Jump to content

అత్తారింట్లో అక్కాచెల్లెళ్ళు

వికీపీడియా నుండి
అక్కాచెల్లెళ్ళు
ఇలా కూడా సుపరిచితంఅత్తారింట్లో అక్కాచెల్లెళ్ళు
జానర్కుటుంబ నేపథ్యం
రచయితజీ తెలుగు నెట్ వర్క్
దర్శకత్వంరవీందర్ రెడ్డి
తారాగణం
  • భూమిరెడ్డి
  • నవ్యారావు
  • మధుబాబు
  • ఆకర్ష్
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సిరీస్‌లసంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య609
ప్రొడక్షన్
ప్రొడ్యూసర్సీతాకాంత్
కెమేరా సెట్‌అప్మల్టీ కెమెరా
నిడివి22 నిముషాలు
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జీ తెలుగు
వాస్తవ విడుదల25 మార్చి 2019 –
29 మే 2021
కాలక్రమం
సంబంధిత ప్రదర్శనలు"రెట్టాయ్ రోజా"
బాహ్య లంకెలు
Website

అత్తారింట్లో అక్కాచెల్లెళ్ళు 2019, మార్చి 25న జీ తెలుగులో ప్రారంభమైన తెలుగు ధారావాహిక.[1][2] ఇందులో చైత్రా రాయ్ (ద్విపాత్రిభినయం), మధుబాబు (ద్విపాత్రిభినయం), ఆకర్ష్ తదితరులు నటించారు. 2021లో చైత్రా రాయ్ నటించిన ధరణి-శ్రావణి పాత్రలలో భూమిశెట్టి, నవ్యారావులు నటించారు. తమిళ భాషలో జీ తమిళ్ లో వచ్చిన రెట్టాయ్ రోజా సీరియల్ ఆధారంగా ఇది రూపొందింది.[3][4] ఇది 2021, మే 29న ముగిసింది.

కథా నేపథ్యం

[మార్చు]

ఈ సీరియల్ ఇద్దరు కవల సోదరీమణులు శ్రావణి, ధరణి చుట్టూ తిరుగుతుంది. శ్రావణి ధరణిని ద్వేషిస్తుంటుంది. ఆమె ప్రపంచానికి రాణి కావాలని కలలుకంటుంటుంది. ధరణి తన కుటుంబాన్ని చెడు నుండి రక్షించడానికి ప్రయత్నిస్తుంటుంది.

శ్రావణి, ధరణి కవల సోదరీమణులు దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. వారి తండ్రి మంచి జీవితాన్ని ఇవ్వడానికి అనేక ఉద్యోగాలు చేస్తారు. శ్రావణి స్వశక్తి గల అమ్మాయి. ధరణి ప్రకృతిపై ఆసక్తి కలిగివుంటుంది. తమ పెంపకం, చదువు కోసం వారి తండ్రి పడుతున్న కష్టాలను, త్యాగాలను ఆమె గమనిస్తుంది. తమ తండ్రి భారాన్ని తగ్గించడానికి, శ్రావణి ఉన్నత విద్యను చదవడానికి, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి ధరణి తన చదువును, ఇతర సౌకర్యాలను త్యాగం చేస్తుంది. శ్రావణి తన కలలన్నింటినీ సాధించడానికి, న్యాయవాదిగా ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటుంది.

నటవర్గం

[మార్చు]

ప్రధాన నటవర్గం

[మార్చు]
  • చైత్రా రాయ్: (2019–2020) శ్రావణి, ధరణి (కవల సోదరీమణులు) గా ద్విపాత్రాభినయం[5]
    • ధరణి: (2021 - ప్రస్తుతం) పాత్రలో చైత్రా రాయ్ స్థానంలో భూమి శెట్టి నటించింది[6]
    • శ్రావణి: చైత్రా రాయ్ స్థానంలో నవ్యారావు (ముఖ మార్పిడి) నటించింది.
  • మధుబాబు: విక్రమ్, సూర్య ప్రతాప్ వర్మ (ద్విపాత్రాభినయం)
  • ఆకర్ష్: ఆదిత్య

ఇతర నటవర్గం

[మార్చు]
  • అను మానస
  • శ్రీ సత్య

రీమేక్

[మార్చు]

తమిళ భాషలో రెట్టాయ్ రోజాగా తీయబడింది. ఇది జీ తమిళంలో ప్రసారమయింది.[7] జీ తెలుగులో వచ్చిన "అక్కా చెల్లెళ్ళు"లో శ్రావణి మరణించిన దానికి, "రెట్టాయ్ రోజ"లో అనురాధ మరణించిన సంఘటనలు భిన్నంగా తీయబడ్డాయి. "అక్కా చెల్లెళ్ళు"లో శ్రావణికి కారు ప్రమాదం జరుగుతుంది, ఆమె కారు ఒక కొండపై నుండి కింద పడుతుంది. (శ్రావణి చనిపోదు. ఆమె ముఖం మార్పిడి జరుగుతుంది) [8] జీ తమిళ్ లోని "రెట్టై రోజా"లో శ్రీజ, చింతామణి కలిసి అనురాధను హత్య చేస్తారు. శ్రీజ అనురాధను కత్తితో పొడుస్తుంది.[9]

మూలాలు

[మార్చు]
  1. "'Akka Chellellu' all set for its premiere today". Times of India.
  2. "Zee Telugu's launches new fiction show 'Akka Chellellu'". Exchange4media.com.
  3. "Fashion Friday: These pictures of Attarintlo Akka Chellellu star Chaithra Rai will leave you in awe!".
  4. "America Ammayi's Seethakanth to produce Attarintlo Akka Chellellu". Times of India.
  5. "Chaitra Rai to quit Attarintlo Akka Chellellu". The Times of India.
  6. "Bhoomi Shetty to replace Chaitra Rai in Attarintlo Akka Chellellu". The Times of India.
  7. "Twin-drama comes to life with Zee Tamil's new fiction launch 'Rettai Roja'". Zee News.
  8. https://www.zee5.com/global/tvshows/details/akka-chellellu/0-6-1501/akka-chellellu-december-01-2020/0-1-manual_2erhjadccj60
  9. https://www.zee5.com/global/ru/tvshows/details/rettai-roja/0-6-1978/rettai-roja-september-26-2020/0-1-manual_767pg6pjojk0

బయటి లింకులు

[మార్చు]