Jump to content

జపాన్ (2023 సినిమా)

వికీపీడియా నుండి
జపాన్
దర్శకత్వంరాజు మురుగన్
రచనరాజు మురుగన్
నిర్మాతఎస్‌.ఆర్ ప్రభు
తారాగణంకార్తీ
అను ఇమ్మాన్యుయేల్
ఛాయాగ్రహణంరవి వర్మన్
కూర్పుఫిలోమిన్ రాజ్
సంగీతంజి. వీ. ప్రకాష్ కుమార్
నిర్మాణ
సంస్థ
డ్రీమ్ వారియర్ పిక్చర్స్
విడుదల తేదీs
10 నవంబరు 2023 (2023-11-10)(థియేటర్)
11 డిసెంబరు 2023 (2023-12-11)( నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో )
దేశంభారతదేశం
భాషతెలుగు

జపాన్‌ 2023లో విడుదలకానున్న తెలుగు సినిమా. డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాశ్‌ బాబు, ఎస్‌ ప్రభు నిర్మించిన ఈ సినిమాకు రాజు మురుగన్‌ దర్శకత్వం వహించాడు. కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్‌ మిల్టన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ దక్కించుకుంది.[1] జపాన్  టీజర్‌ను అక్టోబర్ 18న విడుదల చేసి[2], సినిమాను దీపావళి సందర్బంగా తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో నవంబర్ 10న విడుదలై, డిసెంబర్ 11 నుండి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]

నటీనటులు

[మార్చు]

సిటీ సెంటర్‌లో ఒక పెద్ద జ్యువెల్లరీ షాప్ లో 200 కోట్ల నగలు దొంగతనం జరగడంతో పోలీసులు రంగంలోకి దిగగా జపాన్(కార్తీ) కి చెందిన ఆనవాళ్లు దొరకడంతో ఈ దొంగతనం జపాన్ చేసాడని అనుకోని అతని గురించి వెతుకులాట మొదలుపెడతారు. జపాన్ అంతకుముందు దొంగతనం చేసిన బంగారంతో ఎంజాయ్ చేస్తూ, ఇతరులకు సాయం చేస్తూ హ్యాపీగా గడుపుతూ తాను ప్రేమించిన అమ్మాయి(అను ఇమ్మాన్యుయేల్) కోసం వెళ్తే ఆ సమయానికి జపాన్ ని పోలీసులు పట్టుకోవడంతో జపాన్ దొంగతనం చేయలేదని తెలుస్తుంది. అసలు దొంగతనం చేసింది ఎవరు? జపాన్ దొంగగా ఎందుకు మారాడు? ఆ తర్వాత ఏమైంది ? అనేదే మిగతా సినిమా కథ.[4]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్
  • నిర్మాత: ఎస్‌ఆర్ ప్రకాశ్‌ బాబు, ఎస్‌ ప్రభు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజు మురుగన్‌[5]
  • సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్‌
  • సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
  • ఫైట్స్: అన్బరివ్‌
  • ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
  • ఫైట్స్: అనిల్ అరసు
  • పాటలు: భాస్కరభట్ల
  • మాటలు: రాకేందు మౌళి వెన్నెలకంటి

మూలాలు

[మార్చు]
  1. Namaste Telangana, NT News (22 October 2023). "కార్తీ జపాన్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌". Archived from the original on 22 October 2023. Retrieved 22 October 2023.
  2. TV9 Telugu (18 October 2023). "కార్తీ 'జపాన్' టీజర్ రిలీజ్.. కామెడీ ఎంటర్టైన్మెంట్ పక్కా." Archived from the original on 22 October 2023. Retrieved 22 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. TV9 Telugu (5 December 2023). "ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కార్తీ 'జపాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే." Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (10 November 2023). "'జపాన్‌' మూవీ రివ్యూ". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  5. Namaste Telangana (9 November 2023). "కార్తీని మైండ్‌లో పెట్టుకొని కథ రాశా : జపాన్ డైరెక్టర్ రాజుమురుగన్‌ ఇంటర్వ్యూ". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.

బయటి లింకులు

[మార్చు]