అభినందన (సినిమా)

వికీపీడియా నుండి
(అభినందన నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అభినందన
(1988 తెలుగు సినిమా)
ABHINANDANA.jpg
దర్శకత్వం అశోక్ కుమార్
తారాగణం కార్తిక్,
శోభన,
రాజ్యలక్ష్మి
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఛాయాగ్రహణం అశోక్ కుమార్
నిర్మాణ సంస్థ లలితశ్రీ కంబైన్స్
భాష తెలుగు

అభినందన 1988 లో అశోక్ కుమార్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథా చిత్రం. కార్తీక్, శోభన ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి.

కథ[మార్చు]

రాణి ఒక మంచి నర్తకి కావాలనుకుంటూ ఉంటుంది. తండ్రితో కలిసి కొడైకెనాల్ లో నివసిస్తూ ఉంటుంది. రాజా మంచి చిత్రకారుడు, గాయకుడు కావాలనుకుంటూ ఉంటాడు. ఇద్దరూ ఒక సంస్థలో కలుసుకుంటారు. అభిరుచులు కలవడంతో ఒకరినొకరు ఇష్టపడతారు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  • మంచు కురిసే వేళలో
  • చుక్కలాంటి అమ్మాయి
  • ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం (రచన - ఆచార్య ఆత్రేయ) [1]
  • ఎదుట నీవే.. యెదలోనా నీవే...[2]
  • ప్రేమ లేదని ప్రేమించరాదని [3]
  • అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

సంగీతం[మార్చు]

ఇప్పటికీ సాహిత్య అభిమానులు ,సంగీత ప్రియులకు వీనుల విందు భోజనం ఈ పాటలు.విరహ ప్రేమ ఊసులు మానలేని మత్తులో ఉన్న వారు చాలా మంది యువకులు తమ అభిమాన పాటలు అభినందన లోనే ఉంటాయి అని చెప్తారు.

అన్ని పాటల రచయిత ఆత్రేయ[4], ఈ చిత్రం లోని అన్ని పాటలు స్వరపరిచి సంగీతం అందించింది ఇళయరాజా.

క్రమసంఖ్య పేరుగానం నిడివి
1. "అదే నీవు అదే నేను అదే గీతం పాడనా"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం  
2. "ఎదుట నీవే ఎదలోన నీవే[2]"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం  
3. "చుక్కల్లాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి "  ఎస్. జానకి  
4. "చుక్కల్లాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి " (దుఃఖం)ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం  
5. "ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠిణం[1]"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం  
6. "ప్రేమ లేదని ప్రేమించరాదని[3]"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం  
7. "మంచు కురిసే వేళలో మల్లె విరిసే దెందుకొ "  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి  
8. " రంగులలో కలవో ఎదపొంగులలొ కలవో"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి  


అవార్డులు[మార్చు]

సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1987 కె. అశోక్ కుమార్ నంది ఉత్తమ చిత్రాలు - రజత (వెండి) నంది విజేత
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
("రంగులలో కలవో" గానమునకు)
నంది బహుమతి - ఉత్తమ గాయకుడు విజేత
కార్తిక్ ముతురామన్ నంది ప్రత్యేక బహుమతి విజేత
ఫిలింఫేర్ బహుమతి - ఉత్తమ నటుడు విజేత

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 [1]
  2. 2.0 2.1 [2]
  3. 3.0 3.1 [3]
  4. "అభినందన పాటలు". Archived from the original on 2013-12-16. Retrieved 2013-12-21.