ప్రేమ పిచ్చోళ్ళు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ పిచ్చోళ్ళు
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం చిరంజీవి,
రాధిక
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ సత్యదేవి కంబైన్స్
భాష తెలుగు

ప్రేమ పిచ్చోళ్ళు ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన 1983 తెలుగు సినిమా. ఈ చిత్రంలో చిరంజీవి, రాధిక, కవిత, గుమ్మడి వెంకటేశ్వరరావు, రావు గోపాలరావు, అల్లు రామ లింగయ్య నటించారు. ఈ చిత్రం కొంతవరకు బసు ఛటర్జీ షాకీన్ నుండి ప్రేరణ పొందింది.

కథ[మార్చు]

చిరంజీవి రవి పాత్రలో నటించాడు, అతను నిరుద్యోగ పోస్ట్ గ్రాడ్యుయేటు. ప్రేమ (రాధిక) తో ప్రేమలో ఉన్నాడు. ప్రేమ స్థానిక బార్‌లో నర్తకి. తన బాసు అల్లు రామలింగయ్యనూ, అతని స్నేహితులు సింహం (రావు గోపాలరావు), గుమ్మడిలనూ ఆకర్షిస్తుంది. ముగ్గురు పాత స్నేహితులూ వైజాగ్‌లో కలుసుకుని ప్రేమను వలలో వేసుకోవాలని యోచిస్తారు. రవి తన గుర్తింపును వెల్లడించకుండా, డ్రైవర్‌గా వారి దగ్గర ఉద్యోగం పొందుతాడు. అతను గుమ్మడి కొడుకు సహాయం తీసుకుంటాడు. రవి, ప్రేమ ఒకే స్థలంలో నివసించే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మరింత దగ్గరవుతారు. ముగ్గురు వృద్ధులు ప్రేమ కోసం ఉచ్చులు ప్లాన్ చేస్తారు. ప్రతి ఒక్కరూ తాము ఆమెను ఎంత చక్కగా చిక్కించుకున్నామో అంటూ మిగతావారి దగ్గర, తమ కారులో రవితో ఉన్నప్పుడు గప్పాలు కొడతారు. ఓ తాగుబోతు వారు బాగా సన్నిహితంగా ఉన్నప్పటి ఫోటోలను తీస్తాడు. అవి చూసి రవి, ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటాడు. తరువాత ముగ్గురు వృద్ధులు తమ ప్రవర్తన ఒక యువ జంట ప్రేమను ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకుంటారు. వారి ప్రవర్తనకు సిగ్గుపడతారు. రవికి సత్యాన్ని వెల్లడిస్తారు. వారిని ఏకం చేస్తారు.

రవికి గుమ్మడి కర్మాగారంలో ఉద్యోగం, ప్రేమకు అల్లు హోటల్‌లో శాశ్వత ఉద్యోగం, సింహం ఇల్లూ ఇస్తారు. ముగ్గురు వృద్ధులు కలిగించే కామెడీ ఉల్లాసంగా ఉంటుంది.  

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

సినిమాలో పాటల జాబితా ఇలా ఉంది[1]

  • "చలి చలిగా" - గాయనీ గాయకులు: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. సాహిత్యం:: వేటూరి సుందరరామమూర్తి
  • "ఏ ముద్దబంతి" - గాయనీ గాయకులు: ఎస్. జానకి. సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
  • "ఓ బాటసారీ" - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
  • "దొంగా రారా" - గాయనీ గాయకులు: ఎస్. జానకి. సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
  • "గాల్ గాల్" - గాయనీ గాయకులు: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

మూలాలు[మార్చు]

  1. "Prema Pichollu(1983), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.song.cineradham.com. Archived from the original on 2015-03-19. Retrieved 2020-08-05.