హరే రామ్
హరే రామ్ (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | హర్షవర్ధన్ |
---|---|
నిర్మాణం | కళ్యాణ్ రామ్ |
కథ | గౌరీ శంకర్ |
తారాగణం | కళ్యాణ్ రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, చలపతిరావు, చంద్రమోహన్, రాజీవ్ కనకాల |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
ఛాయాగ్రహణం | సి. రాంప్రసాద్ |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | యన్.టి.ఆర్. ఆర్ట్స్ |
విడుదల తేదీ | 18 జూలై 2008 |
నిడివి | 157 నిముషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
హరే రామ్ 2008, జూలై 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎన్.టి.ఆర్. ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మాణ సారథ్యంలో హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, తమ్మారెడ్డి చలపతిరావు, చంద్రమోహన్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించగా, మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు. ఇందులో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేశాడు.[1]
ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది.[2] 2011 లో, దీనిని హిందీ భాషలోకి జుల్మో కా తాండవ్ పేరుతో అనువాదం చేశారు. తరువాత తన 2013 యాక్షన్ థ్రిల్లర్ ఓం 3 డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కల్యాణ్ రామ్ హరే రామ్ ను ఫ్లైక్యామ్ ను ఉపయోగించిన మొట్టమొదటి తెలుగు భాషా చిత్రం అని తెలిపాడు.[3]
కథా నేపథ్యం
[మార్చు]ఈ చిత్రం హరి,రామ్ అనే కవలల నేపథ్యంలో ఉంటుంది. పుట్టుకతో విడిపోయిన కవలలులో హరి నిజాయితీగల పోలీసుగా ఎదగగా, రామ్ మానసికంగా హింసాత్మకంగా తయారవుతాడు. తన సోదరుడితో సహా అతని కంటే తెలివిగల వారిని చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. రామ్ హత్యలు చేయడం ప్రారంభించినప్పుడు, హరి బాధ్యతలు స్వీకరించి 24 గంటలలోపు అతన్ని అరెస్టు చేయాలని, చేయకపోతే 25వ గంటలో ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటాడు.
నటవర్గం
[మార్చు]- కళ్యాణ్ రామ్ (ఏసిపి హరికృష్ణ/రామ్)
- ప్రియమణి (అంజలి)
- సింధు తులానీ (శ్రావణి)
- కోట శ్రీనివాసరావు (ఆరోగ్యశాఖ మంత్రి జి. శివారెడ్డి)
- రాజీవ్ కనకాల (డా. జికె రెడ్డి)
- చంద్రమోహన్ (హరి, రామ్ తండ్రి)
- సీత (హరి, రామ్ తల్లి)
- సుధ (హరి అత్త)
- తమ్మారెడ్డి చలపతిరావు (హరి మామ)
- అశోక్ కుమార్ (రాజీవ్ అన్న)
- ఆలీ (బ్యాంక్ మేనేజర్)
- బ్రహ్మానందం (నిజం-టాక్సీడ్రైవర్)
- రఘుబాబు (పోలీస్ ఆఫీసర్)
- వేణుమాధవ్ (కార్ల దొంగ)
- లక్ష్మీపతి (శివారెడ్డి అసిస్టెంట్)
- రఘు కారుమంచి (రఘు)
- రంగనాథ్ (డా. నాయుడు)
- ఫిష్ వెంకట్
- శంకర్ మెల్కోటే (మెల్కోటే)
- ప్రభాకర్ పొడకండ్ల (రాజీవ్)
- అపూర్వ (భాగ్యం)
- వైజాగ్ ప్రసాద్ (డిజిపి రవీంద్రనాథ్)
- అంబటి శ్రీనివాస్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: హర్షవర్ధన్
- నిర్మాణం: కళ్యాణ్ రామ్
- కథ: గౌరీ శంకర్
- సంగీతం: మిక్కీ జె. మేయర్
- ఛాయాగ్రహణం: సి. రాంప్రసాద్
- కూర్పు: గౌతంరాజు
- నిర్మాణ సంస్థ: ఎన్.టి.ఆర్. ఆర్ట్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి మిక్కి జె. మేయర్ సంగీతం అందించాడు. అన్ని పాటలను సిరివెన్నెల రాశాడు.
Untitled | |
---|---|
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "నష" | సునీత సారధి, రంజిత్ | 4:09 | ||||||
2. | "సరిగ పదని" | కార్తీక్ | 5:06 | ||||||
3. | "యఖుదా జర దేఖో నా" | హరీష్ రాఘవేంద్ర, కళ్యాణి నాయర్ | 4:46 | ||||||
4. | "జైరామ్ జైరామ్" | మిక్కి జె. మేయర్ | 3:37 | ||||||
5. | "లాలిజో" | కార్తీక్, హరిణి | 4:41 | ||||||
6. | "హరే రామ్ థీమ్ మ్యూజిక్" (వాయిద్యం) | బాలాజీ, వాసు, శ్రీనివాస్ | 2:48 | ||||||
25:07 |
మూలాలు
[మార్చు]- ↑ "'Hare Ram' audio release on June 28". Indiaglitz. 24 June 2008.
- ↑ "Happy Birthday Nandamuri Kalyan Ram: The ups and downs in the Athanokkade star's career". In.com. Archived from the original on 2019-08-02. Retrieved 2020-09-09.
- ↑ Idlebrain (2013-07-13). "Kalyan Ram interview about Om 3D". Idlebrain. Idlebrain.com. Archived from the original on 2020-03-01. Retrieved 2020-09-09.
Fly Cam was first used in Telugu for Hareram film.
ఇతర లంకెలు
[మార్చు]- 2008 తెలుగు సినిమాలు
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలు
- ప్రియమణి నటించిన సినిమాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- రాజీవ్ కనకాల నటించిన సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- చలపతి రావు నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- రఘుబాబు నటించిన సినిమాలు
- వేణుమాధవ్ నటించిన సినిమాలు
- సుధ నటించిన సినిమాలు