టింగు రంగడు
టింగురంగడు (1982 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | టి.ఎల్.వి.ప్రసాద్ |
తారాగణం | చిరంజీవి, గీత, జగ్గయ్య |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | అనిల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
టింగు రంగడు టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో తాతినేని ప్రకాశరావు అనిల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1982, అక్టోబర్ 1న విడుదలయ్యింది. చిరంజీవి, గీత, జగ్గయ్య, నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత: తాతినేని ప్రకాశరావు
- దర్శకత్వం: టి.ఎల్.వి.ప్రసాద్
- మాటలు: భీశెట్టి
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్య గానం: నందమూరి రాజా, పి.సుశీల
- సంగీతం: చక్రవర్తి
- ఛాయాగ్రహణం: దేవరాజు
- కళాదర్శకులు: కొండపనేని రామలింగేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: అనిల్ ప్రొడక్షన్స్
- విడుదల:01:10:1982.
నటీనటులు
[మార్చు]- చిరంజీవి - రంగడు
- గీత - రాధ
- నిర్మలమ్మ
- జగ్గయ్య - రామచంద్రరావు
- షావుకారు జానకి - జానకమ్మ
- నాగభూషణం - భూపతి
- నూతన్ ప్రసాద్ - కోటిగాడు
- జయమాలిని
చిత్రకథ
[మార్చు]రంగడు చలాకీ యువకుడు. తల్లీ తండ్రీ లేరు. ముత్తవ్వ దగ్గర పెరుగుతూ పైలాపచ్చీసుగా తిరుతుంటాడు. సంపన్నుడైన రామచంద్రరావు, అతని భార్య జానకమ్మ సంతానం లేక కుమిలి పోతూ వుంటారు. జానకమ్మ సోదరుడు భూపతి తన కొడుకు కోటిని తెచ్చి రామచంద్రరావు ఇంట్లో పెట్టి రామచంద్రరావును డాడీ అని పిలవమంటాడు. భూపతి మాయోపాయాలతో రామచంద్రరావు ఆస్తిని కాజేస్తూ వుంటాడు. ఇంతలో రంగడు రామచంద్రరావు ఇంట్లో ప్రవేశించి తాను రామచంద్రరావు మొదటి భార్య కొడుకునని, తన తల్లి చనిపోతూ ఇచ్చిన అడ్రసుతో తండ్రిని వెదుకుకుంటూ వచ్చానని చెబుతాడు. ఏకపత్నీవ్రతుడైన రామచంద్రరావు నిర్ఘాంతపోతాడు. జానకమ్మ మాత్రం రంగడి మంచి బుద్ధిని చూచి ఇంట్లో ఉండమంటుంది. ఇది భూపతికి కంటకప్రాయమవుతుంది. రంగడిని ఇంట్లోనుంచి పంపించివేయడానికి ఎన్నో ఎత్తులను వేస్తాడు. ఆ ఎత్తులను రంగడు ఎలా చిత్తు చేస్తాడు. భూపతి, కోటిగాడులకు ఎలా బుద్ధి చెబుతాడు అనేది మిగిలిన కథ[1].
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలను వేటూరి వ్రాయగా, చక్రవర్తి సంగీతం కూర్చాడు.[2]
క్ర.సం | పాట | గాయనీ గాయకులు |
---|---|---|
1 | పెదవుల రాగం పెర పెర తాళం ఎందుకని | నందమూరి రాజా, పి.సుశీల |
2 | మత్తు మత్తుగా హత్తుకోమని ఒంటిగుంటే | నందమూరి రాజా, పి.సుశీల |
3 | సారంగ సారంగ సారంగ చెబుతాను ఇనుకోర ఇవరంగా | నందమూరి రాజా |
4 | సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి చింతకాయ పచ్చడైన | నందమూరి రాజా |
మూలాలు
[మార్చు]- ↑ వి.ఆర్. (8 October 1982). "చిత్ర సమీక్ష - టింగు రంగడు". ఆంధ్రపత్రిక దినపత్రిక. Archived from the original on 22 January 2021. Retrieved 19 January 2020.
- ↑ కొల్లూరు భాస్కరరావు. "టింగు రంగడు 1982". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Retrieved 19 January 2020.