Jump to content

కోకిల (సినిమా)

వికీపీడియా నుండి
కోకిల
(1990 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం గీతాకృష్ణ
నిర్మాణం గుర్రం మహేశ్వరరావు
తారాగణం సరిత
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ కళ్యాణి ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

కోకిల 1990లో వచ్చిన సినిమా. గీతాకృష్ణ దర్శకత్వంలో నరేష్, శోభన, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. కంటి మార్పిడి అంశం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. సినీ రచయితగా ఎల్‌బి శ్రీరామ్ కు ఇది తొలిచిత్రం. అతను తరువాతి సంవత్సరాల్లో విజయవంతమైన రచయితగా నటుడిగా ఎదిగాడు.

నరేష్ అనే సాధారణ యువకుడు శోభనతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు. మొదట్లో వారు సంతోషంగానే జీవిస్తారు. అయితే తరువాత నరేష్ ఒక ప్రమాదంలో కళ్ళు పోగొట్టుకుంటాడు. దాంతో వారి కష్టాలు మొదలవుతాయి. కంటి మార్పిడి జరుగుతుంది. వింతగా నరేష్ తుపాకీ గురిపెట్టడం ప్రారంభిస్తాడు. నరేష్ ప్రస్తుతం అనుభవిస్తున్నది, అతని కళ్ళు దానం చేసిన వ్యక్తి మరణించే ముందు అనుభవించినదే అని వైద్యులు ఆశ్చర్యపోతారు. ఈ కేసును పరిష్కరించడానికి శరత్ బాబు అనే పోలీసు అధికారిని నియమిస్తారు.. కళ్ళు శక్తిని నిలుపుకుంటాయని శరత్ బాబు నమ్మరు. మిగతా సినిమా శరత్ బాబు ఈ రహస్యాన్ని ఎలా పరిష్కరిస్తాడనే దాని గురించి ఉంటుంది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని అన్ని పాటలను రచించిన వారు:వేటూరి సుందరరామమూర్తి; అన్ని పాటలకు సంగీతం సమకూర్చినవారు:ఇళయరాజా.

సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."నవోదయం"చిత్ర4:40
2."ఆకాశం మేఘాలు"చిత్ర4:45
3."తళుకు"మనో, చిత్ర4:40
4."కోకిలా"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర5:47
5."చంగు చకా"ఎస్.పి. శైలజ4:42