Jump to content

జీ తెలుగు

వికీపీడియా నుండి

Zee తెలుగు
దేశంభారతదేశం
ప్రసారపరిధిప్రపంచవ్యాప్తం
కేంద్రకార్యాలయంహైదరాబాదు, తెలంగాణా, భారతదేశం
ప్రసారాంశాలు
భాష(లు)తెలుగు
చిత్రం ఆకృతి1080i HDTV
(downscaled to 576i for the SDTV feed)
యాజమాన్యం
యజమానిజీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్
(to be merged with Sony Pictures Networks India)
సోదరి ఛానళ్లుZee Cinemalu
Zee TV
Zee Anmol
Zee Cinema
Zee Bangla
Zee Bangla Cinema
Zee Keralam
Zee Tamil
Zee Thirai
Zee Kannada
Zee Picchar
Zee Marathi
Zee Yuva
Zee Talkies
Zee Vajwa
Zee Sarthak
Zee Punjabi
Zee Biskope
Zee Chitramandir
చరిత్ర
ప్రారంభం18 మే 2005; 19 సంవత్సరాల క్రితం (2005-05-18)
ప్రదేశం మార్పుఆల్ఫా టీవీ తెలుగు
లింకులు
వెబ్సైట్Zee Telugu
లభ్యత
కేబుల్
Available on most cable systemsCheck local listings for channels
Hathway
(Mumbai, India)
Channel 599 (SD)
Asianet Digital TV
(India)
Channel 173 (SD)
SDV DigitalChannel 03 (SD)
GTPL VAJI
(India)
Channel 644 (SD)
NXT DIGITAL
(India)
Channel 3 (SD)
ఉపగ్రహం
Sun Direct
(India)
Channel 158 (SD)
Channel 832 (HD)
Dish TV
(India)
Channel 1602 (SD)
Airtel digital TV
(India)
Channel 883 (SD)
Channel 884 (HD)
Reliance Digital TV
(India)
Channel 709 (SD)
Videocon d2h
(India)
Channel 694 (SD)
Channel 984 (HD)
TATA Sky
(India)
Channel 1404 (SD)
Channel 1403 (HD)
Dish Network (United States)Channel 772
Zuku TV (Kenya)Channel 941

Zee తెలుగు , తెలుగు కేబుల్ టెలివిజన్ లో ప్రసారమయ్యే ఒక చానెల్. ఈ చానెల్ భారతదేశానికి చెందినది. ఎస్సల్ గ్రూప్ కు చెందిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ఈ చానెల్ ను సమర్పిస్తోంది.[1]

స్థాపన

[మార్చు]

2004 నాటికి, జీ నెట్వర్క్ ఉత్తర, తూర్పు, పడమర భారతదేశ భాగాల్లో తనదైన ముద్ర వేసింది. అప్పటికే బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ వంటి భాషల్లో తన చానెళ్ళను ఏర్పాటు చేసింది. దక్షిణ భారత ఎంటర్టైన్మెంట్ మార్కెట్ లోకి తమ ప్రయాణాన్ని తెలుగు తో మొదలుపెట్టాలన్నారు. అసలు ఆగస్టు 2004లోనే తెలుగు చానెల్ ప్రారంభించాలని ఆ సంస్థ భావించింది,[2] కానీ ఆగస్టు దాకా లాంచ్ చేయడం కుదరలేదు.[3] నిజానికి ముందు ఈ చానెల్ పేరు ఆల్ఫా టీవీ తెలుగు అని పెట్టినా, తరువాత జీ తెలుగుగా పేరు మార్చారు. మొదట్లో అమెరికాకు చెందిన పలు సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసేది ఈ సంస్థ. ఆగస్టు 2007లో, ఈ సంస్థ ప్రముఖ బాలీవుడ్ సినిమా షోలేను తెలుగులోకి అనువాదం చేసింది.[4]

2000 దశాబ్ద చరిత్ర

[మార్చు]

డిసెంబరు 2005 నాటికి, ఉదయ భాను వ్యాఖ్యాతగా గోల్డ్ రష్(గేమ్ షో), నిశ్శబ్దం అనే ధారావాహిక ప్రసారమయ్యేవి. ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో వారపు రోజుల్లో 1.24%, వారాంతాల్లో 1.86% షేర్ మాత్రమే సాధించగలిగింది. దాంతో, లక్ష్యాన్ని మాస్ ప్రేక్షకుల నుంచీ యువ ప్రేక్షకులకు మార్చుకుని, కొత్త కార్యక్రమాలను రూపొందించింది.[3][5] ఈ నెట్వర్క్, 2007కు గానూ దాదాపు 460 మిలియన్ రూపాయల నష్టాన్ని భరించింది.[1]

2006 ఆఖర్లో, జీ తెలుగు చానెల్ స రి గ మ ప అనే తెలుగు సంగీత పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నంది అవార్డు గ్రహీత గాయని సునీత ఉపద్రష్ట వ్యాఖ్యాతగా, ప్రముఖ సంగీత దర్శకులు కోటి, రమణ గోగులలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం 35 ఎపిసోడ్ల పాటు ప్రసారం చేశారు.[6] ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైంది అంటే ఫిబ్రవరి 2007లో 6-13 ఏళ్ళ వయసు గల చిన్నపిల్లల సంగీత పోటీ కార్యక్రమం లిటిల్ చాంప్స్ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఐడెల్ రన్నర్ అప్ కారుణ్య వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.[7]

మీ ఇంటి వంట, అనే వంట కార్యక్రమాం, 1000 ఎపిసోడ్లు ప్రసారమైంది. ఈ కార్యక్రమానికి సుమలత వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ కార్యక్రమం మహిళా ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. అంతే కాక, మధ్యాహ్న సమయంలో ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా చూడటంతో, టీఆర్పీ కూడా బాగా పెరిగింది. దీంతో మిగిలిన చానెల్స్ కూడా వంట కార్యక్రమాలను మొదలుపెట్టేంతగా ఈ కార్యక్రమం విజయవంతమైంది.

జీ తెలుగులో విజయవంతమైన మరో కార్యక్రమం మిడ్ నైట్ మసాలా. ఈ కార్యక్రమంలో సినిమాల్లో వచ్చే పెద్దల సన్నివేశాలూ, పాటలు వేసేవారు. రాత్రి 12 గంటలకు ప్రసరమయ్యే ఈ కార్యక్రమానికి 2.0 టీఆర్పీ వచ్చింది. ఆ సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమాలకు వచ్చే టీఆర్పీ కన్నా ఇది ఎంతో ఎక్కువ. ఇప్పటికీ ఆ స్లాట్ లో ఏ తెలుగు షోకూ అంత టీఆర్పీ రాకపోవడం విశేషం. ఈ కార్యక్రమం 2007 డిసెంబరు - 2008 డీసెంబరు మధ్య ప్రసారమైంది. అయితే ఈ కార్యక్రమం చాలా రెచ్చగొట్టే విధంగా ఉందనీ, ఇంత పెద్దల కంటెంట్ సామాన్య టీవీలో రావడం మంచిది కాదని కొందరు చేసిన విమర్శల వల్ల ఆపేశారు.

ఆ తరువాతి కాలంలో శ్రీకరం శుభకరం అనే జాతక సంబంధ లైవ్ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సిద్ధాంతి వక్కంతం చంద్రమౌళి రోజూవారి జాతకాలు చెప్పగా, సుమలత వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆ తరువాత మిగిలిన చానెళ్ళు కూడా జాతక సంబంధ కార్యక్రమాలు మొదలుపెట్టడం విశేషం.

సెప్టెంబరు 2005లో, ఎన్నో తర్జనభర్జనల తరువాత తమ చానెల్ ప్రధాన నిర్వాహణ అధికారిగా సంజయ్ రెడ్డిని ప్రకటించింది. సంజయ్ అంతకు ముందు వాల్ట్ డిస్నీ సంస్థలోనూ, పెర్ల్ మీడియాలోనూ పని చేశాడు. అంతకు కొన్ని నెలల ముందే అజయ్ కుమార్ ఈ సంస్థను వీడటంతో సంజయ్ ను నిర్వాహణాధికారిగా ప్రకటించింది ఈ సంస్థ.[8] 2008లో సంజయ్ కొత్త సీరియళ్ళనూ, చిన్నపిల్లల కార్యక్రమాలనూ ప్రారంభించాడు.[9]

2010 తరువాత

[మార్చు]

మే 22, 2015న, జీ తెలుగు 10 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా వేడుకలు జరుపుకుంది.

15 అక్టోబరు 2017న, మిగిలిని అన్ని జీ చానెళ్ళతో పాటుగా, నీలం రంగు లోగోను మార్చుకుంది.

డిసెంబరు 31, 2017న, జీ తెలుగు తన సోదర చానెల్ జీ సినిమాలును మొదలుపెట్టింది. ఈ చానెల్ ను చిరంజీవి జీ గోల్డెన్ అవార్డ్స్ లో ప్రారంభంచాడు. అలాగే సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు.

ప్రస్తుతం ప్రసారమవుతున్న కార్యక్రమాలు

[మార్చు]

ధారావాహికలు

[మార్చు]

సోమ-శని

పేరు ప్రసార సమయం రౌడీ గారి పెళ్ళాం మధ్యాహ్నం 12.00
హిట్లర్ గారి పెళ్ళాం మధ్యాహ్నం 12.30
ఊహాలు గుసగుసలాడే మధ్యాహ్నం 1.00
గుండమ్మ కథ మధ్యాహ్నం 1.30
ఇంటి గుట్టు మధ్యాహ్నం 2.00
మిఠాయి కొట్టు చిట్టెమ్మ మధ్యాహ్నం 2.30
వైదేహి పరిణయం మధ్యాహ్నం 3.00
ముద్ద మందారం మధ్యాహ్నం 3.30
ముత్యాల ముగ్గు మధ్యాహ్నం 4.00
తెనాలి రామకృష్ణ మధ్యాహ్నం 4.30
మన అంబేద్కర్ మధ్యాహ్నం 5.30 కల్యాణ వైభోగం సాయంత్రం 6
కృష్ణ తులసి సాయంత్రం 6.30
రాధమ్మ కూతురు రాత్రి 7
మత్యమంత ముద్దు రాత్రి 7.30
నెం.1 కోడలు రాత్రి 8
త్రినయని రాత్రి 8.30


{Classic wikitable

! పేరు ! ప్రసార సమయం |- | ప్రేమ ఎంత మధురం | రాత్రి 9:00 |- | అగ్ని పరీక్ష | రాత్రి 9.30 |- |సూర్యకాంతం | రాత్రి 10:00 |}

ఆధ్యాత్మిక కార్యక్రమాలు

[మార్చు]
పేరు ప్రసార సమయం
శ్రీకరం శుభకరం ఉదయం 7.30
ఓంకారం ఉదయం 8:00
ఆరోగ్యమే మహాయోగం ఉదయం 8:30

రియాలిటీ కార్యక్రమాలు

[మార్చు]
పేరు ప్రసార సమయం వ్యాఖ్యాత ప్రసారమయ్యే రోజు
మాయద్వీపం రాత్రి 9
ఓంకార్
ఆదివారం

ఇతర సీరియళ్ళు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Das, Sibabrata (6 జూలై 2006), "Zee Tele's stock soars on ratings upswing, future prospects", IndianTelevision.com, retrieved 21 మార్చి 2008
  2. Kurmanath, K.V. (15 జూన్ 2007), "Zee's Telugu channel likely in August", Business Line, retrieved 21 మార్చి 2008
  3. 3.0 3.1 "Zee Telugu identifies key properties; to launch telefilm band in January", IndianTelevision.com, 15 డిసెంబరు 2007, retrieved 21 మార్చి 2008[permanent dead link]
  4. "Get set for Sholay in Telugu", The Hindu, 27 ఆగస్టు 2005, archived from the original on 15 సెప్టెంబరు 2006, retrieved 21 మార్చి 2008
  5. Singh, T. Lalith (2 జూలై 2007), "Get set for 'Gold Rush'", The Hindu, archived from the original on 26 అక్టోబరు 2012, retrieved 21 మార్చి 2008
  6. "A talent hunt for singers", The Hindu, 31 అక్టోబరు 2006, retrieved 21 మార్చి 2008[permanent dead link]
  7. "It's 'no acting, only singing' for Karunya; To anchor a music show on a Telugu television channel soon", The Hindu, 20 ఫిబ్రవరి 2007, archived from the original on 26 ఆగస్టు 2007, retrieved 21 మార్చి 2008
  8. Singh, T. Lalith (17 సెప్టెంబరు 2007), "Zee Telugu has a new CEO out of the box", The Hindu, archived from the original on 27 అక్టోబరు 2007, retrieved 21 మార్చి 2008
  9. Singh, T.L. (4 జనవరి 2008). "Zee Telugu on a roll out of the box". The Hindu. Archived from the original on 17 జనవరి 2008. Retrieved 20 మార్చి 2008.
"https://te.wikipedia.org/w/index.php?title=జీ_తెలుగు&oldid=4071217" నుండి వెలికితీశారు