం
అనేతి
కారుమేగంగల్ కలైగింద్రణ
మార్క్ ఆంటోనీ
టైగర్ నాగేశ్వరరావు
జపాన్
ఆదికేశవ
2024 కెప్టెన్ మిల్లర్
మిషన్: అధ్యాయం 1
సైరన్

సినీ నిర్మాణం

[మార్చు]

ప్రకాష్ 2013 లో జి. వి. ప్రకాష్ కుమార్ ప్రొడక్షన్స్ పేరుతో స్వంతంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ మొట్టమొదటి సినిమా, బాలు మహేంద్ర దగ్గర సహాయకుడుగా పనిచేసిన విక్రం సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన మాదా యానై కూట్టం.[9][10]

నటుడిగా

[మార్చు]

2012 లో దర్శకుడు మురుగదాస్ ఇతన్ని చూసి తన సినిమాలో నటించమని అడిగాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. తరువాత ప్రకాష్ మూడు సినిమాల్లో నటించడానికి అంగీకరించాడు. ఆడుకాలం నరేన్ దగ్గర నటనలో శిక్షణ పొందాడు.[11] తెలుగులో వచ్చిన ప్రేమకథా చిత్రమ్ సినిమాకు రీమేక్ అయిన డార్లింగ్ సినిమాలో నటించాడు.

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2008 కుసేలన్ అతనే "సినిమా సినిమా" పాటలో అతిధి పాత్ర
2013 నాన్ రాజవగా పొగిరెన్ "కాలేజ్ పాదం" పాటలో అతిధి పాత్ర
తలైవా నర్తకి "వంగన్న" పాటలో అతిధి పాత్ర
2015 డార్లింగ్ కతీర్
JK ఎనుమ్ నన్బనిన్ వాఙ్కై అతనే "టైటిల్" పాటలో అతిధి పాత్ర
త్రిష ఇల్లానా నయనతార జీవా
2016 పెన్సిల్ శివుడు
ఎనక్కు ఇన్నోరు పెర్ ఇరుక్కు జానీ
కడవుల్ ఇరుకన్ కుమారు కుమార్
2017 బ్రూస్ లీ బ్రూస్ లీ (జెమినీ గణేశన్)
అన్బానవన్ అసరాధావన్ అడంగాధవన్ జీవా అతిధి పాత్ర
2018 నాచియార్ కాఠవరాయన్
సెమ్మ కులందైవేలు
2019 సర్వం తాళ మయం పీటర్ జాన్సన్
కుప్పతు రాజా రాకెట్
వాచ్ మాన్ బాల
శివప్పు మంజల్ పచ్చై మధన్ తెలుగులో ఒరేయ్ బామ్మర్థి
100% కాదల్ బాలు
2021 వణక్కం దా మాప్పిలే అరవింద్
బ్యాచిలర్ డార్లింగ్
జైల్ కరుణా
2022 సెల్ఫీ కనల్
అయ్యంగారన్ మతి
2023 ఆదియే జీవా
2024 తిరుగుబాటుదారుడు కతిరేసన్
2024 ఇడిముజక్కం TBA చిత్రీకరణ
13 TBA ప్రీ-ప్రొడక్షన్
కాల్వన్ TBA ఏప్రిల్ 4న విడుదల
డియర్ TBA ఏప్రిల్ 11న విడుదల

పురస్కారాలు

[మార్చు]
  • 2010: సంవత్సరపు ఉత్తమ గీతం పూకల్ పూక్కం తరుణం (మదరాస పట్టణం సినిమా)
  • 2011: ఆడుకాలం తమిళ సినిమాకు ఫిల్మ్ ఫేర్ దక్షిణాది ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం

మూలాలు

[మార్చు]
  1. "GV Prakash: వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్‌, సైంధవి దంపతులు | music-director-gv-prakash-and-his-wife-saindhavai-announced-their-divorce". web.archive.org. 2024-05-14. Archived from the original on 2024-05-14. Retrieved 2024-05-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "GV Prakash to marry singer Saindhavi". www.filmibeat.com. Archived from the original on 2013-12-20. Retrieved 2016-11-11.
  3. Andhra Jyothy (15 July 2023). "సరిహద్దులు చెరిపేస్తున్న సరిగమపదనిసలు". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
  4. "Reihana Interview". Behindwoods. Retrieved 13 May 2013.
  5. "'చికుబుకు రైలే' పాటతో ఐదేళ్లకే సెలబ్రిటీనైపోయా! - Sunday Magazine". www.eenadu.net. Archived from the original on 2020-12-08. Retrieved 2020-12-08.
  6. "GV Prakash-Saindhavi wedding on June 27!". Sify. 17 April 2013. Archived from the original on 19 April 2013. Retrieved 18 April 2013.
  7. Chitrajyothy (15 May 2024). "విడిపోవడమే మా ఇద్దరికీ మంచిది | Separation is better for both of us". Archived from the original on 15 May 2024. Retrieved 15 May 2024.
  8. "A passion for music". Chennai, India: The Hindu. 28 January 2008. Archived from the original on 29 జనవరి 2008. Retrieved 4 January 2010.
  9. "GV Prakash Kumar turns producer". Indian Express. 6 February 2013. Archived from the original on 18 జూన్ 2016. Retrieved 15 February 2013.
  10. "G V Prakash turns producer". Times of India. 23 January 2013. Archived from the original on 25 డిసెంబరు 2013. Retrieved 15 February 2013.
  11. Sudhir Srinivasan. "On a different note". The Hindu.