ఎమీ జాక్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎమీ జాక్సన్
Amy Jackson graces the Moet N Chandon bash at F bar 01.jpg
అమీ జాక్సన్ 'తాండవం' సంగీత విడుదల సమయంలో.
జననం ఎమీ లొయిస్ జాక్సన్
(1992-01-31) 1992 జనవరి 31 (వయస్సు: 26  సంవత్సరాలు)[1]
డౌగ్లస్ , ఐసల్ ఆఫ్ మ్యాన్
నివాసం చెన్నై, తమిళనాడు, భారత దేశం[2]
వృత్తి
  • నటి
  • ప్రచారకర్త
క్రియాశీలక సంవత్సరాలు 2008–ప్రస్తుతం
స్వస్థలం వూల్టన్, లివర్‌పూల్, ఇంగ్లాండు, యునైటెడ్ కింగ్‌డమ్
తల్లిదండ్రులు
  • అలెన్ జాక్సన్
  • మార్గరెటా జాక్సన్
వెబ్ సైటు www.iamamyjackson.co.uk

ఎమీ జాక్సన్ (జననం 31 జనవరి 1992)[3][4] బ్రిటన్ కు చెందిన భారతీయ మోడల్, నటి. ఆమె తమిళ,హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది.[5][6] ఆమె తన 16వ ఏటనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ గానూ, 2010లో మిల్ లివర్ పూల్ గానూ నిలిచింది ఎమీ. ఆ తరువాత తమిళ సినీ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ 2010లో తీసిన తమిళ చిత్రం మద్రాసపట్టిణంలో కథానాయిక పాత్రకు ఈమెను ఎంపిక చేశాడు. అలా ఎమీ లండన్ లో మోడల్ గా కెరీర్ కొనసాగిస్తున్న సమయంలోనే, భారత్ లో వివిధ భాషల్లోని సినిమాల్లో నటించడం ప్రారంభించింది. 2012లో  ఆమె నటించిన మొదటి బాలీవుడ్ సినిమా ఏక్ దీవానా థా విడుదలైంది.[7] అదే ఏడాది ఆమె మొదటి తెలుగు సినిమా ఎవడు (సినిమా) విడుదలైంది. ఆ తరువాత 2015లో ఎమీ ప్రభుదేవా దర్శకత్వంలో,అక్షయ్ కుమార్ నటించిన సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమాలో నటించింది.

తొలినాళ్ళ జీవితం, కెరీర్[మార్చు]

ఐరిష్ సముద్రం మధ్యలోని ఐస్లే ఆఫ్ మాన్ అనే ద్వీపంలో జన్మించింది ఎమీ. ఆమె తల్లిదండ్రులు బ్రిటీష్ క్రిస్టియన్స్. ఆమె తండ్రి అలన్ జక్సన్, తల్లి మార్గరీటా జాక్సన్. ఆమె అక్క అలిసియా జాక్సన్. ఎమీ జన్మించిన రెండేళ్ళకే వారి కుటుంబం లివర్ పూల్ లోని వూల్టన్ లో వారి స్వంత ఇంటికి మారిపోయింది. ఆమె తండ్రి బిబిసి రేడియో మెర్సిసిడ్ కు నిర్మాత. తన మీడియా కెరీర్ ను కొనసాగించేందుకే లివర్ పూల్ కు మకాం మార్చాల్సి వచ్చింది. సెయింట్ ఎడ్వర్డ్స్ కళాశాలలో చదువుకొంది ఎమీ. ఆ తరువాత ఆంగ్ల భాష, ఆంగ్ల సాహిత్యం, తత్త్వ శాస్త్రం, నీతి శాస్త్రం చదువుకునేందుకు ఆరవ ఫారంలో చేరింది ఎమీ.[8][9][10]


నటించిన చిత్రాలు[మార్చు]

సూచిక
Films that have not yet been released ఇంకా విడుదలైన సినిమాలను సూచిస్తుంది

చలన చిత్రాలు

సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2010 మదరాసపట్టినమ్ ఎమి విల్కిన్సన్ తమిళం తెలుగులో 1947 ఏ లవ్ స్టోరీగా అనువాదమైంది
2012 ఎక్ దీవానా థా జెసీ తెక్కుట్టు హిందీ
తాండవం సారా వినాయగమ్ తమిళం తెలుగులో శివ తాండవంగా అనువాదమైంది
2014 ఎవడు శ్రుతి తెలుగు
2015 ఐ మనోహరుడు దియా తమిళం తెలుగులో అదే పెరుతో అనువాదమైంది
సింగ్ ఈస్ బ్లింగ్ సారా రాణ హిందీ
తంగ మగన్ హేమా డిసౌజా తమిళం తెలుగులో నవ మన్మదుడుగా అనువాదమైంది
2016 గెత్తు నందిని రామానుజం తమిళం
తెఱి అన్నీ తమిళం తెలుగులో పొలిసోడుగా అనువాదమైంది
ఫ్రికీ అలి మేఘా హిందీ
దేవి జన్నిఫర్ తమిళం "చల్ మార్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
అభినేత్రి తెలుగు
తూతక్ తూతక్ తూతియా హిందీ
2018 2.0Films that have not yet been released ఇంకా ప్రకటించలేదు తమిళం

హిందీ

ది విలన్ ఇంకా ప్రకటించలేదు కన్నడ చిత్రీకరణ జరుగుతుంది
బూగి మ్యాన్ నిమిషా ఆంగ్లం

బుల్లితెర

సంవత్సరం ధారావాహిక పాత్ర ఇతర వివరాలు
2017- ప్రస్తుతం సూపర్ గర్ల్ ఇమ్రా అర్దీన్ [11]

మూలాలు[మార్చు]