శైవం (సినిమా)
శైవం అనేది 2014లో విడుదలైన భారతీయ తమిళ భాషా డ్రామా సినిమా, ఈ సినిమాకు ఎ. ఎల్. విజయ్ దర్శకత్వం నిర్మాణం రచనను అందించారు. ఈ సినిమాలో నాజర్ ప్రధాన పాత్రలో నటించాడు, బాల నటి సారా అర్జున్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది . ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని నీరవ్ షా అందించాడు., జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా 2014 జూన్ 27న విడుదలై, సానుకూల స్పందన పొందింది. ఈ సినిమా తెలుగులో దాగుడుమూత దండాకోర్ (2015)గా రీమేక్ అయింది. మూల సినిమాలో ఉన్న సారా అర్జున్, ఇందులోనూ తన పాత్రను తిరిగి పోషించింది.[1]
కథ
[మార్చు]కథిరేసన్ నాదర్ కుటుంబానికి పెద్ద. ఈయనకి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె.[2] వీరందరూ సెలవుల సమయంలో ఇంట్లోనే కలుస్తారు. ఒక రోజున కుటుంబం మొత్తం ఆలయానికి వెళ్ళినప్పుడు, కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతాయి. కోడిని బలి ఇచ్చే ఆచారాన్ని మర్చిపోవడం దానికి కారణమని ఈ కుటుంబం భావిస్తుంది. ఇంట్లోనూ, పనిలోనూ ఎదురౌతున్న సమస్యలకు కోడిని బలి ఇవ్వకపోవడమే కారణమని ప్రతి కుటుంబ సభ్యుడూ నమ్ముతాడు. అందుకని రాబోయే పండుగలో కథిరేసన్ తన పెంపుడు కోడి అయిన పాప్పాను బలి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఈ బలి తర్వాత వారి సమస్యలన్నీ మాయమవుతాయని కుటుంబం అంతా అభిప్రాయపడుతుంది. కానీ ఇంతలోనే వారి పెంపుడు కోడి పాప్పా కనిపించకుండా పోతుంది.[3]
పాప్పా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురై దాని కోసం వెతకడం ప్రారంభిస్తారు. కథిరేసన్ మనవరాలు తమిళ్‌సెల్వి పాప్పాను చంపకుండా కాపాడటానికి దాన్ని అటకపై దాచిపెట్టిందని తెలుస్తుంది. ఆమె పాప్పాను ఎంతగానో ప్రేమిస్తోంది కాబట్టి దానిని బలి ఇవ్వకుండా కాపాడుతుంది. మిగిలిన కథ పాప్పాను చంపకుండా కాపాడటానికి తమిళ్‌సెల్వి చేసే ప్రయత్నాలు, కోడిని పట్టుకుని బలి ఇచ్చే ఆచారాన్ని పూర్తి చెయ్యడానికి కుటుంబం చేసే ప్రయత్నాల చుట్టూ తిరుగుతుంది.[4][5]
చివరికి ఆమె పాప్పాను చంపవద్దని అందరినీ ఒప్పిస్తుంది. ఎందుకంటే దేవుడు అన్ని జాతుల్ని ఒకేలా చూస్తాడని, ఒకరికొకరు హాని చేసుకోకూడదు అని చెబుతుంది. చివరికి, అందరూ సత్యాన్ని గ్రహించి, ఏ జాతికి హాని చెయ్యమని శాకాహారులుగా మారుతారు.
తారాగణం
[మార్చు]- కథిరేసన్ గా నాజర్
- తమిళ్ సెల్విగా సారా అర్జున్
- సెంథిల్‌గా లుత్‌ఫుదీన్ బాషా
- అభిరామిగా త్వారా దేశాయ్
- మెయ్యప్పన్‌గా సురేష్
- షణ్ముగరాజన్ గా కె.ఎస్. స్వామిగల్
- విద్యా ప్రదీప్ తేన్‌మొళిగా, తమిళ్ తల్లి
- రాజాగా జార్జ్ మేరియన్
- ధనలక్ష్మిగా రాజ్యలక్ష్మి
- శరవణన్‌గా రే పాల్
- గణేశన్‌గా లక్ష్మణన్ గణేష్
- కుమారన్‌గా శక్తి
- ఉషగా కెఎస్ సుచిత్రా శెట్టి
- విశాలాక్షిగా కౌశల్య
- మీనాక్షిగా కల్యాణి నటరాజన్
- రామనాథన్‌గా విట్టల్
- బాలమురుగన్‌గా రవి
- కార్తీక్‌గా మాస్టర్ రాహిల్ సింఘీ
- కాలాగా కాలా
- కామచ్చిగా సావిత్రి
- సేవకురాలిగా మాలతి
మూలాలు
[మార్చు]- ↑ "Arya - AL Vijay New Flick Titled as Saivam ?". Kollywoodtoday.net. ఒరిజినల్ నుండి 6 January 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-02-06.
- ↑ "Director Vijay's Saivam has 10 more days' of shooting left". Behindwoods.com. 2013-12-05. ఒరిజినల్ నుండి 4 February 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-02-06.
- ↑ "Director Vijay's Saivam has 10 more days' of shooting left". Behindwoods.com. 2013-12-05. ఒరిజినల్ నుండి 4 February 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-02-06.
- ↑ "A L Vijay wants to instill Family Traditions with his Tamil Film Saivam". IANS. news.biharprabha.com. ఒరిజినల్ నుండి 17 March 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-03-07.
- ↑ "Back to the roots - The Hindu". The Hindu. thehindu.com. 8 March 2014. ఒరిజినల్ నుండి 8 March 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-07-20.