జీన్స్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీన్స్
దర్శకత్వంఎస్.శంకర్
స్క్రీన్ ప్లేఎస్. శంకర్
కథఎస్. శంకర్
నిర్మాతఎ. ఎం. రత్నం (సమర్పణ)
తారాగణంప్రశాంత్,
ఐశ్వర్యారాయ్
ఛాయాగ్రహణంఅశోక్ కుమార్
కూర్పుబి. లెనిన్, వి. టి. విజయన్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
పంపిణీదార్లుశ్రీ సూర్య మూవీస్
సినిమా నిడివి
167 ని.
భాషతెలుగు

జీన్స్ (Jeans) ఎస్. శంకర్ దర్శకత్వంలో 1998 విడుదలైన ఒక తెలుగు అనువాద చిత్రం. దీని మాతృక తమిళంలోని జీన్స్ సినిమా. ఇందులో ప్రశాంత్, ఐశ్వర్య రాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కథానాయకుడైన ప్రశాంత్, అతని తండ్రి పాత్ర పోషించిన నాజర్ ఇద్దరూ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. తమిళ సినిమాను అశోక్ అమృతరాజ్, సునంద మురళీ మనోహర్ నిర్మించగా తెలుగు అనువాదం ఎ. ఎం. రత్నం సమర్పణలో శ్రీ సూర్యా మూవీస్ పతాకంపై విడుదలైంది.[1]

కథ[మార్చు]

పెద్దబ్బాయి అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో ఒక రెస్టారెంట్ యజమాని. అతనికి రాము, విసు అనే ఇద్దరు కవల పిల్లలు. ఇద్దరూ వైద్య విద్యనభ్యసిస్తూ ఉంటారు. ఖాళీ సమయంలో తన తండ్రి రెస్టారెంట్ నడపడంలో సహాయం చేస్తుంటారు. అదే రెస్టారెంట్ లో జునో వంటవాడిగా పనిచేస్తుంటాడు. ఒకసారి విశ్వనాథ్ విమానాశ్రయంలో ఉండగా భారత్ నుంచి వచ్చిన మధుమిత, ఆమె బామ్మ కృష్ణవేణి, సోదరుడు మాదేష్ చిరునామా వెతుక్కుంటూ కనిపిస్తారు. విసు, రాము వారికి సహాయం చేస్తారు. కృష్ణవేణికి మెదడుకు సంబంధించిన ఒక శస్త్రచికిత్స కోసం అక్కడికి వస్తారు. అక్కడ వాళ్ళ బాగోగులు చూసుకోవలసిన కృష్ణవేణి బంధువైన శివ సుబ్రహ్మణ్యం రాకపోవడంతో వీళ్ళిద్దరు టాక్సీ బుక్ చేసి ఆసుపత్రికి పంపిస్తారు. అదే కళాశాలలో ఇద్దరూ చదువుతుంటారు.

కృష్ణవేణిని శస్త్రచికిత్స కోసం విసు పనిచేసే ఆసుపత్రిలో చేరుస్తారు. అయితే పేర్లలో గందరగోళం వల్ల ఆమెకు మెదడుకు ఒక వైపు చేయాల్సిన శస్త్రచికిత్స మరోవైపు చేస్తారు వైద్యులు. దాంతో ఆమె పక్షవాతానికి గురవుతుంది. విసు డాక్టర్లతో మాట్లాడి ఆమె ముందు తప్పుగా చేసిన చికిత్సను సరిగ్గా చేస్తారు. అలాగే వారు చేసిన పొరపాటుకు 2 మిలియన డాలర్ల పరిహారం ఇప్పిస్తాడు. విసు తమ కుటుంబం పట్ల చూపిస్తున్న అభిమానం చూసి అతనితో ప్రేమలో పాడుతుంది మధుమిత. వాళ్ళిద్దరూ ప్రేమలో పడిన సంగతి కృష్ణవేణి గమనించి ఒక చిన్న నాటకం ఆడి మరికొన్ని రోజులు అమెరికాలో ఉండేటట్లు చూస్తుంది.

కృష్ణవేణి వారిద్దరి పెళ్ళి ప్రస్తావన తేగా పెద్దబ్బాయి ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తాడు. ఇందుకు అతనికి ఒక కారణం ఉంటుంది. పెద్దబాయి, అతని తమ్ముడు కవల పిల్లలు. అతని తమ్ముడు అమాయకుడు కావడంతో చిన్నప్పటి నుంచి తానే పెద్దగా ఇద్దరూ కలిసి ఒక హోటల్ నడుపుతూ ఉంటారు. కానీ తమ్ముడికి పెళ్ళయిన తర్వాత సుందరమ్మకు పెద్దబ్బాయి అంతా పెత్తనం చెలాయించడం పెద్దగా ఇష్టం ఉండదు. సుందరమ్మ పెద్దబ్బాయి భార్యను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. సుందరమ్మ కాఠిన్యం వల్ల పెద్దబ్బాయి భార్య, రాము, విసులకు జన్మనిచ్చి పురిట్లోనే చనిపోతుంది. పెద్దబ్బాయి తమ్ముడిని వదిలేసి పిల్లలిద్దరినీ తీసుకుని అమెరికా వచ్చేసి రెస్టారెంట్ వ్యాపారం ప్రారంభించి జీవితంలో స్థిరపడతాడు. వాళ్ళిద్దరూ వేర్వేరు కుటుంబాల అమ్మాయిలకు పెళ్ళి చేసుకున్నందున సఖ్యంగా కలిసి ఉండలేకపోయారనీ, కాబట్టి తన కుమారులకు కూడా కవల పిల్లలనే భార్యలుగా తీసుకురావాలని అనుకుంటున్నట్లు చెబుతాడు.

కృష్ణవేణి మధుమిత ప్రేమను గెలిపించడానికి ఆమెను వైష్ణవి అనే కవల సోదరి ఉన్నట్లు అబద్ధమాడుతుంది. ఆమె వేరే కుటుంబంలో పెరుగుతున్నట్లు చెబుతుంది.

నటీనటులు[మార్చు]

సాంకేతిక సిబ్బంది[మార్చు]

  • దర్శకత్వం: ఎస్. శంకర్
  • మాటలు (తెలుగు): శ్రీరామకృష్ణ

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు.

  • కన్నులతో చూసేవీ
  • కొలంబస్ కొలంబస్
  • పూవుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
  • ప్రియా ప్రియా చంపొద్దే
  • రావే నా చెలియా
  • హాయ్ రబ్బా హాయ్ రబ్బా

మూలాలు[మార్చు]

  1. "డబుల్ ఫోటోల 'జీన్స్' మేజిక్ - Nostalgia". iDreamPost.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-09-19. Retrieved 2020-09-16.

బయటి లింకులు[మార్చు]