పట్నం వచ్చిన పతివ్రతలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్నం వచ్చిన పతివ్రతలు
Patnam Vachina Pativratalu.jpg
దర్శకత్వంమౌళి
రచనజంధ్యాల, కాశీ విశ్వనాథ్ (సంభాషణలు)
నిర్మాతఅట్లూరి రాధాకృష్ణ మూర్తి, కొమ్మన నారాయణ రావు
నటవర్గంచిరంజీవి,
మోహన్ బాబు ,
రాధిక,
గీత
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
1982
భాషతెలుగు

పట్నం వచ్చిన పతివ్రతలు 1982 లో మౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా. చిరంజీవి, మోహన్ బాబు, రాధిక, గీత ఇందులో ప్రధాన పాత్రధారులు. ఇది అట్లూరి రాధాకృష్ణమూర్తి నిర్మాణ సారథ్యంలో శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైంది. చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు. ఈ సినిమా పట్టణక్కె బంద పత్నియరు అనే కన్నడ సినిమాకు పునర్నిర్మాణం.[1]

కథ[మార్చు]

చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయిన మనవళ్ళిద్దరికీ పెంచి పెద్దచేసి పెళ్ళిళ్ళు చేస్తుంది నారాయణమ్మ. ఆమె పెద్ద మనవడు చదువు లేని వాడు. అతనికి చదువుకున్న దేవి అనే అమ్మాయితో పెళ్ళి చేస్తుంది. అగ్రికల్చరల్ బిఎస్సీ చదివిన రెండో మనవడికి పల్లెటూరు అమ్మాయి లలితాంబనిచ్చి పెళ్ళి చేస్తుంది. ఇద్దరూ కలిసి పట్నానికి కాపురం మార్చేద్దామని భర్తల్ని సతాయిస్తుంటారు. కానీ వాళ్ళు మాత్రం చిన్నప్పటి నుంచి తమను కష్టపడి పెంచిన బామ్మను వదలడం ఇష్టం లేక పల్లెటూర్లోనే ఉండాలనుకుంటారు. ఒక రోజు దేవి, లలితాంబలు కలిసి భర్తలకు చెప్పకుండా పట్టణానికి పారిపోతారు. అక్కడ ఉన్న తమ స్నేహితురాలు శకుంతలను కలుసుకోవాలని వాళ్ళ ఆలోచన. అయితే ఆమె ఇల్లు వాళ్ళిద్దరూ కనుక్కోలేకపోతారు. వీధుల్లో దిక్కు తోచక తిరుగుతుంటే వీళ్ళిద్దరినీ ఒకామె గంగాదేవి అనే బ్రోతల్ మహిళకు అమ్మడానికి ప్రయత్నిస్తుంది. అయితే బేరం కుదరక పోవడంతో ఆమె వాళ్ళను తన దగ్గరే ఉండనిస్తుంది. గంగాదేవికి కోపం వచ్చి తన దగ్గరున్న గూండాలను పంపి వారిద్దరినీ తీసుకురమ్మంటుంది. గూండాలు వాళ్ళను తరుముకు వస్తుంటే వారు తెలియకుండా గంగాదేవి ఇంటికే రక్షణ కోసం వెళ్ళి బంధీలవుతారు. భర్తలిద్దరూ తమ భార్యలను వెతుక్కుంటూ పట్నానికి వచ్చి వారిని రక్షిస్తారు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీత దర్శకత్వం వహించాడు[2].

క్ర.సం పాట గాయనీగాయకులు గీత రచన
1 ఒక్క భార్య ఉంటేను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.బి.శ్రీనివాస్,
ఎస్.జానకి,
రమణ
ఉత్పల
2 కడుప నెలకడ గడబిడ చేసెను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
3 నెల తప్పిందని తెలిసి నిలువెల్ల పులకించి ( పద్యం ) పి.సుశీల
4 నీకున్నదే కాస్త బుర్ర కాకులు ఇద్దరికీ కర్ర ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి కోరస్ వేటూరి
5 వినుకోండి కొండదొరల దండోరా బంగారు చిలకల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వేటూరి
6 సంసారంలో సత్యాగ్రహాలు గడిపిన ( బిట్ ) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
7 సీతారామస్వామి నేచేసిన నేరము ఏమి పి.సుశీల వేటూరి
8 హే పతివ్రత వాల్మీకి వ్రాయలేదు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]

  1. "Chiranjeevi Remakes: మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన చిత్రాలు ఇవే.. లైన్‌లో గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు." News18 Telugu. Retrieved 2022-09-10.
  2. కొల్లూరి భాస్కరరావు. "పట్నం వచ్చిన పతివ్రతలు - 1982". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 31 January 2020.