అభినందన (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అభినందన
దర్శకత్వంఅశోక్ కుమార్ (సినిమాటోగ్రాఫర్)
నిర్మాతఆర్. వి. రమణ మూర్తి
తారాగణంకార్తిక్,
శోభన,
రాజ్యలక్ష్మి
ఛాయాగ్రహణంఅశోక్ కుమార్
కూర్పుబి. లెనిన్, వి. టి. విజయన్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
దేశంభారతదేశం
భాషతెలుగు

అభినందన 1988 లో అశోక్ కుమార్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథా చిత్రం. కార్తీక్, శోభన ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం రెండో ఉత్తమ చిత్రంతో సహా మూడు నంది పురస్కారాలు అందుకుంది.[1][2] ఈ సినిమా కాదల్ గీతం అనే పేరుతో తమిళంలోకి, అభినందనే అనే పేరుతో కన్నడంలోకి అనువాదమైంది. 2005 లో హిందీలో వచ్చిన బేవాఫా చిత్రానికి ఈ కథే ఆధారం. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి.

రాణి ఒక మంచి నర్తకి కావాలనుకుంటూ ఉంటుంది. తండ్రితో కలిసి కొడైకెనాల్ లో నివసిస్తూ ఉంటుంది. రాజా మంచి చిత్రకారుడు, గాయకుడు కావాలనుకుంటూ ఉంటాడు. ఇద్దరూ ఒక సంస్థలో కలుసుకుంటారు. అభిరుచులు కలవడంతో ఒకరినొకరు ఇష్టపడతారు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • మంచు కురిసే వేళలో
  • చుక్కలాంటి అమ్మాయి
  • ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం (రచన - ఆచార్య ఆత్రేయ) [3]
  • ఎదుట నీవే.. యెదలోనా నీవే...[4]
  • ప్రేమ లేదని ప్రేమించరాదని [5]
  • అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

సంగీతం

[మార్చు]

ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి పాటలు పాడారు. అన్ని పాటలు ఆచార్య ఆత్రేయ రాశాడు.

అన్ని పాటల రచయిత ఆత్రేయ[6], ఈ చిత్రం లోని అన్ని పాటలు స్వరపరిచి సంగీతం అందించింది ఇళయరాజా.

క్రమసంఖ్య పేరుగానం నిడివి
1. "అదే నీవు అదే నేను అదే గీతం పాడనా"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం  
2. "ఎదుట నీవే ఎదలోన నీవే[4]"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం  
3. "చుక్కల్లాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి "  ఎస్. జానకి  
4. "చుక్కల్లాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి " (దుఃఖం)ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం  
5. "ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠిణం[3]"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం  
6. "ప్రేమ లేదని ప్రేమించరాదని[5]"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం  
7. "మంచు కురిసే వేళలో మల్లె విరిసే దెందుకొ "  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి  
8. " రంగులలో కలవో ఎదపొంగులలొ కలవో"  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి  

అవార్డులు

[మార్చు]
సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1987 కె. అశోక్ కుమార్ నంది ఉత్తమ చిత్రాలు - రజత (వెండి) నంది గెలుపు
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
("రంగులలో కలవో" గానమునకు)
నంది బహుమతి - ఉత్తమ గాయకుడు గెలుపు
కార్తిక్ ముత్తురామన్ నంది ప్రత్యేక బహుమతి గెలుపు
ఫిలింఫేర్ బహుమతి - ఉత్తమ నటుడు గెలుపు

మూలాలు

[మార్చు]
  1. "Tomorrow's star". The Hindu.
  2. "Archived copy". Archived from the original on 16 December 2013. Retrieved 2012-12-19.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. 3.0 3.1 [1]
  4. 4.0 4.1 [2]
  5. 5.0 5.1 [3]
  6. "అభినందన పాటలు". Archived from the original on 2013-12-16. Retrieved 2013-12-21.