అమరన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అమరన్‌ 2024లో విడుదలైన తెలుగు సినిమా. కాశ్మీర్ నేపథ్యంలో శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ఆర్మీ మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత సంఘటనలతో రాసిన ‘ఇండియాస్‌ మోస్ట్‌ ఫియర్‌లెస్‌ : ట్రూ స్టోరీస్‌ ఆఫ్‌ మోడరన్‌ మిలిటరీ’ పుస్తకం ఆధారంగా సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజ్‌ కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించాడు. శివ కార్తీకేయన్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 15న, ట్రైలర్‌ను న విడుదల చేసి, అక్టోబర్‌ 31న సినిమాను విడుదల చేశారు.[1]

తెలుగులో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి,  నిఖితా రెడ్డి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.[2]

నటీనటులు

[మార్చు]
  • శివ కార్తీకేయన్ - మేజర్ ముకుంద్ వరదరాజన్ "మ్యాడీ"[3]
  • సాయిపల్లవి - ఇందు రెబెక్కా వర్గీస్‌[4][5]
  • భువన్ అరోరా - సిపాయి విక్రమ్ సింగ్
  • రాహుల్ బోస్ - కల్నల్ అమిత్ సింగ్ దాబాస్, ముకుంద్ కమాండింగ్ ఆఫీసర్
  • లల్లూ - రవిశంకర్‌
  • శ్రీకుమార్ - మైఖేల్‌
  • శ్యామ్ మోహన్ - ఇందు సోదరుడిగా
  • అజయ్ నాగ రామన్
  • మీర్ సల్మాన్
  • గౌరవ్ వెంకటేష్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజ్‌ కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్
  • నిర్మాత: ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్‌కుమార్‌ పెరియసామి
  • సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
  • సినిమాటోగ్రఫీ: సి.హెచ్. సాయి
  • ఎడిటర్:ఆర్. కలైవానన్
  • ఫైట్స్: అన్బరివ్ మాస్టర్స్‌, స్టీఫన్ రిక్టర్

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."హే రంగులే[6]"రామజోగయ్య శాస్త్రిఅనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా4:01

మూలాలు

[మార్చు]
  1. Chitrajyothy (18 September 2024). "శివకార్తికేయన్ 'అమరన్‌' రెడీ". Retrieved 12 October 2024.
  2. Chitrajyothy (24 October 2024). "వరదరాజన్‌ జీవిత నేపథ్యం".
  3. EENADU (17 September 2024). "మన ఆర్మీ కష్టం ముందు నా శ్రమ చాలా తక్కువ: శివ కార్తికేయన్". Retrieved 12 October 2024.
  4. ETV Bharat News (28 September 2024). "ఆ పాత్ర కోసం ఆయన భార్యను కలిశాను : 'అమరన్‌' సాయి పల్లవి". Retrieved 12 October 2024.
  5. "అమర జవాన్ భార్యగా సాయి పల్లవి - ఆకట్టుకుంటున్న 'అమరన్' బ్యూటీఫుల్ ఇంట్రో!". 27 September 2024. Retrieved 12 October 2024.
  6. NT News (7 October 2024). "అమరన్‌ నుంచి శివకార్తికేయన్-సాయిపల్లవి హే రంగులే లిరికల్‌ సాంగ్‌". Retrieved 12 October 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అమరన్&oldid=4352380" నుండి వెలికితీశారు