Jump to content

నైనికా విద్యాసాగర్

వికీపీడియా నుండి

బేబీ నైనికా అని పిలువబడే నైనికా విద్యాసాగర్ (ఆంగ్లం: Nainika Vidyasagar) బాలనటి, ఫ్యాషన్ మోడల్. ఆమె ప్రధానంగా మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమల్లో, వెబ్ సిరీస్, టీవీ షోలలో చేసిన పనికి ప్రసిద్ధి చెందింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన తేరి సినిమాలో విజయ్ కూతురిగా నటించి ఫేమస్ అయింది. నైనిక విద్యాసాగర్ తొలి సినిమాతోనే తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. ఇదే చిత్రం తెలుగులో పోలీస్, ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది నైనిక విద్యాసాగర్. నటి మీనా ఏకైక కుమార్తె నైనిక.[1]

కెరీర్

[మార్చు]

తమిళనాడులోని చెన్నైలో 2011 జనవరి 1న నైనికా విద్యాసాగర్ జన్మించింది. తల్లి ప్రముఖ నటి మీనా కాగా తండ్రి విద్యాసాగర్ ఒక బహుళజాతి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌. నైనికా విద్యాసాగర్ తన తల్లి నటనను స్పూర్తిగా తీసుకొని 6 సంవత్సరాల వయస్సులోనే 2016లో జోసెఫ్ విజయ్, సమంతా నటించిన ‘తేరి’ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె మొదటి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ఆమె పోలీసోడు (2018), పోలీస్ (2018), భాస్కర్ ఒరు రాస్కల్ (2018), లైవ్ టెలికాస్ట్ (2021) మొదలైన అనేక ఇతర పెద్ద ప్రాజెక్ట్‌లలో కూడా పని చేసింది. ఆమె తన అద్భుతమైన నటనకు అనేక అవార్డులను గెలుచుకుంది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ పురష్కారం అందుకుంది.

మూలాలు

[మార్చు]
  1. "Watch Beautiful Photos Of Actress Meena and her Daughter Trending on Social Media - Sakshi". web.archive.org. 2022-06-28. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)