భూమి శెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భూమి శెట్టి
జననం
భూమిక శెట్టి

(1998-02-19) 1998 ఫిబ్రవరి 19 (వయసు 26)
కుందాపుర, కర్ణాటక, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం

భూమిక శెట్టి (జననం 1998 ఫిబ్రవరి 19), ఒక భారతీయ నటి. కన్నడ భాష టెలివిజన్ ధారావాహిక కిన్నరి[1]లో, తెలుగు సిరీస్ నిన్నే పెళ్లాడతా[2]లో తన నటనకు ఆమె ప్రసిద్ధి చెందింది. ఆమె రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్ కన్నడ సీజన్ 7లో కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. ఆమె 2021 కన్నడ చిత్రం ఇక్కత్‌తో సినీ రంగ ప్రవేశం చేసింది.[3]

ప్రారంభ జీవితం

[మార్చు]

భూమి శెట్టి కర్నాటకలోని కుందాపురలో భాస్కర్, బేబీ శెట్టి దంపతులకు జన్మించింది. ఆమె కన్నడ, తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది. ఆమె చదువుకునే రోజుల్లో యక్షగానం నేర్చుకుంది.[4]

కెరీర్

[మార్చు]

భూమి శెట్టి తొలిసారిగా టెలివిజన్ ధారావాహిక కిన్నారిలో నటించింది. అందులో, ఆమె మణి అనే ప్రధాన పాత్రను పోషించింది.[5] నిన్నే పెళ్లాడతా అనే తెలుగు సీరియల్‌లో మృదులగా ప్రధాన పాత్రను కూడా పోషించింది.[6] 2019లో, ఆమె రియాలిటీ టీవీ షో, బిగ్ బాస్ కన్నడ ఏడవ సీజన్‌లో కంటెస్టెంట్‌గా కనిపించింది. 2021లో, ఆమె తెలుగు టెలివిజన్ సిరీస్ అత్తారింట్లో అక్కాచెల్లెళ్ళులో నటించింది.[7] కన్నడ చిత్రం ఇక్కత్ తో తన సినీ రంగ ప్రవేశం చేసింది, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇక్కత్ ప్రీమియర్ చేయబడింది.

అవార్డులు

[మార్చు]

భూమి శెట్టి హైదరాబాద్ టైమ్స్, 2018 సంవత్సరానికి స్మాల్ స్క్రీన్‌లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌ని గెలుచుకుంది.[8][9]

మూలాలు

[మార్చు]
  1. "Kinnari Kannada TV Serial".
  2. "Ninne Pelladatha Telugu TV Serial".telecast on Zee Telugu.
  3. "Want to be an open book with no boundaries, says 'Ikkat' actor Bhoomi Shetty". The New Indian Express. 21 July 2021. Retrieved 9 November 2021.
  4. Daithota, Madhu (2 April 2021). "Performing Yakshagana on stage again was liberating for me: Bhoomi Shetty". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 9 November 2021.
  5. "Here's how Bhoomi Shetty is spending her lockdown days". The Times of India (in ఇంగ్లీష్). 31 May 2021. Retrieved 9 November 2021.
  6. "Ninne Pelladatha Telugu TV Serial".
  7. "Bhoomi Shetty to replace Chaitra Rai in Attarintlo Akka Chellellu". The Times of India.
  8. "15 Small Screen Women Who Made It Into 'Hyderabad Times – 15 Most Desirable Women On Television 2018'".
  9. "Small screen stunners".