Jump to content

సారా అర్జున్

వికీపీడియా నుండి
సారా అర్జున్
జననం2005/2006 (age 18–19)
ఇతర పేర్లుబేబి సారా
విద్యలోఖండ్‌వాలా ఫౌండేషన్ స్కూల్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
తల్లిదండ్రులు

సారా అర్జున్ (ఆంగ్లం: Sara Arjun) భారతీయ నటి, ఆమె ప్రధానంగా తమిళం, హిందీ సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలలో నటిస్తుంది. విక్రమ్ నటించిన తమిళ చిత్రం థైవ తిరుమల్ తో ఆమె బాలతారగా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది[1]. ఆమె తమిళం, హిందీలతో పాటు తెలుగు, మలయాళం చిత్రాలలోనూ బాలనటిగా అనేక సినిమాలు చేసింది[2]. 2015లో దాగుడుమూత దండాకోర్ సినిమాలో రాజేంద్రప్రసాద్ మనవరాలిగా పాత్ర పోషించింది.

బాల్యం

[మార్చు]

సారా అర్జున్ 2005 జూన్ 18న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించినది. సారా తండ్రి రాజ్ అర్జున్. ఆయన రౌడీ రాథోడ్ సహా పలు హిందీ భాషా చిత్రాల్లో, సీరియల్స్, వెబ్ సిరీస్ లలో నటించాడు. తల్లి సన్యా డ్యాన్స్ టీచర్. వారు మొదట భోపాల్ లో నివసించారు[3], ఆ తరువాత, వారి కుటుంబం 2000 నుండి ముంబైకి మారింది.

ఆమె తమ్ముడు సుహాన్ 2016లో విడుదలైన డిన్నర్ అనే లఘు చిత్రంలో నటించాడు.[4]

నటనా జీవితం

[మార్చు]

సారా అర్జున్ తన తల్లిదండ్రులతో కలిసి ఒక మాల్ లో ఒక వాణిజ్య ప్రకటనల సంస్థకు కనిపించిన తరువాత తన మొదటి వాణిజ్య ప్రకటన కోసం షూట్ చేసినప్పుడు ఆమె వయస్సు ఏడాదిన్నర, తరువాత, ఆమె మెక్ డొనాల్డ్స్ తో సహా పలు బ్రాండ్ల కోసం దాదాపుగా వంద యాడ్ ఫిల్మ్ లలో కనిపించింది. థైవ తిరుమల్ (తెలుగులో నాన్న ) చలనచిత్రం లో సారా అర్జున్ నటనకు మంచి ఆదరణ లభించింది. ఇప్పటి వరకు 15 చిత్రాలకు పైగా నటించిన ఆమె పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నందిని యువతిగా ఉన్న పాత్ర పోషించి సానుకూల సమీక్షలను అందుకుంది[5].

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు
2011 404 సారా హిందీ
దైవ తిరుమగల్ నీల కృష్ణ తమిళం
2013 ఏక్ థీ దాయన్ మిషా మాథుర్ హిందీ
చితిరయిల్ నిలచోరు ఓవియా తమిళం
2014 జై హో పాఠశాల విద్యార్థిని హిందీ
శైవం తమిళ్ సెల్వి తమిళం
2015 దాగుడుమూత దండాకోర్ బంగారం తెలుగు శైవం రీమేక్
జజ్బా సనయ వర్మ హిందీ
2016 ఆన్ మరియా కలిప్పిలాను ఆన్ మరియా మలయాళం
2017 ది సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్ ఆయేషా హిందీ
విజితిరు చారు తమిళం
2019 ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా యంగ్ స్వీటీ చౌదరి హిందీ
సాంద్ కీ ఆంఖ్ షెఫాలీ తోమర్ హిందీ
సిల్లు కారుపట్టి మిటీ తమిళం
2021 అజీబ్ దాస్తాన్స్ సమైరా హిందీ
2022 టూల్‌సిదాస్ జూనియర్ పియా హిందీ
పొన్నియిన్ సెల్వన్: ఐ యువతి నందిని తమిళం
2023 పొన్నియిన్ సెల్వన్: II తమిళం
2024 కొటేషన్ గ్యాంగ్ ఇరా తమిళం

గుర్తింపు

[మార్చు]
సంవత్సరం పురస్కారం విభాగం ఫలితం మూలాలు
2011 విజయ్ స్పెషల్ జ్యూరీ అవార్డు ఉత్తమ బాలనటి (స్పెషల్ జ్యూరీ మెన్సన్) విజేత [6]
2013 సైమా అవార్డ్ ఫర్ బెస్ట్ తమిళ చైల్డ్ ఆర్టిస్ట్‌ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నామినేట్ చేయబడింది [7]
2014 విజయ్ అవార్డ్ ఫర్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ విజేత [8]
2016 19వ ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నామినేట్ చేయబడింది [9]

మూలాలు

[మార్చు]
  1. "ఆరేళ్లకే తన నటనతో ఏడిపించి.. ఇప్పుడు నందినిగా మెప్పించి... ఎవరీ సారా అర్జున్?". EENADU. Retrieved 2023-05-02.
  2. Telugu, 10TV (2023-05-01). "Sara Arjun : PS2 లో జూనియర్ ఐశ్వర్యరాయ్ గా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? మీకు బాగా తెలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంత పెద్దదైపోయిందో." 10TV Telugu. Retrieved 2023-05-02.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Sara Arjun (Child Actor) Age, Family, Biography & More » StarsUnfolded". starsunfolded.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2023-05-02.
  4. A, Deepa (2016-11-14). "This Boy's Mom Called Him For Dinner! What Happens Next Will Give You A Sleepless Night!". RVCJ (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-26.
  5. http://www.tupaki.com. "Telugu News, Telugu Cinema News, Andhra News, Telangana News, Political News". tupaki. Retrieved 2023-05-02. {{cite web}}: External link in |last= (help)
  6. "News, Breaking News, Latest News, News Headlines, Live News, Today News CNN-News18". News18 (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 11 August 2015. Retrieved 30 June 2021.
  7. "Index of /". siima.in. Archived from the original on 17 June 2021. Retrieved 30 June 2021.
  8. "Vijay Awards 2015 - Complete list of winners". 6 May 2015. Archived from the original on 6 May 2015. Retrieved 30 June 2021.
  9. "Asianet Film Awards". asianetfilmawards.com. Archived from the original on 10 March 2016. Retrieved 30 June 2021.