అసలు ఏం జరిగిందంటే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అసలు ఏం జరిగిందంటే
Asalu-Em-Jarigindante.jpg
దర్శకత్వంశ్రీనివాస్ బండారి
నిర్మాతఅనిల్ బొద్దిరెడ్డి
తారాగణంధృవ
వెన్బా
ఛాయాగ్రహణంకర్ణ ప్యారసాని
కూర్పుజె.ప్రతాప్ కుమార్
సంగీతంచరణ్ అర్జున్
నిర్మాణ
సంస్థ
జిఎస్‌ ఫిలిమ్స్‌
విడుదల తేదీ
2021 అక్టోబరు 1 (2021-10-01)
దేశం భారతదేశం
భాషతెలుగు

అసలు ఏం జరిగిందంటే 2021లో తెలుగులో విడుదల కానున్న క్రైౖమ్‌ థ్రిల్లర్‌ సినిమా.[1] ఏ.బి.ఆర్.ప్రొడక్షన్స్ సమర్పణలో జిఎస్‌ ఫిలిమ్స్‌ బ్యానర్ పై అనిల్ బొద్దిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ బండారి దర్శకత్వం వహించాడు. మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రిన్‌, హరితేజ, షఫీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్‌ 1న విడుదలైంది.[2]

కథ[మార్చు]

వాసు(మహేంద్రన్), సావిత్రి(కారుణ్య చౌదరి)కి చిన్నపాటి నుండి ఒకరైఒకరంటే ఇష్టం. ఇది నచ్చని సావిత్రి తరుపు బంధువు(షపీ) వీరిపై లేనిపోని నిందలు వేసి ఇద్దరు విడిపోయేలా చేస్తాడు. వాసు ఊరు ఒదిలి వెళ్లి హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ ఒకరోజు సావిత్రిని అనుకోకుండా కలిసి పెద్దవారిని ఒప్పించి పెళ్లికి చేసుకుందామని సిద్ధం అవ్వగా అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ ప్రమాదంలో సావిత్రి చనిపోతుంది, వాసు గతం మరిచిపోతాడు. ఈ క్రమంలో వాసు లైఫ్‌లోకి సావిక (శ్రీపల్లవి) వస్తుంది, యాక్సిడెంట్ తర్వాత అసలు ఏం జరిగింది? చివరికి వాసు, సావిల ప్రేమకథ ఏమైంది ? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు[మార్చు]

 • మహేంద్రన్
 • శ్రీ పల్లవి
 • కారుణ్య చౌదరి
 • కరోణ్య కత్రిన్
 • హరితేజ
 • షఫీ
 • కుమనన్ సేతురామన్
 • షాని సాల్మన్
 • జబర్దస్త్ ఫణి దొరబాబు

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్:జిఎస్‌ ఫిలిమ్స్‌
 • నిర్మాత: అనిల్ బొద్దిరెడ్డి
 • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: శ్రీనివాస్ బండారి
 • సంగీతం: చరణ్ అర్జున్
 • సినిమాటోగ్రఫీ: కర్ణ ప్యారసాని
 • ఎడిటింగ్: జె.ప్రతాప్ కుమార్
 • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: షానీ సాల్మన్‌
 • సహ నిర్మాతలు: మల్లేశం.వి, సుజాత.ఎం, రాజేష్‌.బి

మూలాలు[మార్చు]

 1. Sakshi (7 March 2020). "అసలేం జరిగింది?". Archived from the original on 28 September 2021. Retrieved 28 September 2021.
 2. Sakshi (24 September 2021). "అక్టోబర్‌ 1న 'అసలేం జరిగిందంటే..?'". Archived from the original on 28 September 2021. Retrieved 28 September 2021.
 3. Andrajyothy (2 October 2021). "'అసలు ఏం జరిగిందంటే..' మూవీ రివ్యూ". Archived from the original on 14 అక్టోబర్ 2021. Retrieved 14 October 2021. Check date values in: |archivedate= (help)

బయటి లింకులు[మార్చు]