అద్దాలమేడ (1981 సినిమా)
అద్దాలమేడ (1981 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
తారాగణం | దాసరి, మురళీమోహన్ , జయసుధ, మోహన్ బాబు, గీత, అంబిక |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | బాలమురుగ పిక్చర్స్ |
భాష | తెలుగు |
అద్దాలమేడ 1981 లో విడుదలైన తెలుగు సినిమా. విజయశ్రీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై దాసరి నారాయణరావు, మురళీమోహన్, జయసుధ, మోహన్ బాబు, ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రాజన్-నాగేంద్ర సంగీతాన్నందించారు.[1]
దాసరి మహర్దశ అనుభవిస్తూ ఆయన పేరు ఇంటింటా మార్మ్రోగుతున్న సమయంలో రూపు దిద్దుకున్న సినిమా అద్దాలమేడ. అంతవరకు హీరో హీరోయిన్లు తప్ప ఒక దర్శకుని పేరుకి ఇంత క్రేజ్ ఏర్పడటం గొప్పతనం. శివరంజని తరువాత సినిమా నేపథ్యంలో నటీనటుల పర్సనల్ జీవితాలు ఎంత కృతకంగా ఉంటాయో అనే పాయింటు మీద దాసరి కథ అల్లేరు. వాళ్ళ రంగు రంగుల జీవితాల వెనుక ఎంత విషాదం గూడు కట్టుకుని ఉంటుందో తెరకెక్కించేరు. 1980లో ప్రారంభమైన అద్దాలమేడకు అక్క దాసరి పద్మ కెమెరా స్విచ్ ఆన్ చేస్తే కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు తొలి క్లాప్ ఇచ్చేరు.
తారాగణం
[మార్చు]- మురళీ మోహన్
- మోహన్ బాబు
- దాసరి నారాయణరావు
- జయసుధ
- గీత
- అంబిక
- ప్రభాకరరెడ్డి
- ఆర్.కె.ధర్మరాజు
- మాలి
- కె.వి.చలం
- గోకిన రామారావు
- మద్దాల రామారావు
- నళీనీకాంత్
- తిరుపతిరాజు
- నారాయణమూర్తి
- అశోక్ కుమార్
- ఝాన్సీ
- జానకి
- జయవిజయ
- అన్నపూర్ణ
- జయశీల
- సంగీత
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాణ సంస్థ: విజయశ్రీ ఆర్ట్స్ పిక్చర్స్
- కథా సహకారం: ఆర్.కె.ధర్మరాజు
- పాటలు:రాజశ్రీ, దాసరి నారాయణరావు
- నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
- స్టుడియోలు: ఎ.వియం, అరుణాచలం, కర్పగం
- స్టిల్స్: పి.రామానుజయ్య
- పబ్లిసిటీ డిజైన్స్: గంగాధర్
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: ఎన్.శేషు
- కేశాలంకరణ: ఈశ్వరి
- నృత్యం: సలీం, రాజు
- కళ: భాస్కరరాజు
- నిర్వహణ: ఎ.పి.రంగారావు
- సంగీతం: రాజన్ - నాగేంద్ర
- కూర్పు: జి.జి.కృష్ణారావు
- ఛాయాగ్రహణం: కె.ఎస్.మణి
- నిర్మాత: అంజనీకుమార్
- కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం, మాటలు: దాసరి నారాయణరావు
పాటలు
[మార్చు]- తొలిచూపు ఒక పరిచయం మలి చూపు ఒక అనుభవం, రచన: దాసరి నారాయణరావు, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- నా జీవిత గమనంలో ఒక నాయిక పుట్టింది. రచన: దాసరి నారాయణరావు, గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- ఎదురు చూస్తున్నాను నీలాల నింగిలో, రచన: దాసరి నారాయణరావు, గానం. శిష్ట్లా జానకి
- తారలన్నీ మల్లెలైతే ఆ మల్లెలేమొ సొంతమైతే, రచన: దాసరి నారాయణరావు, గానం. పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- నోరుమంచిదైతే ఊరు మంచిది, రచన: రాజశ్రీ, గానం. పులపాక సుశీల.
మూలాలు
[మార్చు]- ↑ "Addhala Meda (1981)". Indiancine.ma. Retrieved 2021-04-29.
2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.
బాహ్య లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అద్దాలమేడ
- "Addala Meda Telugu Full Movie". youtube.com.
{{cite web}}
: CS1 maint: url-status (link)